XGIMI Vibe One projector: ప్రస్తుత రోజుల్లో పెద్ద స్క్రీన్‌పై సినిమాలు చూసే ఫీల్ కోరుకునే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. కేవలం సినిమా హాల్స్‌కే పరిమితం కాకుండా.. ఇంట్లోని గోడపైనే థియేటర్ ఫీల్ పొందడానికి స్మార్ట్ ప్రొజెక్టర్లు చక్కటి ఆప్షన్ గా మారుతున్నాయి. ఈ ట్రెండ్‌లో ప్రముఖ ఆడియో-విజువల్ బ్రాండ్ విడుదల చేసిన లేటెస్ట్ మోడల్ ‘XGIMI Vibe One’ ఇప్పుడు టెలివిజన్ మార్కెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. రూ.24,999 ధరలో లభిస్తున్న ఈ పోర్టబుల్ ప్రొజెక్టర్ విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఈ ప్రొజెక్టర్ డిజైన్ చాలా కాంపాక్ట్‌గా, ప్రీమియం లుక్‌లో ఉంటుంది. దీన్ని ఒక చోటు నుంచి మరో చోటుకి ఎక్కడికైనా చాలా ఈజీగా మోసుకెళ్లొచ్చు. ముఖ్యంగా ఇందులో బిల్ట్-ఇన్ బ్యాటరీ ఉండటం దీనికి ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్. కరెంట్ కనెక్షన్ లేని చోట లేదా టెర్రస్ పై జరిగే చిన్నపాటి పార్టీల్లో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సుమారు 1.2 గంటల పాటు నాన్ స్టాప్ వ్యూయింగ్ టైమ్‌ను ఇది అందిస్తుంది.
ఈ ప్రొజెక్టర్ 1080p ఫుల్ హెచ్‌డీ రెసల్యూషన్‌తో వస్తుంది. అంతే కాకుండా.. ఇది 4K అల్ట్రా హెచ్‌డీ కంటెంట్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది. దీంట్లో 250 ISO ల్యూమెన్స్ బ్రైట్ నెస్ లభిస్తుంది. దీని వల్ల చీకటి గదిలో లేదా కొద్దిగా వెలుతురు ఉన్న ప్రదేశంలో.. కూడా స్క్రీన్ చాలా స్పష్టంగా, రంగులతో అద్భుతంగా కనిపిస్తుంది. ఆటో కీస్టోన్, ఆటో ఫోకస్ ఫీచర్లు ఉండటం వల్ల, ప్రొజెక్టర్‌ను ఎక్కడ పెట్టినా క్షణాల్లో స్క్రీన్ దానంతట అదే అడ్జస్ట్ అయి క్లియర్ పిక్చర్‌ను ఇస్తుంది.
చాలా ప్రొజెక్టర్లలో.. నెట్ ఫ్లిక్స్ వాడటానికి ప్రత్యేకంగా ఫైర్ స్టిక్ లేదా ల్యాప్ టాప్ కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ మోడల్‌లో అఫీషియల్ నెట్‌ఫ్లిక్స్ , గూగుల్ టీవీ సపోర్ట్ ఇన్‌బిల్ట్‌గా లభిస్తుంది. దీని వల్ల మీరు నేరుగా ప్రొజెక్టర్‌లోనే నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్ వంటి ఓటీటీ యాప్స్‌ను రన్ చేయొచ్చు. గూగుల్ అసిస్టెంట్ వాయిస్ కంట్రోల్ సపోర్ట్ కూడా ఇందులో అందుబాటులో ఉంది.
సినిమా చూసేటప్పుడు విజువల్స్ ఎంత ముఖ్యమో, సౌండ్ కూడా అంతే.. ముఖ్యం. ఈ విషయంలో.. కంపెనీ ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఇందులో 2×3W జేబీఎల్ స్పీకర్లను అమర్చారు. చిన్నపాటి రూమ్‌కు సరి పడా లౌడ్ , క్రిస్టల్ క్లియర్ ఆడియోను ఇవి అందిస్తాయి. బయటి స్పీకర్లు.. అవసరం లేకుండానే థియేటర్ సౌండ్ ఫీల్ పొందవచ్చు.
రూ. 25 వేల బడ్జెట్‌లో అఫీషియల్ నెట్‌ఫ్లిక్స్, గూగుల్ టీవీ, పోర్టబుల్ బ్యాటరీ, జేబీఎల్ సౌండ్ వంటి అన్ని ప్రీమియం ఫీచర్లు ఒకే చోట దొరకడం గొప్ప విషయమే. మీరు గనక ఒక మంచి స్మార్ట్ ప్రొజెక్టర్ కొనాలని అనుకుంటే, ఈ మోడల్ ఒక పర్ఫెక్ట్ వాల్యూ ఫర్ మనీ ఛాయిస్!