Crime News: తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ రోజు సాయంత్రం రాష్ట్రంలో భారీ వర్షం పడింది. చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈ క్రమంలోనే ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షం కురిసింది. అయితే మహబూబాబాద్ జిల్లాలో రెండు వేరు వేరు ప్రాంతాల్లో పిడుగులు పడి ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు.
ఒకరు గూడూరు మండలం గుండెంగ పంచాయతీ ఉద్యోగి మృతిచెందగా.. మరొకగరు ఓటాయి గ్రామానికి చెందిన గొర్రెల కాపరి చేరాలు చనిపోయాడు. దీంతో గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. మరోవైపు రాష్ట్రంలో అకాల వర్షాల వల్ల చాలా చోట్ల ధాన్యం తడిసి ముద్దయ్యింది. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాలుగైదు నెలలు కష్టపడి పండించిన పంట.. చేతికి రాకపోయేసరికి పుట్టెడు దుఖంతో మునిగిపోయారు. పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
Also Read: SBI Jobs: SBIలో భారీగా జాబ్స్.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఖాళీలు.. డోంట్ మిస్
ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు దంచికొట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
Also Read: Skywalk: హైదరాబాద్‌లో అత్యద్భుతంగా మరో స్కైవాక్.. త్వరలోనే ప్రారంభం.. ఎక్కడో తెల్సా..?