Zepto vs Blinkit price comparison: ప్రస్తుత డిజిటల్ జనరేషన్‌లో ఆర్డర్ పెడితే చాలు క్షణాల్లోనే సరుకులు ఇంటికి వచ్చేస్తున్నాయి. పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లకు వెళ్లే శ్రమ లేకుండా, కేవలం స్మార్ట్ ఫోన్‌లో ఒక్క క్లిక్ చేస్తే పది నిమిషాల్లో కూరగాయలు, పాలు, స్నాక్స్ అన్నీ డెలివరీ అయిపోతున్నాయి. ఈ క్విక్ కామర్స్ రంగంలో మార్కెట్‌ను శాసిస్తున్న రెండు పెద్ద పేర్లు జెప్టో (Zepto), బ్లింకిట్ (Blinkit). యూత్ నుంచి ఫ్యామిలీల వరకు అందరూ వీటిని వాడేస్తున్నారు. అయితే.. మనలో చాలా మందికి వచ్చే అతి పెద్ద సందేహం ఏంటంటే.. ఈ రెండింటిలో ఏది చీప్? ఏ యాప్‌లో వస్తువులు తక్కువ ధరకు వస్తాయి? క్వాలిటీ వస్తువులను డిస్కౌంట్‌లో ఎక్కడ కొనాలో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.
సాధారణంగా మనం పాలు, బ్రెడ్, కూరగాయలు, పప్పు దినుసులు వంటి నిత్యవసరాలు ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తుంటాం. రీసెంట్ మార్కెట్ సర్వేల ప్రకారం.. జెప్టో, బ్లింకిట్ మధ్య ధరల పోరు సాగుతోంది. కొన్ని రకాల బ్రాండెడ్ స్నాక్స్, కూరగాయల ధరలు జెప్టోలో కాస్త తక్కువగా ఉంటే.. మ రికొన్ని ప్యాకేజ్డ్ ఫుడ్ ఐటెమ్స్, పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ బ్లింకిట్‌లో డిస్కౌంట్లతో లభిస్తున్నాయి. ఉదాహరణకు.. ఒక లీటర్ పాలు లేదా కిలో ఉల్లిపాయల ధరను పరిశీలిస్తే.. రెండు యాప్‌లలోనూ ధరల వ్యత్యాసం సుమారు రూ. 2 నుంచి రూ.10 లోపే ఉంటోంది.
వస్తువుల ధరలు ఒకేలా ఉన్నప్పటికీ, అసలైన దెబ్బ హ్యాండ్లింగ్ చార్జీలు , సర్జ్ ఫీజుల రూపంలో తగులుతుంది. పీక్ అవర్స్‌లో (ఉదయం పూట లేదా రాత్రి సమయాల్లో) జెప్టో , బ్లింకిట్ రెండూ అదనపు డెలివరీ ఫీజులను వసూలు చేస్తుంటాయి. అయితే.. మీరు వీటిలో మెంబర్‌షిప్ ప్రోగ్రామ్స్ తీసుకుంటే మాత్రం ఫ్రీ డెలివరీ బెనిఫిట్ పొందొచ్చు. ఎక్కువ సార్లు ఆర్డర్ చేసేవారు ఈ పాస్‌లను వాడటం ద్వారా ప్రతి ఆర్డర్‌పై రూ. 20 నుంచి రూ. 50 వరకు ఆదా చేసుకోవచ్చు.
అత్యంత తక్కువ ధరలకు వస్తువులను పొందడానికి అసలైన ఆయుధం కూపన్ కోడ్స్. బ్లింకిట్ తరచూ క్రెడిట్ కార్డు ఆఫర్లు, ఇన్-యాప్ కూపన్లను అందిస్తుంది. మరో వైపు జెప్టో తన యూజర్లను ఆకట్టుకోవడానికి తరచూ ఫ్లాట్ డిస్కౌంట్లు ,క్యాష్‌బ్యాక్ ఆఫర్లను ఇస్తుంటుంది. మీరు ఏదైనా వస్తువును కొనేముందు రెండు యాప్‌లలోనూ ఆ ఐటెమ్ ధర, అందుబాటులో ఉన్న కూపన్‌ను చెక్ చేయడం ద్వారా డబ్బులు ఆదా చేసుకోవచ్చు.
Also Read: రూ.20వేలలోపే డిష్ వాషర్..ఇక గిన్నెలు తోమే టెన్షన్‌కు ఎండ్‌కార్డ్!
మీరు ఒకేసారి పెద్ద మొత్తంలో సరుకులు కొంటున్నట్లయితే.. ఒక్కోసారి లోకల్ సూపర్ మార్కెట్‌లతో పోలిస్తే ఈ క్విక్ కామర్స్ యాప్‌లలో ధరలు తక్కువగానే ఉంటున్నాయి. ప్రత్యేకించి అర్ధరాత్రి సమయాల్లో లేదా అత్యవసర పరిస్థితుల్లో ఈ రెండు యాప్‌లు బెస్ట్ ఆప్షన్స్‌గా నిలుస్తున్నాయి. కూరగాయల ఫ్రె ష్‌నెస్ విషయంలో కొన్ని ప్రాంతాల్లో జెప్టో ముందుంటే.. బ్రాండెడ్ ఐటెమ్స్ , ప్యాకేజింగ్‌లో బ్లింకిట్ కస్టమర్లను ఆకట్టుకుంటోంది.
జెప్టో, బ్లింకిట్‌లలో ఏది బెస్ట్ అంటే.. ఇది మీరు ఏ లొకేషన్‌లో ఉన్నారు, ఏ సమయంలో ఆర్డర్ చేస్తున్నారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఆర్డర్ చేసే ముందు రెండు యాప్‌లలో ధరలను ఒకసారి పోల్చి చూసి, బెస్ట్ కూపన్ అప్లై చేయడం ద్వారా మీరు అత్యంత తక్కువ ధరకు వస్తువులను సొంతం చేసుకోవచ్చు. స్మార్ట్‌గా ఆలోచించి కొంటే మాత్రం ఈ క్విక్ కామర్స్ యాప్స్ మన బడ్జెట్‌కు ఏమాత్రం భారం కావు.