E-Paper
Advertisement

రూ.5వేల బడ్జెట్‌లో స్మార్ట్ బ్యాండ్ కొనాలా? షావోమి vs హానర్.. మధ్య గట్టి పోటీ !

రూ.5వేల బడ్జెట్‌లో స్మార్ట్ బ్యాండ్ కొనాలా? షావోమి vs హానర్.. మధ్య గట్టి పోటీ !
Advertisement

Xiaomi smart band 9 pro vs honor band 9: ఫిట్‌నెస్‌పై ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లకు, చేతికి పెద్ద స్మార్ట్‌వాచ్‌లు పెట్టుకోవడం నచ్చని వాళ్లకు స్మార్ట్ బ్యాండ్స్ ఒక పర్ఫెక్ట్ ఛాయిస్. తక్కువ బరువుతో.. ఉంటూనే అన్నీ ట్రాక్ చేస్తాయి. అయితే.. ప్రస్తుతం మార్కెట్‌లో బడ్జెట్ రేంజ్‌లో రెండు క్రేజీ బ్యాండ్స్ ట్రెండ్ అవుతున్నాయి. అవే Xiaomi Smart Band 9 Pro, Honor Band 9. ఈ రెండిటిలో అసలు కింగ్ ఎవరు ? దేని ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి ? మీ బడ్జెట్‌కి ఏది కరెక్టో ఇప్పుడు తెలుసుకుందాం.

Xiaomi Smart Band 9 Pro vs Honor Band 9:

Advertisement

యూజర్లు కేవలం లుక్ మాత్రమే కాకుండా సెన్సార్ల అక్యూరెసీ , బ్రైట్‌నెస్ ఎక్కువగా ఉండే డిస్‌ప్లేల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ రెండింటి మధ్య ఉన్న ముఖ్యమైన తేడాలు ఇవే..

1.డిస్‌ప్లే,డిజైన్ :

Xiaomi Smart Band 9 Pro: ఇది చూడటానికి ఒక ప్రీమియం స్మార్ట్‌వాచ్‌లా ఉంటుంది.ఇందులో పెద్దదైన 1.74 ఇంచ్ AMOLED డిస్‌ప్లే ఇచ్చారు. దీనికి 60Hz రిఫ్రెష్ రేట్, అల్యూమినియం అలాయ్ ఫ్రేమ్ ఉండటం వల్ల లుక్ చాలా లగ్జరీగా ఉంటుంది. ఎండలో కూడా స్పష్టంగా కనిపించడానికి 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉంది.

Advertisement

Honor Band 9: ఇది స్లిమ్ అండ్ క్లాసిక్ బ్యాండ్ డిజైన్‌తో వస్తుంది. ఇందులో 1.57 ఇంచ్ 60Hz AMOLED కర్వ్డ్ స్క్రీన్ ఉంది. ఇది చేతికి చాలా లైట్ వెయిట్‌గా, కంఫర్టబుల్‌గా ఉంటుంది. మీకు పెద్ద స్క్రీన్, మెటాలిక్ ప్రీమియం లుక్ కావాలంటే షావోమి, లేదు స్లిమ్‌గా, స్టైలిష్‌గా ఉండాలంటే హానర్ బెస్ట్.

2. హెల్త్ అండ్ ఫిట్‌నెస్ ట్రాకింగ్ :

Xiaomi 9 Pro: ఇందులో అప్‌గ్రేడెడ్ హార్ట్ రేట్, SpO2 (బ్లడ్ ఆక్సిజన్), స్లీప్ ట్రాకింగ్ సెన్సార్లు ఉన్నాయి. దీని అక్యూరెసీ సుమారు 96% వరకు ఉంటుంది. రన్నర్స్ కోసం ఇందులో బిల్ట్-ఇన్ GPS ఉంది. అంటే.. ఫోన్ లేకుండానే మీ రన్నింగ్ రూట్‌ను ఇది ట్రాక్ చేయగలదు. ఇందులో 150+ స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి.

