E-Paper
Advertisement

జై షాపై పాకిస్తాన్ కొత్త కుట్ర‌లు…ICC కొత్త బాస్ గా మొహ్సిన్ న‌ఖ్వీ?

జై షాపై పాకిస్తాన్ కొత్త కుట్ర‌లు…ICC కొత్త బాస్ గా మొహ్సిన్ న‌ఖ్వీ?
Advertisement

Jay Shah Vs Mohsin Naqvi: 2027 వన్డే వరల్డ్ కప్ టోర్న‌మెంట్ కు (2027 ODI World Cup tournament) మరో ఏడాది సమయం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే ఈ టోర్నమెంట్ లో పాల్గొనే జట్లు అన్ని వన్డేలపై దృష్టి సారించాయి. టీ20 లను పక్కకు పెట్టి వన్డేలు మాత్రమే ఆడుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఐసీసీ బాస్ జైషాపై (ICC Jay Shah) పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (Pakistan Cricket Board) కొత్త కుట్రలకు తెరలేపినట్టు తెలుస్తోంది.

జై షాపై పాకిస్తాన్ కొత్త కుట్ర‌లు…ICC కొత్త బాస్ గా మొహ్సిన్ న‌ఖ్వీ?

అతని పదవీకాలం ముగియకముందే.. సాగనంపేందుకు పావులు కదుపుతోంది. 2027 వన్డే వరల్డ్ కప్ ప్రారంభానికి అంటే ముందు అతన్ని దించేసి చైర్మన్ పదవిలో మొహ్సిన్ న‌ఖ్వీని కూర్చోబెట్టేలా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు రంగం సిద్ధం చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఆ దిశగా ఇతర క్రికెట్ బోర్డులతో కూడా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. అన్ని క్రికెట్ బోర్డులను ఏకం చేసి, ఐసీసీ బాస్ జైషాను గ‌ద్దె దింపుతామ‌ని పాకిస్తాన్ సోష‌ల్ మీడియాలో కూడా ప్ర‌చారం జోరుగా సాగుతోంది.

Advertisement

Pakistan Team Former Captain Shahid Afridi Shocking Comments On Abhishek Sharma Goes Viral  నా కంటే అభిషేక్ భయంకరంగా ఆడుతున్నారు..ప్రతీ సిక్సర్ స్టేడియం బయటే పడుతోంది

టీమిండియాకు అనుకూలంగా పిచ్ లు మార్చుతున్నాడని జై షాపై ఆరోపణలు

2024 నుంచి టీమిండియా ఇప్పుడు వరకు మొత్తం మూడు ఐసీసీ ట్రోఫీలు దక్కించుకుంది. అయితే దీన్ని చూసి ఓర్వలేక పోతున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.. నిత్యం ఇండియాపై ఏదో ఒక ఆరోపణ చేస్తూనే ఉంది. అక్కడి మాజీ క్రికెటర్లు కూడా రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. ఐసీసీ అధ్యక్షుడు జై షా ఇండియాకు అనుకూలంగా ఫ్లాట్ మైదానాలను ఏర్పాటు చేయడం వల్ల మూడు ట్రోఫీలు వచ్చాయని ఆరోపిస్తున్నారు.

Advertisement

2027 వన్డే వరల్డ్ కప్ దక్షిణాఫ్రికాలో జరుగుతున్న నేపథ్యంలో… అక్కడ కూడా ఇండియాకు అనుకూలంగా ఉండే ఫ్లాట్ మైదానాలు చేయిస్తున్నాడని జై షాను అవమానిస్తున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టి.. అతని పదవీ కాలం ముగియక ముందే దింపే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే అన్ని క్రికెట్ బోర్డులతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చర్చలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అతని స్థానంలో మొహ్సిన్ న‌ఖ్వీని చేయాలని పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ కూడా కుట్రలకు తెరలేపినట్టు సమాచారం అందుతోంది.

జై షా ప‌ద‌వీ కాలం ఎప్ప‌టి వ‌ర‌కు ?

అంత‌ర్జాతీయ క్రికెట్ బోర్డు చైర్మ‌న్ ప‌ద‌విలో జై షా 2027 ఏప్రిల్ వ‌ర‌కు కొన‌సాగుతారు. కానీ అత‌న్ని 2027 డిసెంబ‌ర్ వ‌ర‌కు కొన‌సాగించే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. కాబ‌ట్టి పాకిస్తాన్ కుట్రలేమీ జై షా విష‌యంలో ప‌ని చేయ‌బోవంటూ చ‌ర్చ న‌డుస్తోంది.

Harbhajan Singh Reaction On Ricky Ponting smashes World Cup-winning ton vs India: 2003 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాంటింగ్ ను క్లీన్ బౌల్డ్ చేసేవాడిని…కానీ గంగూలే ప్లాన్ చెడ‌దొబ్బాడు

Related News

ఇండియాలో అన్ని ఫ్లాట్ పిచ్ లే…అందుకే బ్యాట‌ర్లు చిత‌క‌బాదుతున్నారు

కావ్య పాప‌కు కొత్త త‌ల‌నొప్పి…RCBలోకి వెళ్తానంటూ అభిషేక్ శ‌ర్మ బెదిరింపులు?

రజత్ పాటిదర్ కెప్టెన్ గా పనికేరాడు..కానీ రెండు టైటిల్స్ తెచ్చాడు!

పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు బిగ్ షాక్…500 శాతం పడిపోయిన ఆదాయం?

ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన రొనాల్డో ఆస్తులు ఎన్ని కోట్లంటే? రెండు ప్రైవేట్ జెట్స్

కావ్య పాప స్కెచ్ అదుర్స్…రంగంలోకి మరో ఇద్దరు బౌలర్లు, ఇక SRHను చూస్తేనే తడిచిపోవాలి

ముంబై జ‌ట్టులో హార్దిక్ పాండ్యాను ఏకాకిని చేశారు..తెర‌వెనుక‌ రోహితే కుట్ర‌లు చేశాడు!

Big Stories

Advertisement
×