E-Paper
Advertisement

భారీ డిస్‌ప్లేతో Xiaomi Mix Fold 5.. గ్లోబల్ మార్కెట్లోకి వచ్చేది ఎప్పుడంటే?

భారీ డిస్‌ప్లేతో Xiaomi Mix Fold 5.. గ్లోబల్ మార్కెట్లోకి వచ్చేది ఎప్పుడంటే?
Advertisement

Xiaomi Mix Fold 5: షియోమీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘మిక్స్ ఫోల్డ్ 5’ స్మార్ట్‌ఫోన్ త్వరలోనే మార్కెట్లోకి అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ నెలలోనే ఈ ఫోల్డబుల్ ఫోన్ విడుదలయ్యే అవకాశం ఉందంటూ టెక్ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే మునుపటి మోడళ్లతో పోలిస్తే.. ఈసారి డిజైన్, పనితీరు పరంగా షియోమీ భారీ మార్పులే చేస్తున్నట్లు సమాచారం.

భారీ డిస్‌ప్లే.. టాబ్లెట్ లాంటి అనుభూతి:

తాజా లీక్స్ ప్రకారం.. ఈ Xiaomi Mix Fold 5లో అత్యంత ప్రధానమైన మార్పు దాని ఇన్నర్ స్క్రీన్. ఈసారి 4:3 ఆస్పెక్ట్ రేషియోతో కాస్త వెడల్పుగా, చదరపు రూపంలో ఈ స్క్రీన్‌ రాబోతోంది. ఇది చూడటానికి ఒక చిన్న సైజు టాబ్లెట్‌లా అనిపిస్తుంది. ఫోల్డ్ పరిచినప్పుడు స్క్రీన్ వెడల్పుగా ఉండటం వల్ల మల్టీటాస్కింగ్, బ్రౌజింగ్ లేదా డాక్యుమెంట్లు చదువుకోవడానికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఫోన్ మూలలు కాస్త గుండ్రంగా ఉండి, సెల్ఫీ కెమెరా ఒక వైపున సెట్ చేశారు.

Advertisement

Also Read: సింగిల్ ఛార్జ్‌తో 48 గంటలే పనిచేసే వివో కొత్త ఫోన్.. బడ్జెట్ ధరలోనే వాటర్ ప్రూఫ్ ఫీచర్!

త్వరలోనే లాంచ్.. తేదీపై ఆసక్తి:

ప్రముఖ లీక్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ఈ ఫోన్ ఇమేజ్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ డిజైన్ లీక్స్ నిజమేనని నమ్ముతున్నారు. షియోమీ తమ తదుపరి ఫ్లాగ్‌షిప్ 18 సిరీస్ ఫోన్లను తీసుకురాకముందే.. సెప్టెంబర్ మొదటి వారంలోనే ఈ ఫోల్డబుల్ ఫోన్‌ను పరిచయం చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ విడుదల తేదీపై గానీ, గ్లోబల్ లాంచ్‌పై గానీ షియోమీ ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు.

హైపర్ ఓఎస్ 4తో సూపర్ స్పీడ్:

Advertisement

Xiaomi Mix Fold 5 ఫోన్ ఆండ్రాయిడ్ 17 ఆధారిత ‘హైపర్ ఓఎస్ 4’ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుందని తెలుస్తోంది. ఇది ఫోన్ పనితీరును వేగవంతం చేయడమే కాకుండా.. మెమరీని సమర్థవంతంగా ఉపయోగిస్తుంది. నిరంతరం వాడినా ఫోన్ స్లో కాకుండా ఉండటం దీని ప్రత్యేకత. అలాగే లాక్ స్క్రీన్, డివైజ్ సెంటర్, గ్యాలరీ విజెట్స్‌లో సరికొత్త మార్పులు కనిపించనున్నాయి.

అధునాతన ఏఐ ఫీచర్లు:

హైపర్ ఓఎస్ 4 రాకతో ఈ ఫోన్‌కు సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) బలం తోడవుతోంది. దీనిలో వస్తున్న ‘సూపర్ షావోఏఐ 2.0’ అసిస్టెంట్ ద్వారా రకరకాల యాప్స్‌లోని పనులను చాలా సులభంగా పూర్తి చేసుకోవచ్చు. డీప్ రీసెర్చ్, వెబ్‌పేజ్ క్రియేషన్ వంటి ఫీచర్లు ఆకట్టుకోనున్నాయి. ఫోల్డబుల్ స్క్రీన్‌పై ఈ ఏఐ ఫీచర్లు వాడటం వినియోగదారులకు కొత్త అనుభూతిని ఇస్తుంది.

Also Read: డైమెన్సిటీ 7500 ప్రాసెసర్‌తో తొలి ఫోన్.. iQOO నుంచి అదిరిపోయే కాంబో ఆఫర్!

Related News

యూట్యూబ్‌లో ఏ వీడియో క్వాలిటీకి ఎంత డేటా ఖర్చవుతుందో తెలుసా?

ఐఫోన్ బ్యాటరీని బ్యాక్‌గ్రౌండ్‌లో తినేస్తున్నది ఇదే.. ఈ ఒక్క సెట్టింగ్ మార్చండి చాలు!

ఫోన్ అడిక్షన్ అనుకుంటున్నారా? ఉదయాన్నే ఫోన్ చూడటం వెనుక అసలు సైకాలజీ ఇదే!

పవర్ బ్యాంక్‌ వాడుతున్నారా? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు!

ఆపిల్ వాచ్..పాత లుక్కే అయినా పర్ఫార్మెన్స్‌లో అదుర్స్!

రూ.50 వేలలోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు..అమెజాన్,ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఇవే బెస్ట్!

ప్రైమ్ డే సేల్ కంటే ముందే ఆఫర్లు.. ఈ 5 గాడ్జెట్స్‌పై అమెజాన్‌లో కళ్లు చెదిరే డిస్కౌంట్లు!

బ్లూటూత్ తరచూ డిస్‌కనెక్ట్ అవుతోందా?నిమిషాల్లో ఇలా సాల్వ్ చేసుకోండి!

Big Stories

Advertisement
×