E-Paper
Advertisement

ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్న జబర్దస్త్ పవిత్ర.. వీడియో వైరల్!

ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్న జబర్దస్త్ పవిత్ర.. వీడియో వైరల్!
Advertisement

Jabardasth Pavitraసెలబ్రిటీలకు సంబంధించిన ఏ విషయమైనా సరే ఇట్టే క్షణాలలో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. అది ప్రేమ అయినా.. బ్రేకప్ అయినా.. ముఖ్యంగా ఎవరైనా సెలబ్రిటీ తమకు నచ్చిన వారితో ప్రేమలో పడి, ఎంగేజ్మెంట్ చేసుకొని సర్వస్వం అప్పగించిన తర్వాత అనుకోకుండా బ్రేకప్ చెప్పుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది. అయితే ఆ డిప్రెషన్ నుంచి బయటపడడానికి ఆ సెలబ్రిటీకి చాలా సమయమే పడుతున్నా.. సినిమా వల్ల ఇప్పుడిప్పుడే దాని నుంచి కోలుకుంటున్నాం అంటూ చెబుతూ ఆశ్చర్యపరుస్తున్నారు.

టాక్సిక్ లవ్ స్టోరీ అంటున్న పవిత్ర..

ఈ క్రమంలోనే తన అద్భుతమైన వాక్చాతుర్యంతో.. అదిరిపోయే పంచ్ లతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న జబర్దస్త్ పవిత్ర (Jabardasth Pavitra) గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. పలు టీవీ షోలలో సందడి చేస్తూ దూసుకుపోతున్న ఈమె సడన్గా తాను టాక్సిక్ రిలేషన్ లో గడిపాను అని చెబుతూనే.. తన ఎంగేజ్మెంట్ ని కూడా క్యాన్సిల్ చేసుకున్నట్లు చెప్పుకొచ్చింది. నిజానికి ఎప్పుడో బ్రేకప్ చెప్పుకున్న ఈమె.. అప్పటినుంచి ఈ విషయాన్ని బయట పెట్టలేదు. కానీ తాజాగా ఒక ఎమోషనల్ వీడియో రూపంలో తన బాధను బయట పెడుతూ అందరిని ఆశ్చర్యపరిచింది.

సర్వస్వం అప్పగించాను.. నరకాన్ని తట్టుకోలేకపోయా..

Advertisement

నేను ఒక అబ్బాయిని చాలా ఘాడంగా ప్రేమించాను. ఆ బంధానికి నన్ను నేను సర్వస్వం అప్పగించుకున్నాను. అయితే ఆ బంధమే నెమ్మదిగా నాకు ఊపిరాడకుండా చేసింది. అవమానాలు, గొడవలు, చివరికి వేధింపులు కూడా బంధంలో మొదలయ్యాయి. ప్రతిదీ కూడా నా తప్పే అని నమ్మడం మొదలు పెట్టాను. అది వేధింపులు అని కూడా ఆ బంధంలో గ్రహించలేనంతగా మునిగిపోయాను. ముఖ్యంగా అదొక స్వార్థపూరిత వేధింపు అంటారో లేదో నాకు తెలియదు కానీ అతన్ని మాత్రం నేను గాఢంగా ప్రేమించినందుకు నరకం చూడాల్సి వచ్చింది.

ALSO READ:సామాన్యుడి ముఖంపై నీళ్లు చల్లిన బిందు మాధవి.. అభిజిత్ సపోర్ట్.. అసలేం జరుగుతోంది?

నన్ను నేను అర్థం చేసుకునేసరికి అంతా అయిపోయింది..

Advertisement

ఎక్కడో చిన్న ఆశ.. ఎప్పటికైనా పరిస్థితులు మారకపోతాయా అని.. చాలా రోజులు ఆశతో ఎదురు చూశాను. చివరికి నిరాశే ఎదురయింది. అప్పుడే నాకర్థమైంది. నువ్వు లేకపోతే నేను ఉండలేను అనే మాటనుండి నువ్వు లేకపోతేనే నేను బాగుంటాను అనే స్థాయికి వచ్చేసాను. అప్పుడే నేను ఎంతగా బాధపడుతున్నానో అర్థం అయింది. ఈ స్వార్థపూరిత వేధింపుల గురించి తెలుసుకున్న తర్వాతే అసలు నేనేం చేస్తున్నాను.. ఎక్కడ ఉన్నానో అనే విషయం అర్థమైంది. అందుకే చివరిగా నన్ను నేనే ఎంచుకొని ఆ బంధం నుండి బయటకు వచ్చేసాను అంటూ పోస్ట్ పెట్టింది పవిత్ర.

నిశ్చితార్థం కూడా క్యాన్సిల్..

ఒకడిని గుడ్డిగా నమ్మి ఆ బంధాన్ని పెళ్లి వరకు తీసుకువెళ్లాలని నిశ్చితార్థం కూడా చేసుకున్నాను. అలా చేయడమే నేను చేసిన తప్పు. టాక్సిక్ రిలేషన్ నుంచి బయటపడ్డాను అంటూ కన్నీటి పర్యంతం అయిన పవిత్ర ఒక వీడియోని షేర్ చేస్తూ..” నేను సానుభూతి కోసం ఇదంతా చెప్పడం లేదు. వేరొకరు మా పరిస్థితిని గుర్తించాలనే ఉద్దేశంతోనే పంచుకుంటున్నాను. ముఖ్యంగా ఎవరైనా సరే మిమ్మల్ని నిరంతరం బాధిస్తూ, నియంత్రిస్తూ, పనికిరాని వారిలా భావిస్తే మాత్రం ఓర్చుకోవద్దు. ప్రేమ మీకు మనశ్శాంతిని ఇవ్వాలి.ఆత్మగౌరవాన్ని పెంచాలి. మనం ఒకరిని ఎంతగా ప్రేమించినా.. మనల్ని మనం ఎప్పుడూ కోల్పోకూడదు. స్వార్థపూరిత ప్రేమలో ఉండడం కంటే బయటకొచ్చి స్వేచ్ఛగా బ్రతకడమే జీవితం” అంటూ తన అభిప్రాయంగా చెప్పుకొచ్చింది పవిత్ర

?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

Related News

Nindu Noorella Saavasam Serial Today Episode October 5th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి తనను చంపేస్తుందని పార్థు పసిగడతాడా..?    

Monday Tv Movies : మూవీ లవర్స్ కు పూనకాలే.. వీటిని మస్ట్ వాచ్..

సుప్రీత ఆస్తుల విలువ ఎంతో తెలుసా? ఆస్తుల చిట్టా బయటపెట్టిందిగా?

పవన్ కళ్యాణ్ రాజకీయాల పై సుప్రీత కామెంట్స్… పండగ చేసుకున్నాం అంటూ!

సుప్రీత నెల సంపాదన ఎంతో తెలుసా? అందం కోసం అంత ఖర్చు చేస్తుందా?

డ్రగ్స్ వ్యవహారం…ఏడవని రోజు లేదు సుప్రీత ఎమోషనల్ కామెంట్స్!

కూతురికి సురేఖ వాణి చెప్పదా? నెగెటివ్ ట్రోల్స్ పై సుప్రీత రియాక్షన్!

సుప్రీత ఇండస్ట్రీకి రావడం వెనుక అతని ప్రమేయం ఉందా? ఆయన కోరిక నెరవేర్చారా??

Big Stories

Advertisement
×