E-Paper
Advertisement

రక్తంలోకి పోయే దుమ్మును కూడా పట్టుకుంటుంది.. షియోమీ నుంచి రెండు అద్భుతమైన ప్రొడక్ట్స్!

రక్తంలోకి పోయే దుమ్మును కూడా పట్టుకుంటుంది.. షియోమీ నుంచి రెండు అద్భుతమైన ప్రొడక్ట్స్!
Advertisement

Xiaomi Mijia Smart Air Purifier: స్మార్ట్‌ఫోన్లతో భారత మార్కెట్లో చెరగని ముద్ర వేసిన షియోమీ.. ఇప్పుడు హోమ్ అప్లయెన్సెస్ విభాగంలోనూ తమ పట్టును మరింత పెంచుకోవడానికి సిద్ధమైంది. తమ ల్యాండ్‌మార్క్ స్మార్ట్ హోమ్ సబ్‌బ్రాండ్ మిజియా (Mijia) ద్వారా త్వరలోనే కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్లను భారత్‌లో దించనుంది. ఆగస్టు 25న మిజియా బ్రాండ్ నుండి రెండు సరికొత్త మోడళ్లు అధికారికంగా విడుదల కానున్నాయి. మరి ఈ కొత్త పరికరాలు భారతీయ వినియోగదారులను ఎంతవరకు ఆకట్టుకోగలవు? వీటి ప్రత్యేకతలు ఏంటో వివరంగా తెలుసుకుందామా.

షియోమీ వ్యూహమేంటి?

భారత్‌లో ఇప్పటికే ఎయిర్ ప్యూరిఫైయర్ల మార్కెట్లో విపరీతమైన పోటీ ఉంది. అయితే మిజియా పేరు మన దేశంలో చాలామందికి కొత్తగా అనిపించవచ్చు. స్మార్ట్ హోమ్ ప్రొడక్ట్స్‌ విభాగంలో గ్లోబల్ లెవెల్లో మిజియాకు మంచి పేరుంది. గతంలో రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్లతో తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు అందించి సంచలనం సృష్టించినట్లే.. ఇప్పుడు ఎయిర్ ప్యూరిఫైయర్ల విభాగంలోనూ షియోమీ అదే వ్యూహాన్ని అమలు చేయబోతోంది.

Advertisement

Also Read: జియో ప్రైమ్ రీలాంచ్.. రూ.300తో టారిఫ్ పెంపు నుంచి ఉపశమనం, రూ.600 క్యాష్‌బ్యాక్!

వైరస్, బ్యాక్టీరియాకు చెక్:

పెద్ద పెద్ద గదులు, విశాలమైన హాల్స్ కోసం ‘మిజియా స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ 6’ మోడల్‌ను తీర్చిదిద్దారు. సాధారణ ప్యూరిఫైయర్లు కేవలం దుమ్ము, ధూళిని మాత్రమే గుర్తుపడితే.. ఇది రక్తంలోకి కూడా చేరగలిగే అతిసూక్ష్మమైన PM1 కణాలను సైతం గుర్తిస్తుంది. దీనికోసం ఈ ప్యూరిఫైయర్లో 5 ప్రత్యేక సెన్సార్లు ఇచ్చారు. దీనికి తోడు యువి-సి (UV-C) లైటింగ్, నెగెటివ్ అయాన్స్ సాంకేతికత ద్వారా గాలిలోని వైరస్‌లు, బ్యాక్టీరియాను పూర్తిగా నిర్మూలిస్తుంది. రాత్రి వేళల్లో అసలు శబ్దం లేకుండా (20dB స్లీప్ మోడ్) పనిచేయడం దీని మరో ప్లస్ పాయింట్.

చిన్న గదుల కోసం కాంపాక్ట్ వెర్షన్:

Advertisement

చిన్న గదులు లేదా తక్కువ బడ్జెట్‌లో కావాలనుకుంటున్న వారి కోసం ‘మిజియా ఎయిర్ ప్యూరిఫైయర్ 4 కాంపాక్ట్’ అందుబాటులోకి వస్తోంది. ఇది పరిమాణంలో చిన్నగా ఉంటూనే.. గదిలోని గాలిని చాలా వేగంగా శుద్ధి చేస్తుంది. గ్లోబల్ మార్కెట్‌లో ఈ మోడల్ చాలా తక్కువ ధరకే అందుబాటులో ఉంది. గూగుల్ అసిస్టెంట్, అలెక్సా, అలాగే షియోమీ హోమ్ యాప్‌ల ద్వారా ఈ రెండింటినీ చాలా సులభంగా ఆపరేట్ చేయవచ్చు.

ధరపైనే సర్వత్రా ఆసక్తి:

గ్లోబల్‌గా ఇప్పటికే మంచి ఆదరణ పొందిన ఈ రెండు మోడళ్లు భారత మార్కెట్లో ఎలాంటి విజయాన్ని సాధిస్తాయనేది ఆగస్టు 25న ప్రకటించబోయే ధరలపైనే ఆధారపడి ఉంది. ప్రీమియం ఫీచర్లు, విశ్వసనీయమైన షియోమీ బ్రాండ్ ఇమేజ్ ఈ ప్యూరిఫైయర్లకు పెద్ద ప్లస్ కానున్నాయి.

Also Read: iPhone 18 Pro రాకముందే షాకింగ్ ఆఫర్.. రూ.22,000 తగ్గిన iPhone 17 Pro ధర!

Tags

Related News

యూట్యూబ్‌లో ఏ వీడియో క్వాలిటీకి ఎంత డేటా ఖర్చవుతుందో తెలుసా?

ఐఫోన్ బ్యాటరీని బ్యాక్‌గ్రౌండ్‌లో తినేస్తున్నది ఇదే.. ఈ ఒక్క సెట్టింగ్ మార్చండి చాలు!

ఫోన్ అడిక్షన్ అనుకుంటున్నారా? ఉదయాన్నే ఫోన్ చూడటం వెనుక అసలు సైకాలజీ ఇదే!

పవర్ బ్యాంక్‌ వాడుతున్నారా? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు!

ఆపిల్ వాచ్..పాత లుక్కే అయినా పర్ఫార్మెన్స్‌లో అదుర్స్!

రూ.50 వేలలోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు..అమెజాన్,ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఇవే బెస్ట్!

ప్రైమ్ డే సేల్ కంటే ముందే ఆఫర్లు.. ఈ 5 గాడ్జెట్స్‌పై అమెజాన్‌లో కళ్లు చెదిరే డిస్కౌంట్లు!

బ్లూటూత్ తరచూ డిస్‌కనెక్ట్ అవుతోందా?నిమిషాల్లో ఇలా సాల్వ్ చేసుకోండి!

Big Stories

Advertisement
×