E-Paper
Advertisement

షియోమీ నుంచి మరో పవర్‌ఫుల్ ఫ్లాగ్‌షిప్ సిరీస్.. Madrid కోడ్‌నేమ్‌తో Xiaomi 18 లీక్!

షియోమీ నుంచి మరో పవర్‌ఫుల్ ఫ్లాగ్‌షిప్ సిరీస్.. Madrid కోడ్‌నేమ్‌తో Xiaomi 18 లీక్!
Advertisement

Xiaomi 18 Series: టెక్ లవర్స్‌లో షియోమీ ఫ్లాగ్‌షిప్ ఫోన్లకు ఉండే క్రేజే వేరు. త్వరలో మార్కెట్లోకి రాబోతున్న Xiaomi 18 సిరీస్‌కు సంబంధించి ఇప్పుడొక ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఈ సిరీస్‌లోని ఒక ఫోన్ Madrid అనే కోడ్‌నేమ్‌తో ప్రముఖ GSMA డేటాబేస్‌లో కనిపించింది. దీంతో ఈ ఫోన్ల తయారీ, సర్టిఫికేషన్ ప్రక్రియను కంపెనీ వేగవంతం చేసినట్లు తెలుస్తోంది.

మూడు దేశాల్లో ఒకేసారి?

ఈ లీకైన డేటాబేస్ వివరాల ప్రకారం.. Xiaomi 18 సిరీస్‌కు చెందిన కొన్ని మోడల్ నెంబర్లు లీక్ అయ్యాయి. ఇవి చైనా, గ్లోబల్ మార్కెట్‌తో పాటు భారత్, జపాన్ దేశాలకు సంబంధించిన వేరియంట్లుగా నిపుణులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా షియోమీ తమ ప్రీమియం ఫోన్లను ముందుగా చైనాలో లాంచ్ చేసి, ఆ తర్వాతే మిగతా దేశాల్లో విడుదల చేస్తుంది. కానీ ఈసారి భారత్, జపాన్ మార్కెట్ల కోసం ప్రత్యేక మోడళ్లను సిద్ధం చేస్తున్నట్లు కనిపిస్తోంది.

Advertisement

Also Read: WWDC 2026 ఈవెంట్‌లో ఆ 3 క్రేజీ ఫీచర్లను దాచేసిన యాపిల్.. లీక్ చేసిన బ్లూమ్‌బర్గ్ జర్నలిస్ట్!

మోడల్ పేరుపై వీడని ఉత్కంఠ:

ప్రస్తుతానికి ‘మాడ్రిడ్’ అనే కోడ్‌నేమ్ సాధారణ Xiaomi 18 ఫోన్‌దా లేక ప్రో మోడల్‌దా అనే విషయంపై స్పష్టత లేదు. గతంలో షియోమీ వాడిన కోడింగ్ పద్ధతిని బట్టి చూస్తే ఇది ప్రో మోడల్ అయ్యే అవకాశం ఉంది. అయితే, ఈసారి కంపెనీ తమ అల్ట్రా మోడల్‌ను పక్కన పెట్టే ఆలోచనలో ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఒకవేళ మోడళ్ల లైన్అప్‌లో మార్పులు చేస్తే, అంతర్గత పేర్లు కూడా మారే ఛాన్స్ ఉంది.

లాంచ్ ఎప్పుడంటే?

Advertisement

ఈ ఫోన్ల మోడల్ నెంబర్లలో ‘2611’ అనే అంకెలు కనిపిస్తున్నాయి. షియోమీ పాత పద్ధతుల ప్రకారం చూస్తే.. ఈ నెంబర్ నవంబర్ 2026 విడుదలను సూచిస్తోంది. అంతకుముందు ఈ ఫోన్లు సెప్టెంబర్‌లోనే వస్తాయని ప్రచారం జరిగినా, తాజా లీకుల ప్రకారం ఈ సిరీస్ కొంచెం ఆలస్యంగా.. అంటే నవంబర్ నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.

పవర్‌ఫుల్ ఫీచర్లు:

లీకైన వివరాల ప్రకారం.. Xiaomi 18 సిరీస్‌లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 ప్రాసెసర్‌తో పాటు ఎల్‌పీడీడీఆర్6 RAMను వాడే అవకాశం ఉంది. చిన్న స్క్రీన్ ఇష్టపడే వారి కోసం 6.3 నుంచి 6.4 ఇంచుల సైజులో, మంచి 2కే రిజల్యూషన్ డిస్‌ప్లేతో ఈ ఫోన్లు రానున్నాయి. అయితే ఈ వివరాలపై షియోమీ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

Also Read: 512GB స్టోరేజ్, ఆండ్రాయిడ్ 16.. Nothing Phone 3పై ఊహించని రేంజ్‌లో ధర తగ్గింపు!

Related News

BSNL మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. జస్ట్ రూ. 39కే 20GB డేటా.. రూ.1కే ఉచిత సిమ్!

రూ.35వేలలోపు 50 ఇంచుల టీవీ..ఇంట్లోనే థియేటర్ ఫీల్

రాత్రి వేళ గణపయ్య ఫోటోలు బ్లర్ అవుతున్నాయా? ఈ టిప్స్‌తో క్లారిటీ అదుర్స్!

రొటేటింగ్ బెజెల్‌తో క్రేజీ స్మార్ట్ వాచ్..GOBOULT Saber విశేషాలివే

రూ.1000లోపు దబిడి దిబిడే..పార్టీ మోత మోగించే బ్లూటూత్ స్పీకర్!

మ్యూజిక్ లవర్స్ కోసం బెస్ట్ హెడ్ సెట్..మార్కెట్లో రచ్చ చేస్తున్న మోడల్

రూ.2,399కే క్రేజీ ఫీచర్లు..నథింగ్ నుంచి కొత్త ఇయర్‌బడ్స్

కొత్త ఫోన్ కొంటున్నారా? 128GB లేదా 256GB ఏది బెటర్?

Big Stories

Advertisement
×