E-Paper
Advertisement

నల్గొండలో సీఎం రేవంత్ పర్యటన.. రూ. 13 వేల కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం!

నల్గొండలో సీఎం రేవంత్ పర్యటన.. రూ. 13 వేల కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం!
Advertisement

Revanth Reddy: ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. జిల్లా సమగ్ర అభివృద్ధికి ఊతమిచ్చేలా పలు కీలక ప్రాజెక్టులకు ఆయన శ్రీకారం చుట్టారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రహదారుల రూపురేఖలను మార్చే భారీ రోడ్డు నిర్మాణ పనులతో పాటు, నల్గొండ ప్రజల దాహార్తిని తీర్చే తాగునీటి పథకానికి ముఖ్యమంత్రి శంకుస్థాపనలు చేశారు.

రూ.13,000 కోట్లతో ‘హ్యామ్’ రోడ్ల పనుల ప్రారంభం

Advertisement

పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మొదట కనగల్ మార్కెట్ యార్డ్‌కు చేరుకున్నారు. అక్కడ ప్రతిష్టాత్మక హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ (HAM – HAM) రోడ్ల పనులకు శంకుస్థాపన చేసి, దానికి సంబంధించిన పైలాన్‌ను ఆవిష్కరించారు. రాష్ట్రవ్యాప్తంగా రవాణా వ్యవస్థను మెరుగుపరచడమే లక్ష్యంగా సుమారు రూ.13,000 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ ప్రాజెక్టును చేపట్టారు. దీని ద్వారా తెలంగాణ వ్యాప్తంగా 441 రహదారులను గుర్తించి, మొత్తం 6,092 కిలోమీటర్ల మేర అధునాతన రోడ్లను నిర్మించనున్నారు.

Also Read: కాకినాడ జిల్లాలో ఫుడ్ పాయిజన్.. బజ్జీలు తిని 50 మందికి అస్వస్థత!

Advertisement

రూ.83 కోట్లతో తాగునీటి పథకం ఫేజ్-1

నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రజల తాగునీటి ఇబ్బందులను శాశ్వతంగా దూరం చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా రూ.83 కోట్ల వ్యయంతో చేపట్టనున్న డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఫేజ్-1 పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే పట్టణంలోని పలు డివిజన్ల ప్రజలకు శుద్ధి చేసిన తాగునీరు పుష్కలంగా అందుతుంది.

హాజరైన ప్రముఖులు

ఈ అధికారిక కార్యక్రమాల్లో ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వీరితో పాటు స్థానిక ఎంపీ రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యేలు జైవీర్ రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, బాలు నాయక్, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం సహా పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. శంకుస్థాపనల అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికాసేపట్లో అక్కడే ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభా ప్రాంగణానికి చేరుకుని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

Related News

ఓయో హోటల్‌లో మహిళ దారుణ హత్య.. పరారీలో యవకుడు!

దొంగ ఓట్లతోనే మోదీ, అమిషా అధికారంలోకి వచ్చారు.. ఆధారాలతో విరుచుకుపడ్డ రఘువీరా రెడ్డి!

ఆ ఛాంబర్ ముందు ఆంక్షలు ఎందుకు.. కాంగ్రెస్ సర్కార్‌పై ప్రభుత్వ ఉద్యోగులు ఫైర్!

అదుపుతప్పి మాట్లాడితే మహిళలతో కొట్టిస్తాం: కొండా సురేఖ

ఏడాదిలోపే ఇందిరమ్మ ఇళ్లు.. రెడ్ హిల్స్‌లో శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి

నీ చేతకాని తనాన్ని పార్టీ అధినేత పై మోపుతావా.. కేటీఆర్ పై కవిత ఫైర్!

గంజాయి స్మగ్లర్ల అరాచకాలకు ఇక చెక్.. ఎక్సైజ్ పోలీసుల చేతికి ఆయుధాలు..?

కవిత చెప్పినట్లుగా హరీష్ రావు గుంటనక్కే.. ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ ఘాటు వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×