E-Paper
Advertisement

బాలీవుడ్ స్టార్లకు బిగ్ షాక్.. ఆ హీరోలకు లీగల్ నోటీసులు…

బాలీవుడ్ స్టార్లకు బిగ్ షాక్.. ఆ హీరోలకు లీగల్ నోటీసులు…
Advertisement

Bollywood Heros : ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు అందరూ కూడా పలు బ్రాండ్లకి అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల స్టార్ హీరోలు చేసిన కొన్ని ప్రమోషన్స్ వివాదంలో ఇరుక్కోవడంతో వాటికి ప్రమోషన్లు చేసిన హీరోలపై కూడా కేసులు నమోదైన సందర్భాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గతంలో అనేకమంది స్టార్ హీరోలపై ఇలాంటి కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి బాలీవుడ్ ఇండస్ట్రీలో కొంతమంది స్టార్ హీరోలకు నోటీసులు అందినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఓ ప్రముఖ బ్రాండ్ ని ప్రమోట్ చేసినందుకుగాను వాళ్లకి ఈ లీగల్ నోటీసులు జారీచేసినట్లు తెలుస్తుంది.. బ్రాండ్ ప్రమోషన్ లో భాగంగా లీగల్ నోటీసులు అందుకున్న స్టార్లు ఎవరు? అసలు ఆ బ్రాండ్ కి వచ్చిన వివాదం ఏంటి? అన్నది ఇప్పుడు మనం కాస్త వివరంగా తెలుసుకుందాం..

బాలీవుడ్ స్టార్ హీరోలకు నోటీసులు..

పాన్ మసాలా బ్రాండ్‌ను పరోక్షంగా ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలతో బాలీవుడ్ ప్రముఖ నటులు షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, టైగర్ ష్రాఫ్‌లకు మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ లీగల్ నోటీసులు జారీ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిషేధించబడిన పాన్ మసాలా ఉత్పత్తులను ప్రకటనల ద్వారా ప్రోత్సహించడంపై ఈ చర్యలు చేపట్టింది.. మహారాష్ట్ర ఆహార ఉత్పత్తుల సంస్థ ఆ బ్రాండ్ గురించి పూర్తిగా విచారణ చేపట్టి ప్రమోషన్స్ చేసిన హీరోల పై పడడంతో పాటుగా నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఒకసారి ఈ బ్రాండ్ గురించి వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.. ఈ పాన్ మసాలా బ్రాండ్ గురించి తమ సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన పోస్టులను కూడా వెంటనే తొలగించాలి అని ఫుడ్ కమిషన్ హీరోలకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఈ వార్త బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై హీరోలు ఎలా స్పందిస్తారు అన్నది సస్పెన్స్ గా మారింది.. ఏది ఏమైనా కూడా స్టార్ హీరోలకు ఇలాంటి నోటీసులు అందడం కొత్తేమి కాదు. బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించాలి అంటే ఆ బ్రాండ్ గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే ప్రచారం చేయాలి అని హీరోల ఫ్యాన్స్ కోరుకుంటున్నారు..

Advertisement

Also Read :సీరియల్స్ వీక్లీ రౌండప్.. టాక్ ఆఫ్ ది సీరియల్ ఇదే..?

Related News

నాని రెమ్యునరేషన్ పెంచేశాడా? నిర్మాతలకు కొత్త లెక్క

రణబాలికి హైక్స్ లేవట.. మేకర్స్ లెక్క మామూలుగా లేదుగా!

‘రాజాసాబ్’ బ్యూటీ రిధి.. ఈసారి కొత్త లుక్‌తో షాక్ ఇచ్చిందే!

నితిన్‌కు హిట్ పడి ఎన్నాళ్లయిందో.. ఈసారి అయినా లెక్క మారేనా?

హీరోగానే కాదు.. డైరెక్టర్‌గానూ సంపాదిస్తున్న విశ్వక్ సేన్!

లెజెండ్రీ డైరెక్టర్ సింగీతంకి ‘పద్మ అవార్డ్స్’ ఎందుకు రాలేదు?

పవన్.. ప్రభాస్.. ఇద్దరి పక్కన ఛాన్స్! నిధి లెక్క ఎప్పుడు మారుతుందో?

గురూజీకి సెకండ్ హాఫ్ నచ్చలేదా? ‘ఆదర్శ కుటుంబం’పై కీలక నిర్ణయం!

Big Stories

Advertisement
×