E-Paper
Advertisement

థియేటర్ మీ ఇంట్లోనే.. ఫీచర్స్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!

థియేటర్ మీ ఇంట్లోనే.. ఫీచర్స్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
Advertisement

XGIMI Horizon 20 Projector: ఈ రోజుల్లో వీకెండ్ వచ్చిందంటే చాలు.. థియేటర్‌కు వెళ్లి సినిమా చూసే ఓపిక ఎవరికీ ఉండట్లేదు. అందుకే అందరూ ఓటీటీలకు అలవాటు పడిపోతున్నారు. అయితే.. ఫోన్లలోనో, టీవీల్లోనో చూస్తే ఆ థియేటర్ కిక్ రాదు కదా. సరిగ్గా ఇక్కడే ఎంట్రీ ఇచ్చింది XGIMI Horizon 20. మీ ఇంటి లివింగ్ రూమ్‌ను సైతం ఒక మినీ ఐమాక్స్ థియేటర్‌గా మార్చే పవర్ దీనికుంది. అదిరిపోయే.. 4K క్లారిటీ, ట్రిపుల్ లేజర్ పవర్, ఇన్-బిల్ట్ గూగుల్ టీవీతో వచ్చిన ఈ లేటెస్ట్ స్మార్ట్ ప్రొజెక్టర్ విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంట్లో హోమ్ థియేటర్ సెటప్ చేసుకోవాలనేది చాలా మంది కల. అయితే.. పెద్ద పెద్ద టీవీలు కొనాలంటే బడ్జెట్ తడిసి మోపెడవుతుంది. పైగా వాటిని ఒక చోటు నుంచి ఇంకో చోటుకు మార్చడం కూడా పెద్ద తలనొప్పి. ఈ సమస్యలన్నింటికీ వన్-స్టాప్ సొల్యూషన్ ఈ ‘XGIMI Horizon 20’. ప్రొజెక్టర్ రంగంలో.. తిరుగులేని బ్రాండ్‌గా ఎదిగిన XGIMI, తన సరికొత్త లేటెస్ట్ టెక్నాలజీతో.. ఈ మోడల్‌ను మార్కెట్లోకి తెచ్చింది. మరి దీని ట్రెండీ ఫీచర్లు వివరాలు..

Advertisement

సాధారణంగా పాతకాలం ప్రొజెక్టర్లని సెట్ చేయాలంటే.. లెన్స్ తిప్పుతూ, గోడకు అడ్జస్ట్ చేస్తూ.. సగం ప్రాణం పోయేది. కానీ XGIMI Horizon 20లో ఆ టెన్షన్ అస్సలు లేదు. ఇందులో.. ఇంటెలిజెంట్ స్క్రీన్ అడాప్టేషన్ ఫీచర్ ఉంది. అంటే మీరు ప్రొజెక్టర్‌ను ఎక్కడ పెట్టి ఆన్ చేసినా.. అది ఆటోమేటిక్‌గా ఫోకస్ అయిపోతుంది. స్క్రీన్ వంకరగా ఉంటే.. ‘ఆటో కీస్టోన్ కరెక్షన్’ ద్వారా సెకన్లలో.. స్ట్రెయిట్‌గా మారిపోతుంది. దీని లుక్ కూడా చాలా ప్రీమియంగా.. మోడ్రన్ ఎలిఫెంట్ గ్రే ఫినిషింగ్‌తో వస్తుంది.

క్రిస్టల్ క్లియర్ పిక్చర్:

చాలా ప్రొజెక్టర్లలో చీకటి ఉంటేనే.. స్క్రీన్ బాగా కనిపిస్తుంది. కాస్త వెలుతురు వచ్చినా పిక్చర్ వెలిసిపోయినట్టు అవుతుంది. కానీ Horizon 20 లో ఆ ప్రాబ్లమే లేదు. ఇది అడ్వాన్స్‌డ్ RGB ట్రిపుల్ లేజర్ లైట్ ఇంజిన్‌తో రన్ అవుతుంది. ఏకంగా 3200 ISO ల్యూమెన్స్ బ్రైట్‌నెస్ కలిగి ఉండటం వల్ల, పగటి పూట హాల్లో లైట్లు ఆన్ చేసి ఉన్నా సరే.. కలర్స్ చాలా పంచిగా.. స్పష్టంగా కనిపిస్తాయి. సినిమా చూస్తున్నంత సేపు స్క్రీన్ పై ప్రతి డీటెయిలింగ్ క్లియర్‌గా ఎంజాయ్ చేయొచ్చు.