Honor Band 9: ఇది హార్ట్ రేట్, బ్లడ్ ఆక్సిజన్,స్ట్రెస్ లెవెల్స్‌తో పాటు హానర్ ప్రత్యేకమైన ‘ఫిట్‌నెస్ ఏజ్’ని కూడా లెక్కిస్తుంది. దీని అక్యూరెసీ కూడా బాగుంటుంది కానీ.. ఇందులో ఇన్‌బిల్ట్ జీపీఎస్ లేదు, ఫోన్ జీపీఎస్‌పై ఆధారపడాలి.ఇందులో 96 స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి.

3. బ్యాటరీ లైఫ్ :
Xiaomi Smart Band 9 Pro: సింగిల్ ఛార్జ్‌తో సాధారణ వాడకంలో ఏకంగా 14 నుంచి 21 రోజుల భారీ బ్యాటరీ లైఫ్ ఇస్తుంది.

Honor Band 9: ఇది కూడా తక్కువ తినలేదు, నార్మల్ యూసేజ్‌లో హ్యాపీగా 14 రోజుల పాటు నాన్‌స్టాప్ బ్యాకప్ ఇస్తుంది.

Also Read: రూ.2వేలలోపు అమోలెడ్ డిస్‌ప్లే! 50%డిస్కౌంట్‌తో.. Redmi Watch Move

ధరల వివరాలు:

ఫీచర్స్ , బ్రాండ్ వాల్యూని బట్టి వీటి ధరలు..

Xiaomi Smart Band 9 Pro ధర: ఇది బిల్ట్-ఇన్ జీపీఎస్, మెటల్ బాడీ , పెద్ద స్క్రీన్‌తో.. వస్తున్నందున దీని ధర సుమారు రూ.4,499 నుంచి రూ. 4,999 మధ్య ఉంది.

Honor Band 9 ధర: ఇది బడ్జెట్ లవర్స్ కోసం లభిస్తోంది. అమెజాన్ ఆఫర్లలో దీనిని కేవలం రూ.2,499 నుంచి రూ. 2,999 కే సొంతం చేసుకోవచ్చు.

ఏది కొనాలి?
ఫైనల్‌గా చెప్పాలంటే..మీ బడ్జెట్ కొంచెం ఎక్కువగా ఉండి, ఫోన్ లేకుండా రన్నింగ్ చేయడానికైనా ట్రాక్ చేసే ఇన్‌బిల్ట్ జీపీఎస్, పెద్ద స్క్రీన్, ప్రీమియం మెటల్ లుక్ కావాలనుకుంటే ఖచ్చితంగా.. Xiaomi Smart Band 9 Pro కొనడం బెస్ట్.

Related News

మార్కెట్‌లో ఫుల్ క్రేజ్ ఉన్నఇయర్‌బడ్స్.. ఇప్పుడు ఆఫర్‌‌లో !

Whatsapp Webలో అదిరిపోయే అప్‌డేట్.. ఇకపై బ్రౌజర్‌ నుంచే గ్రూప్ వీడియో కాల్స్!

ఫోన్ వెనుక మరో డిస్‌ప్లేనా? టెక్నో నుంచి మైండ్ బ్లోయింగ్ 5G ఫోన్.. లాంచ్ డేట్ ఫిక్స్!

కిచెన్ జిడ్డుకు గుడ్‌బై చెప్పండి! అమెజాన్‌లో.. మోస్ట్ ట్రెండింగ్‌ చిమ్నీలు!

డిస్ట్రాక్షన్ ఫ్రీ హెల్త్ ట్రాకర్.. భారత్‌లోకి వచ్చేస్తున్న Google Fitbit Air, రేటు ఎంతంటే?

యాపిల్ iPhone Ultra రాకముందే.. ఫోల్డబుల్ మార్కెట్‌పై గూగుల్, శాంసంగ్ కన్ను!

లక్షల డాలర్లు తగలేసి ఇదేం డిజైన్ రా బాబు? Instagram కొత్త లోగోపై ఏకిపారేస్తున్న నెటిజన్లు!

రీచార్జ్ బాదుడుకి BSNL చెక్.. రూపాయికే సిమ్, 412 రోజుల వ్యాలిడిటీ!

Big Stories

Advertisement
×