E-Paper
Advertisement

పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన శ్రష్టి వర్మ.. ఏ పార్టీలో అంటే?

పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన శ్రష్టి వర్మ.. ఏ పార్టీలో అంటే?
Advertisement

Shrasti Verma:ప్రముఖ లేడి కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ (Shrasti Verma) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా జానీ మాస్టర్ పై కేసు పెట్టి ఒక్కసారిగా వైరల్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. అలాంటి ఈమె తాజాగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఈ మేరకు బీజేపీ కండువా కప్పుకున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన శ్రష్టి వర్మ..

నాంపల్లి లోని బీజేపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పలువురు బీజేపీలో చేరగా.. ఈ సందర్భంగా శ్రష్టి వర్మ కూడా తెలంగాణ బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా శ్రష్టి వర్మకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సినిమా రంగంలో కొరియోగ్రాఫర్ గా కొనసాగుతున్న శ్రష్టి వర్మ అకస్మాత్తుగా రాజకీయ రంగంలోకి అడుగుపెట్టడం మరింత ఆసక్తికరంగా మారింది. ఇకపోతే వచ్చే ఎన్నికలలో శ్రష్టి వర్మ పోటీ చేస్తారా? లేక ప్రచారానికే పరిమితం అవుతారా? అన్నది తెలియాల్సి ఉంది.

శ్రష్టి వర్మ ఆరోపణలు..

Advertisement

శ్రష్టి వర్మ విషయానికి వస్తే.. డాన్స్ కొరియోగ్రాఫర్ గా మంచి పేరు సొంతం చేసుకున్న ఈమె.. గతంలో జానీ మాస్టర్ పై లైంగిక వేధింపులు ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచింది. అసిస్టెంట్గా పనిచేస్తున్న సమయంలో తనపై జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు దిగారు అని , దాడి చేశారు అని, 2024 సెప్టెంబర్ లో నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా బాధితురాలు మైనర్ గా ఉన్నప్పటి నుంచే వేధింపులు ప్రారంభమయ్యాయి అని పేర్కొనడంతో పోలీసులు ఐపీసీ సెక్షన్లతో పాటు పోక్సో చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు. ముఖ్యంగా ఈ వివాదం కారణంగానే జానీ మాస్టర్ కు రావలసిన నేషనల్ వార్డు కూడా నేర్చుకోవడం అప్పట్లో సంచలనంగా మారింది. దీనికి తోడు తెలుగు ఫిలిం డాన్సర్స్ అసోసియేషన్ వివాదం సమయంలో కూడా శ్రష్టి వర్మ మీడియా ముందుకు వచ్చి జానీ మాస్టర్ తన అనుచరులు, అసిస్టెంట్లతో కలిసి దాడి చేయించడానికి వచ్చారు అంటూ ఆరోపించింది. మొత్తానికైతే శ్రష్టి వర్మ ఇలా ఏదో ఒక విషయంతో నిత్యం వార్తల్లో నిలుస్తూ అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఇప్పుడు ఏకంగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేసింది. మరి అమ్మడి ప్లాన్ ఏంటో అర్థం కావట్లేదు అంటూ నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు.

also read:బిగ్ బాస్ పై ఆట సందీప్ భార్య ఫైర్.. అలాంటి వారితో షో నడిపిస్తారా?

శ్రష్టి వర్మ కెరియర్..

Advertisement

ఇకపోతే శ్రష్టి వర్మ బిగ్ బాస్ సీజన్ 9లో కంటెస్టెంట్ గా పాల్గొనింది. అయితే అక్కడ ఎక్కువ కాలం నిలవలేక బయటకు వచ్చేసింది. డ్యాన్స్ అంటే ప్రాణమని చెప్పిన ఈమె.. దానినే కెరియర్గా మలుచుకుంది. ఛాన్సెస్ కోసం చూస్తున్న సమయంలో ఢీ షో నుంచి కాల్ రావడంతో అందులో పాటిస్పేట్ చేసింది. తనదైన డాన్స్ టాలెంట్ తో పాపులర్ అయ్యింది. ముఖ్యంగా జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పని చేసిన శ్రష్టి వర్మ తొలిసారి శర్వానంద్ హీరోగా నటించిన మనమే అనే సినిమాకి ఫస్ట్ కొరియోగ్రాఫర్ గా పనిచేస్తుంది. ఆ తర్వాత జైలర్, రంగస్థలం, పుష్ప 2, గేమ్ చేంజర్ వంటి పలు చిత్రాలకు పనిచేసింది. ఇకపోతే డాన్స్ తో పాటు మూవీలకు కొరియోగ్రాఫర్ గా పనిచేస్తూనే.. సినిమాలలో కూడా నటించింది.’ యథా రాజా తథా ప్రజా ‘ అనే సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. అందులో జానీ మాస్టర్ సరసనే హీరోయిన్గా చేసింది.

?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినికి షాక్ ఇచ్చిన సూరజ్ – పీఏగా జ్యోత్స్న అపాయింట్            

Ninnu kori Serial Today Episode October 5th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను జీవన్ చంపేస్తాడా..? చంద్ర కనిపెడుతుందా..? 

Nindu Noorella Saavasam Serial Today Episode October 5th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి తనను చంపేస్తుందని పార్థు పసిగడతాడా..?    

Monday Tv Movies : మూవీ లవర్స్ కు పూనకాలే.. వీటిని మస్ట్ వాచ్..

సుప్రీత ఆస్తుల విలువ ఎంతో తెలుసా? చిట్టా మొత్తం బయటపెట్టిందిగా?

పవన్ కళ్యాణ్ రాజకీయాల పై సుప్రీత కామెంట్స్… పండగ చేసుకున్నాం అంటూ!

సుప్రీత నెల సంపాదన ఎంతో తెలుసా? అందం కోసం అంత ఖర్చు చేస్తుందా?

డ్రగ్స్ వ్యవహారం…ఏడవని రోజు లేదు సుప్రీత ఎమోషనల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×