4K UHD క్లారిటీ & IMAX సర్టిఫికేషన్:

Advertisement

Horizon 20 సిరీస్ లోని హై-ఎండ్ మోడల్స్ ట్రూ 4K UHD (3840 x 2160) రిజల్యూషన్‌ను సపోర్ట్ చేస్తాయి. అంతేకాదు.. ఇది Dolby Vision,IMAX Enhanced సర్టిఫికేషన్‌తో వస్తుంది. అంటే.. థియేటర్లలో ఏ రేంజ్ డీప్ బ్లాక్ కలర్స్, బ్రైట్ హైలైట్స్ ఉంటాయో.. అచ్చం అలాంటి విజువల్స్ మీ బెడ్‌రూమ్ గోడపై 300 ఇంచుల భారీ స్క్రీన్ సైజ్ వరకు చూసుకోవచ్చు.

గూగుల్ టీవీ ఇన్-బిల్ట్:

దీని కోసం మీరు విడిగా ఎలాంటి.. ఫైర్ స్టిక్ లేదా క్రోమ్‌కాస్ట్ కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇందులో.. నేరుగా Google TV ప్లాట్‌ఫారమ్ బిల్ట్-ఇన్ గా వస్తుంది. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, యూట్యూబ్ లాంటి వేలాది అప్లికేషన్స్ ఎలాంటి లాగ్ లేకుండా.. స్మూత్‌గా ప్లే అవుతాయి. మీ ఫోన్ నుంచి డైరెక్ట్‌గా కంటెంట్‌ను క్రోమ్‌కాస్ట్ కూడా చేసుకోవచ్చు.

హార్మన్ కార్డన్ సౌండ్ పవర్:

మంచి విజువల్స్‌తో పాటు అదిరిపోయే.. సౌండ్ ఉంటేనే కదా సినిమాకు ఫుల్ ఫిల్లింగ్ వచ్చేది. దీని కోసం XGIMI వారు గ్లోబల్ ఆడియో బ్రాండ్ అయిన Harman Kardon స్పీకర్లను ఇందులో ఇన్-బిల్ట్ చేశారు. ఇవి రూమ్ మొత్తం రిజౌండ్ వచ్చేలా క్రిస్టల్ క్లియర్ ఆడియోని అందిస్తాయి. మీరు విడిగా సౌండ్ బార్ పెట్టకపోయినా.. ఈ స్పీకర్ల బేస్, డైలాగ్ క్లారిటీ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి.

గేమింగ్ లవర్స్ కు పండగే:

సినిమాలే కాదు.. బిగ్ స్క్రీన్ పై PS5 లేదా ఎక్స్‌బాక్స్ గేమింగ్ ఆడాలనుకునే వారికి ఇది ఒక పర్ఫెక్ట్ ఛాయిస్. ఇందులో లో-లేటెన్సీ గేమింగ్ మోడ్ ఉంది. ఇది గేమ్‌ప్లేను చాలా స్మూత్‌గా ఉంచుతుంది. ఎక్కడా ఫ్రేమ్ డ్రాప్స్ కనిపించవు.

మీకు బడ్జెట్ ఇబ్బంది లేకపోతే , మీ ఇంటిని పర్సనల్ థియేటర్‌గా మార్చుకోవాలనుకుంటే.. XGIMI Horizon 20 ఒక అల్టిమేట్ ఆప్షన్. ఇటు పగలు, అటు రాత్రి.. ఎప్పుడైనా సరే హై-క్వాలిటీ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించడంలో ఈ స్మార్ట్ ప్రొజెక్టర్‌కు తిరుగులేదు.

Related News

డిజైన్ చూస్తే ఐఫోన్ అనుకుంటారు.. రూ.12,499కే అడ్వాన్స్‌డ్ ఏఐ ఫీచర్లు.. Infinix కొత్త స్కెచ్!

EcoFlow పోర్టబుల్ పవర్ స్టేషన్.. కరెంట్ పోయినా మీ ఇంట్లో వైఫై, ల్యాప్‌టాప్ ఆగవు!

కారులో ఏసీ ఆన్ చేసి నిద్రపోతున్నారా? ప్రాణాలు తీసే ఆ ‘సైలెంట్ కిల్లర్’ గురించి తెలుసా?

కరెంట్ బిల్లు టెన్షన్ లేకుండా.. ఇల్లు కూల్ అవ్వాలా? ఈ ఏసీలపై ఓ లుక్కేయండి!

Redmi Note 17 వచ్చేస్తోంది.. 200MP కెమెరా, భారీ బ్యాటరీతో అరాచకమే!

ఆన్‌లైన్ క్లాసుల కోసం.. తక్కువ ధరలో బెస్ట్ ల్యాప్‌టాప్

పొల్యూషన్ టెన్షన్ ఇక లేదు.. రూ. 2,850 కే హెపా ఫిల్టర్ ప్యూరిఫైయర్!

Big Stories

Advertisement
×