OTT Movie : ఈరోజు మన మూవీ సజెషన్ ఒక అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ సిరీస్. దీన్ని చూశాక వర్త్ వాచింగ్ సిరీస్ మావా అనాల్సిందే ఎవ్వరైనా. ఈ సిరీస్ పేరు ‘ప్రిజన్ బ్రేక్’ (prison break web series). ఈ అమెరికన్ సీరియల్ డ్రామా టెలివిజన్ సిరీస్ 2005 ఆగస్టు 29న ఫాక్స్ నెట్‌వర్క్‌లో ప్రీమియర్ అయింది. 2017 మే 30న ఐదవ సీజన్‌తో ముగిసింది. పాల్ షూరింగ్ సృష్టించిన ఈ సిరీస్ లో వెంట్‌వర్త్ మిల్లర్, డొమినిక్ పర్సెల్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ తప్పుడు ఆరోపణలతో జైలులో ఉన్న సోదరుడిని రక్షించడానికి ఒక స్ట్రక్చరల్ ఇంజనీర్ వేసే అద్భుతమైన జైలు ఎస్కేప్ ప్లాన్ చుట్టూ తిరుగుతుంది. ఈ సిరీస్ Netflix, Amazon Prime Video, Jio Cinema ఓటీటీలలో అందుబాటులో ఉంది.
సీజన్ 1: ఫాక్స్ రివర్ ఎస్కేప్
లింకన్ బరోస్ (డొమినిక్ పర్సెల్) వైస్ ప్రెసిడెంట్ సోదరుడిని హత్య చేశాడనే తప్పుడు ఆరోపణలతో, ఫాక్స్ రివర్ స్టేట్ పెనిటెన్షియరీలో డెత్ రోలో ఉంటాడు. అతని చిన్న సోదరుడు మైఖేల్ స్కోఫీల్డ్ (వెంట్‌వర్త్ మిల్లర్), ఒక బ్రిలియంట్ స్ట్రక్చరల్ ఇంజనీర్. తన సోదరుడు నిర్దోషి అని నమ్మి, అతన్ని రక్షించడానికి ఒక అద్భుతమైన ప్లాన్ వేస్తాడు. మైఖేల్ జైలు బ్లూప్రింట్‌లను తన శరీరంపై టాటూ రూపంలో దాచుకుని, ఒక బ్యాంక్ రాబరీ చేసి, ఉద్దేశపూర్వకంగా ఫాక్స్ రివర్ జైలులో చేరతాడు. అక్కడ అతను తన సోదరుడిని తప్పించడానికి ఒక ఎస్కేప్ ప్లాన్‌ను వేస్తాడు. ఇందులో సహ ఖైదీలైన సుక్రే (అమౌరీ నొలాస్కో), అబ్రుజ్జీ (పీటర్ స్టార్మేర్), టి-బ్యాగ్ (రాబర్ట్ నెప్పర్), వెస్ట్‌మోర్‌ల్యాండ్ (మ్యూస్ వాట్సన్) ఉంటారు. ఈ ప్లాన్‌లో డాక్టర్ సారా టాన్‌క్రెడి (సారా వేన్ కాలీస్), వెరోనికా డొనోవన్ (రాబిన్ టన్నీ) వంటి మిత్రులు కూడా సహాయపడతారు. అయితే జైలు గార్డ్‌లు, కంపెనీ అనే రహస్య సంస్థ, లింకన్‌ను చంపాలని కుట్ర చేస్తున్న రాజకీయ శక్తులు వారి ప్లాన్‌ను అడ్డుకుంటాయి. సీజన్ 1 ఒక సస్పెన్స్‌ఫుల్ ఎస్కేప్ ప్లాన్ తో, లింకన్ నిర్దోషిత్వాన్ని నిరూపించే ప్రయత్నంతో ముగుస్తుంది.
ఐదు సీజన్లు గా…
సీజన్ 2 : ది మ్యాన్‌హంట్, సీజన్ 3: సోనా ప్రిజన్, సీజన్ 4: ది కంపెనీ డౌన్‌ఫాల్, సీజన్ 5: రివైవల్.. ఇలా మొత్తంగా ఇదే స్టోరీ 5 సీజన్లలో ఉత్కంఠభరితంగా సాగుతుంది. రెండవ సీజన్లో హీరో అతని బ్రదర్ తప్పించుకోగా, వారి కోసం ఎఫ్బీఐ వేట మొదలవుతుంది. మూడవ సీజన్లో జేమ్స్ విస్లర్ (క్రిస్ వాన్స్) అనే ఖైదీని తప్పించడానికి ప్లాన్ చేస్తారు. 4వ సీజన్ లో మైఖేల్, లింకన్ అండ్ టీమ్ కంపెనీ అనే రహస్య సంస్థను ధ్వంసం చేయడానికి ఒక మిషన్‌లో చేరతారు. సీజన్ 4 ముగిసిన ఏడు సంవత్సరాల తర్వాత చనిపోయాడనుకున్న మైఖేల్ తిరిగి వస్తాడు. ప్రతి సీజన్ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ తో ముగుస్తుంది.
Read Also : అమ్మాయిలను అతి కిరాతకంగా చంపే సీరియల్ కిల్లర్స్… వణుకు పుట్టించే సీన్స్