iPhone 18 Pro: యాపిల్ నుంచి కొత్తగా వచ్చిన ఐఫోన్ 18 ప్రో యూజర్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఛార్జింగ్ స్పీడ్ విషయంలో మునుపటి మోడల్స్‌తో పోలిస్తే.. పెద్ద మార్పే తీసుకొచ్చారు. అయితే ఇదే సమయంలో బ్యాటరీ టైమ్ విషయంలో ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఛార్జింగ్ చాలా వేగంగా అవుతున్నప్పటికీ, బ్యాటరీ లైఫ్ మాత్రం కొన్ని పరిస్థితుల్లో అనుకున్నంతగా రావడం లేదని ఒక పరిశోధనలో తేలింది. అసలు దీనికి కారణమేంటో, ఈ ఫోన్ పనితీరు ఎలా ఉందో వివరంగా తెలుసుకుందాం.
జపాన్‌కు చెందిన గిగాజైన్ అనే ప్రముఖ టెక్ పబ్లికేషన్ ఐఫోన్ 18 ప్రో బ్యాటరీపై కొన్ని ప్రత్యేక పరీక్షలు నిర్వహించింది. ఫుల్ బ్రైట్‌నెస్, 50 శాతం వాల్యూమ్, వైఫై కనెక్షన్‌లో యూట్యూబ్ వీడియోలు ప్లే చేసి చూశారు. ఈ టెస్ట్‌లో ఐఫోన్ 18 ప్రో దాదాపు 10 గంటల పాటు మాత్రమే పనిచేసింది. కానీ, ఇదే సేమ్ టెస్టింగ్ పద్ధతిలో పాత మోడల్ అయిన ఐఫోన్ 17 ప్రో ఏకంగా 15 గంటల 41 నిమిషాల పాటు పనిచేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
Also Read: రూ.9,999 బడ్స్ ఇప్పుడు రూ.3,399కే.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో దిమ్మతిరిగే డీల్!
యాపిల్ అధికారికంగా ఐఫోన్ 18 ప్రో దాదాపు 34 గంటల వీడియో ప్లేబ్యాక్ ఇస్తుందని చెప్తోంది. అయితే యాపిల్ టెస్టింగ్ పద్ధతులు వేరుగా ఉంటాయి. వారు ఆఫ్ లైన్ వీడియోలను ఆటో బ్రైట్‌నెస్ ఆఫ్ చేసి టెస్ట్ చేస్తారు. మరోవైపు జీఎస్ఎమ్ అరేనా, టామ్స్ గైడ్ వంటి ప్రముఖ టెక్ సైట్లు జరిపిన పరీక్షల్లో మాత్రం ఈ కొత్త మోడల్ మంచి బ్యాటరీ రన్ టైమ్ ఇచ్చిందని తేలింది. అంటే మనం వాడే విధానాన్ని బట్టి బ్యాటరీ లైఫ్‌లో మార్పులు కనిపిస్తున్నాయి.
ఈ ఫోన్‌లో ఛార్జింగ్ స్పీడ్ మాత్రం చాలా వేగంగా ఉంటుంది. 60 వాట్స్ అంతకంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న అడాప్టర్‌తో కేవలం 15 నిమిషాల్లోనే 50 శాతం ఛార్జింగ్ అవుతుంది. 70 వాట్స్ ఛార్జర్‌తో టెస్ట్ చేసినప్పుడు అర గంటలో 80 శాతం ఛార్జ్ అయి, గంటలో ఫుల్ ఛార్జింగ్ పూర్తయింది. వైర్‌లెస్ ఛార్జింగ్ కూడా వేగవంతం చేశారు. ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు యాపిల్ ఇందులో వేపర్ ఛేంబర్ టెక్నాలజీని ఉపయోగించింది.
అమెరికాలో ఐఫోన్ 18 ప్రో 256జీబీ వేరియంట్ ప్రారంభ ధర రూ.1,00,000 వరకు ఉంటుంది. వేగవంతమైన ఛార్జింగ్ కావాలా లేక రోజంతా ఎక్కువసేపు వచ్చే బ్యాటరీ లైఫ్ కావాలా అనేది యూజర్లు తమ అవసరాలను బట్టి ఆలోచించుకోవాలి. రెండింటినీ బేరీజు వేసుకుని అప్‌గ్రేడ్ అవ్వడం మంచిది.
Also Read: ఇంతకీ ఈ LTPO డిస్‌ప్లే కథేంటి? స్మార్ట్‌ఫోన్లలో ఇది ఉంటే బ్యాటరీ లైఫ్ డబుల్ అవుతుందా?