E-Paper
Advertisement

Wi-Fi 8 రాకతో డెడ్ జోన్స్ మాయం.. సిగ్నల్ డ్రాప్స్‌కి పర్మనెంట్ చెక్ పెట్టేసే కొత్త ఫీచర్లు!

Wi-Fi 8 రాకతో డెడ్ జోన్స్ మాయం.. సిగ్నల్ డ్రాప్స్‌కి పర్మనెంట్ చెక్ పెట్టేసే కొత్త ఫీచర్లు!
Advertisement

Wi-Fi 8 Mesh Routers: ఇంట్లో Wi-Fi విషయంలో ఒక్కోసారి భలే చిరాకు వస్తుంది. హాల్‌లో కూర్చుంటే ఫుల్ స్పీడ్.. బెడ్‌రూమ్‌లోకి వెళ్లగానే సిగ్నల్ స్లో. వీడియో చూస్తుంటే బఫరింగ్, వీడియో కాల్‌లో ఉంటే మధ్యలో కనెక్షన్ కట్. ఇంట్లో ఏ మూలకు వెళ్లినా Wi-Fi సరిగ్గా రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు ఇప్పుడు మరో కొత్త టెక్నాలజీ రాబోతోంది. అదే Wi-Fi 8.

అయితే Wi-Fi 8 అంటే మరోసారి స్పీడ్ పెంచే టెక్నాలజీ అనుకుంటే పొరపాటే. ఈసారి ఫోకస్ అంతా కనెక్షన్‌ను మరింత స్థిరంగా ఉంచడంపైనే. ఇంట్లో ఎన్ని డివైజ్‌లు కనెక్ట్ అయి ఉన్నా.. ఒక గది నుంచి మరో గదికి వెళ్లినా సిగ్నల్ అంతగా ఇబ్బంది పెట్టకుండా ఉండేలా Wi-Fi 8ను రూపొందిస్తున్నారు. ఇప్పటికే TP-Link, ASUS వంటి కంపెనీలు Wi-Fi 8 డివైజ్‌లను పరిచయం చేశాయి. మరి ఈ కొత్త వైఫై మనకు నిజంగా ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఇప్పుడున్న రూటర్‌ను మార్చేసి Wi-Fi 8కి అప్డేట్ అవ్వాల్సిన అవసరం ఉందా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

స్పీడ్ కాదు.. కనెక్షన్ ముఖ్యం:

Advertisement

సాధారణంగా ప్రతి కొత్త వైఫై జనరేషన్‌లో వేగం పెంచుతారు. కానీ వైఫై 8లో వేగం కన్నా కనెక్షన్ స్థిరత్వానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. వైఫై 7లో ఉన్న గరిష్ట వేగం 46 జిబిపిఎస్‌నే దీనిలోనూ కొనసాగించారు. లాబొరేటరీలో కొలిచే థియరిటికల్ స్పీడ్స్ మనకు ఇంట్లో రావు కాబట్టి.. ఎంతమంది వాడినా, ఇల్లు ఎంత పెద్దగా ఉన్నా సిగ్నల్ కట్ కాకుండా ఉండటమే వైఫై 8 ప్రధాన లక్ష్యం.

Also Read: ఒక్కసారి కొంటే 5 ఏళ్లు తిరుగుండదు.. బడ్జెట్‌లో టాప్-5 ఆండ్రాయిడ్ ఫోన్లు ఇవే!

డెడ్ జోన్స్‌కు ఇక సెలవు:

Advertisement

మన ఇంట్లోని గోడలు, ఫర్నిచర్ వల్ల వైఫై సిగ్నల్ బలహీనపడుతుంది. వైఫై 8లో తీసుకొచ్చిన కొత్త ఇంజనీరింగ్ వల్ల మనం ఒక గది నుంచి ఇంకో గదికి వెళ్తున్నప్పుడు సిగ్నల్ సడెన్‌గా పడిపోదు. ఫోన్ పట్టుకుని ఇల్లంతా తిరిగినా ఇంటర్నెట్ చాలా స్మూత్‌గా పనిచేస్తుంది. మూలల్లో ఉండే డెడ్ జోన్స్ సమస్యను ఇది క్రమంగా తగ్గించేస్తుంది.

ఒకేసారి ఎన్ని డివైజ్లైనా నో ప్రాబ్లం:

ఇంట్లో ఫోన్లు, స్మార్ట్ టీవీ, ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు.. ఇలా ఎన్నో డివైజ్లు ఒకేసారి వైఫైకి కనెక్ట్ అయి ఉంటాయి. దీనివల్ల నెట్‌వర్క్ నెమ్మదిస్తుంది. వైఫై 8లో ఉన్న సిగ్నల్ కో-ఆర్డినేషన్ టెక్నాలజీ వల్ల, రూటర్లు తమలో తాము సమాచారాన్ని పంచుకుని ప్రతి డివైజ్ సరిగ్గా పనిచేసేలా వేర్వేరుగా సిగ్నల్స్ అందిస్తాయి. దీనివల్ల ట్రాఫిక్ జామ్ సమస్య ఉండదు.

ఇప్పుడే కొనడం అవసరమా?

మీ ఇంట్లో ప్రస్తుత వైఫైతో తీవ్రమైన సిగ్నల్ సమస్యలు ఉంటే వైఫై 8 రూటర్ ఉపయోగపడుతుంది. అయితే, మనం వాడే ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు కూడా వైఫై 8కి సపోర్ట్ చేస్తేనే పూర్తి ఫలితం కనిపిస్తుంది. అవి మార్కెట్లోకి రావడానికి మరో రెండేళ్లు పడుతుంది. కాబట్టి ఇప్పుడు కొత్త మెష్ రూటర్ కొనడం సుదూర భవిష్యత్తు కోసం చేసే పెట్టుబడి మాత్రమే.

Also Read: iPhone 18 Pro కొనే ప్లాన్ ఉందా? బ్యాటరీ టెస్ట్‌లో బయటపడ్డ షాకింగ్ విషయాలివే!

Tags

Related News

స్కూల్ బ్యాగ్ కాదు.. బుల్లెట్ ప్రూఫ్ కవచం.. టర్కీ కంపెనీ వినూత్న ఆవిష్కరణ!

చూడగానే నచ్చేసే క్యూట్ డిజైన్.. బోస్ సౌండ్‌తో నాయిస్ మాస్టర్ బడ్స్ ఓపెన్, ఆఫర్ ధర ఎంతంటే?

ఒక్కసారి కొంటే 5 ఏళ్లు తిరుగుండదు.. బడ్జెట్‌లో టాప్-5 ఆండ్రాయిడ్ ఫోన్లు ఇవే!

బాధను కూడా నవ్వుతూ చెప్పేస్తున్న Gen Z.. సోషల్ మీడియాలో ఇదో కొత్త ట్రెండ్!

AI ఏసీలు నిజంగా కరెంట్ బిల్లు తగ్గిస్తాయా? లేక కంపెనీల మైండ్ గేమా?

రూ.571కే పవర్ బ్యాంక్..మ్యాగ్‌సేఫ్ ఫీచర్‌తో అదిరిపోయే ఆఫర్!

మార్కెట్‌లోకి ఆసుస్ జీ16 కొత్త మోడల్ లాంచ్..పూర్తి వివరాలివిగో!

Big Stories

Advertisement
×