Cooper Gifts Bike to Litton Das: బంగ్లాదేశ్ వర్సెస్ ఆస్ట్రేలియా (Bangladesh vs Australia) మధ్య వన్డే సిరీస్ (Australia tour of Bangladesh, 2026) జరిగిన సంగతి తెలిసిందే. ఈ రెండు జట్ల మధ్య 3 వన్డేలు జరగగా, బంగ్లాదేశ్ టైటిల్ ఎగురేసుకు వెళ్లింది. 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది బంగ్లాదేశ్. మొదటి రెండు మ్యాచ్ లలో బంగ్లాదేశ్ విజయం సాధించగా.. మూడవ వన్డేలో మాత్రం ఆస్ట్రేలియా ఒకే ఒక్క వికెట్ తేడాతో విక్టరీ అందుకుంది. అయితే మూడవ వన్డే సందర్భంగా సెంచరీతో అదరగొట్టిన ఆస్ట్రేలియా ఆటగాడు కూపర్ కనోలి ( Cooper Connolly).. మ్యాచ్ గెలిపించాడు. దీంతో మాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు. ఈ సందర్భంగా వచ్చిన బైక్ ను బంగ్లా వికెట్ కీపర్ లిటన్ దాస్ కు ( Litton Das ) ఇచ్చినట్లు సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ గా మారింది. ఇది చూసిన క్రికెట్ అభిమానులు ఫిదా అయిపోతున్నారు. బైక్ గెలిస్తే (Cooper Gifts Bike to Litton Das) ప్రత్యర్థికి ఇవ్వడం గొప్ప మనసు అంటూ కూపర్ కనోలిని మెచ్చుకుంటున్నారు.
బంగ్లాదేశ్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మూడవ వన్డే ఢాకా (Shere Bangla National Stadium, Dhaka) వేదికగా జరిగింది. ఈ మ్యాచ్ జూన్ 14 అంటే నిన్న ఆదివారం రోజున ఉత్కంఠ భరితంగా సాగింది. అయితే ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 274 పరుగులు సాధించింది. ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో పడుతూ లేస్తూ ముందుకు సాగింది. ఈ నేపథ్యంలోనే 9 వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని చేరుకుంది ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా ఓపెనర్ కూపర్ 134 బంతుల్లో 149 పరుగులు సాధించాడు. ఇందులో ఆరు సిక్సర్లు అలాగే 13 బౌండరీలు సాధించాడు. దీంతో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూపర్ కు దక్కింది.
ఈ సందర్భంగా ఖరీదైన బైక్ సొంతం చేసుకున్నాడు కూపర్. అయితే ఆ బైక్ ను బంగ్లాదేశ్ వికెట్ కీపర్ లిటన్ దాస్ కు గిఫ్ట్ గా ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కూపర్ కు బైక్ రాగానే.. దాన్ని లిటన్ దాస్ రైడ్ చేశాడు. స్టేడియం చుట్టూ ఒక ట్రిప్ వేశాడు. దీంతో ఆ బైక్ లిటన్ దాస్ కు కూపర్ గిఫ్ట్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అయితే ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియదు కానీ… పోస్టులు మాత్రం వైరల్ అవుతున్నాయి. అయితే ఇది చూసిన క్రికెట్ అభిమానులు… సరదాగా బైక్ నడపమని ఇచ్చాడు తప్ప… గిఫ్ట్ గా ఇవ్వలేదని కామెంట్ చేస్తున్నారు.
Aussie Mentality 🦘🫡
Cooper Connolly gifted his award-winning bike to Liton Das🤗❤️🏏 pic.twitter.com/Io8jLuFbc2— Arqam Mustaqeem (@arqam_mustaqeem) June 14, 2026