E-Paper
Advertisement

40 డిగ్రీలకే కరిగిన బ్రిటన్ రోడ్లు.. 45 దాటినా చెక్కుచెదరని భారత్ రోడ్లు.. అసలు రహస్యం ఇదే!

40 డిగ్రీలకే కరిగిన బ్రిటన్ రోడ్లు.. 45 దాటినా చెక్కుచెదరని భారత్ రోడ్లు.. అసలు రహస్యం ఇదే!
Advertisement

UK Roads: యూరప్ దేశాల్లో రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బ్రిటన్ (UK)లోని రోడ్లు ఎండ దెబ్బకి కరిగిపోతున్నాయన్న వార్తలు.. ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. బ్రిటన్ లో 40 డిగ్రీల టెంపరేచర్ కు రోడ్లు కరగడం ఏంటన్న ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతోంది. భారత్ లో 45 డిగ్రీలకు పైగా ఎండ నమోదైనప్పుడు ఇక్కడి రోడ్లు బాగానే ఉన్నాయి కదా అని చాలా పేర్కొంటున్నారు. దీన్ని బట్టి బ్రిటన్ రోడ్లు నాణ్యతమైనవి కావని.. భారత్ రోడ్లు చాలా స్ట్రాంగ్ అన్న అభిప్రాయాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఇందులో వాస్తవమెంత? బ్రిటన్ రోడ్లపై అక్కడి వాతావరణం చూపిస్తున్న ప్రభావం ఏంటి? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

బ్రిటన్ రోడ్ల ‘చలి రహస్యం’

బ్రిటన్ అనేది ఏడాది పొడవునా చల్లగా ఉండే దేశం. అక్కడ శీతాకాలంలో మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అందుకే అక్కడి రోడ్లను నిర్మించేటప్పుడు ‘సాఫ్ట్ బిటుమెన్’ (మెత్తటి తారు)ను ఉపయోగిస్తారు. వాతావరణం బాగా చల్లబడినప్పుడు రోడ్లు గట్టిపడి, పగుళ్లు రాకుండా ఉండటానికి ఈ రకమైన తారు సహాయపడుతుంది. అయితే బ్రిటన్‌లో ఉష్ణోగ్రతలు అకస్మాత్తుగా 40 డిగ్రీలు దాటినప్పుడు ఆ వేడికి ఈ మెత్తటి తారు తట్టుకోలేక కరిగిపోతోంది. ఆ రోడ్లను చలిని తట్టుకోవడానికే డిజైన్ చేయడం వల్ల.. వేడి రికార్డు స్థాయిలో పెరిగినప్పుడు అవి తట్టుకోలేకపోతున్నాయి.

మన రోడ్ల వెనుక వ్యూహం

Advertisement

బ్రిటన్ పరిస్థితులకు పూర్తి భిన్నంగా భారత్ లోని వాతావరణం ఉంటుంది. ఇక్కడ ఎండ తీవ్రత చాలా ఎక్కువ. అందుకే భారతీయ రోడ్ల నిర్మాణంలో ‘హార్డ్ గ్రేడ్ బిటుమెన్’ (VG-30 లేదా VG-40 వంటి గట్టి తారు)ను ఉపయోగిస్తారు. ఈ రకమైన తారు 50 డిగ్రీల పైబడిన ఉష్ణోగ్రతల్లో కూడా స్థిరంగా ఉంటుంది. రోడ్డు ఉపరితలం ఎంత వేడెక్కినా కరగకుండా ఉండేలా ఈ మిశ్రమాన్ని తయారు చేస్తారు. ఒకవేళ ఇండియాలో వాడే తారును బ్రిటన్‌లో వాడితే అక్కడ శీతాకాలంలో వచ్చే మంచుకు ఆ రోడ్లన్నీ పగుళ్లు ఇచ్చి ముక్కలైపోతాయి.

Also Read: ఏఐ క్లీనిక్స్.. డాక్టర్ లేకుండానే సెకన్లలో రోగ నిర్ధరణ, చికిత్స.. మందులు కూడా అవే ఇచ్చేస్తాయ్!

వాతావరణమే ప్రధాన సమస్య

Advertisement

ఏ దేశంలోనైనా రోడ్లను అక్కడి 90 శాతం వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నిర్మిస్తారు. బ్రిటన్‌కు ఏడాదిలో కొన్ని రోజులు మాత్రమే వచ్చే ఎండల కంటే దాదాపు ఎప్పుడూ ఉండే చలి వాతావరణమే ముఖ్యం. అలాగే భారత్‌కు చలి కంటే తీవ్రమైన ఎండలను తట్టుకోవడమే ప్రాధాన్యత. కాబట్టి బ్రిటన్ రోడ్లు కరగడానికి కారణం సాంకేతిక లోపమో, అవినీతో కాదు. కేవలం ప్రకృతి సిద్ధమైన వాతావరణ మార్పులే. గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఇప్పుడు బ్రిటన్ సైతం తమ రోడ్ల డిజైన్లను మార్చుకోవడంపై ఆలోచనలు చేస్తోంది.

Also Read: రూ.1500 లోపే ప్రీమియం స్మార్ట్‌వాచ్..ఎగబడి కొంటున్న జనం

Related News

ధర తక్కువ.. బెనిఫిట్స్ ఎక్కువ.. Airtel టాప్ ఎంట్రీ లెవెల్ ప్లాన్స్ ఇవే!

2-పిన్, 3-పిన్ ప్లగ్‌ల మధ్య తేడా ఏంటి? ఇవి కేవలం డిజైన్ కోసమేనా లేక సేఫ్టీ కోసమా?

ల్యాప్‌టాప్ లైఫ్ ఎక్కువ రోజులు రావాలంటే షట్ డౌన్ చేయాలా? లేదా స్లీప్ మోడ్ బెటరా?

ఫోన్ ఛార్జ్ ఇట్టే పోతుందా? ఈ యాప్స్ ఏ కారణం!

120 ఏళ్ల నాటి రాక్షస చేప.. దోమల నివారణకు తెస్తే.. దీవినే మింగేస్తోంది..!

10 గంటలు బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే.. ఓరియంట్ ఫ్యాన్, కరెంట్ లేకపోయినా నో టెన్షన్

రూ.849కే పోర్టబుల్ స్పీకర్..సౌండ్ వింటే మైండ్ బ్లాక్!

రూ.699కే ఫైర్‌బోల్ట్ ఇయర్‌బడ్స్..అదిరిపోయే ఫీచర్లపై ఓ లుక్కేయండి

Big Stories

Advertisement
×