E-Paper
Advertisement

బంపర్ ఆఫర్..75 ఇంచుల టీవీపై కళ్లు చెదిరే డిస్కౌంట్

బంపర్ ఆఫర్..75 ఇంచుల టీవీపై కళ్లు చెదిరే డిస్కౌంట్
Advertisement

Xiaomi tv s mini led 2026: స్మార్ట్ టీవీ మార్కెట్లో షియోమి ఎప్పుడూ ముందుంటుంది.కస్టమర్ల అభిరుచికి తగ్గట్టుగా సరి కొత్త ఫీచర్లను అందించడంలో ఈ బ్రాండ్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా కంపెనీ విడుదల చేసిన ‘షియోమి టీవీ ఎస్ మినీ ఎల్ఈడీ’ మోడల్ టెక్ లవర్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా 75 ఇంచుల భారీ డిస్‌ప్లే సైజ్‌తో వస్తున్న ఈ టీవీ ధర కేవలం రూ.99,999 మాత్రమే ఉండటం గమనార్హం. సాధారణంగా మినీ ఎల్ఈడీ టెక్నాలజీ.. ఉన్న టీవీలు మార్కెట్లో చాలా ఖరీదు ఉంటాయి. కానీ షియోమి దీన్ని చాలా తక్కువ బడ్జెట్‌లో లాంఛ్ చేసి పెద్ద స్క్రీన్ లవర్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ టీవీకి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి ఫీచర్లు:

1. మినీ ఎల్ఈడీ డిస్‌ప్లే :

ఈ టీవీ మెయిన్ హైలైట్ దాని డిస్‌ప్లే టెక్నాలజీ. మినీ ఎల్ఈడీ బ్యాక్‌ లైటింగ్ కారణంగా నలుపు రంగు మరింత స్పష్టంగా, కాంతివంతంగా కని పిస్తుంది. 4కే అల్ట్రా హెచ్‌డీ రెజల్యూషన్ తో.. వచ్చే ఈ స్క్రీన్ పై సినిమా చూస్తున్నప్పుడు థియేటర్ ఫీల్ కలుగుతుంది.డాల్బీ విజన్ , హెచ్‌డీఆర్ 10+ సపోర్ట్ ఉండటం వల్ల రంగులు చాలా నేచురల్‌గా, పర్ఫెక్ట్‌గా కనిపిస్తాయి.

2. గేమింగ్ లవర్స్‌కు పర్ఫెక్ట్ ఛాయిస్:

Advertisement

మీకు గేమింగ్ అంటే.. ఇష్టమైతే ఈ టీవీ మీకు పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. హై రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉండటం వల్ల పీఎస్‌5 లేదా ఎక్స్ బాక్స్ కనెక్ట్ చేసి ఆడుతున్నప్పుడు ఎలాంటి లాగ్ ఉండదు. గ్రాఫిక్స్ చాలా స్మూత్‌గా వస్తాయి.ఆటో లో లేటెన్సీ మోడ్, వేరియబుల్ రిఫ్రెష్ రేట్ వంటి గేమింగ్ ఫీచర్లు ఇందులో ప్రత్యేకంగా అందించారు.

3. పవర్‌ఫుల్ సౌండ్, స్మార్ట్ ఫీచర్లు:

కేవలం పిక్చర్ క్వాలిటీనే కాకుండా, సౌండ్ విషయంలోనూ షియోమి రాజీ పడలేదు. డాల్బీ అట్మాస్ సపోర్ట్ కలిగిన పవర్ ఫుల్ బిల్ట్-ఇన్ స్పీకర్లు ఇంట్లోనే హోమ్ థియేటర్ ఫీల్‌ను ఇస్తాయి. అలాగే గూగుల్ టీవీ ఓఎస్ పై పని చేసే ఈ స్మార్ట్ టీవీలో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్ వంటి అన్ని ప్రముఖ ఓటీటీ యాప్‌లను ఈజీగా యాక్సెస్ చేయెచ్చు. వాయిస్ కంట్రోల్ కోసం గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా ఉంది.

Advertisement

Also Read: అమెజాన్ సేల్ ధమాకా..సగం ధరకే ఇంటిని మెరిపించే రోబో వాక్యూమ్ క్లీనర్స్ 

కొనేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు:

బ్యాంక్ ఆఫర్లు: ప్రముఖ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్స్‌ను ఉపయోగించి కొంటే మరింత డిస్కౌంట్ లభిస్తుంది.

నో-కాస్ట్ ఈఎంఐ: బడ్జెట్ భారం కాకుండా ఉండేందుకు.. నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లను ఎంచుకోవచ్చు.

వారంటీ, ఇన్‌స్టాలేషన్: కంపెనీ అందించే వారంటీతో పాటు ఉచిత ఇన్‌స్టాలేషన్ ఆప్షన్స్ చెక్ చేసుకోండి.

మీ లివింగ్ రూమ్‌కి ఒక లగ్జరీ లుక్ తీసుకొస్తూ, బడ్జెట్ ధరలో అల్ట్రా- ప్రీమియం ఫీచర్లు కోరుకునే.. వారికి ఈ షియోమి 75 ఇంచుల మినీ ఎల్ఈడీ టీవీ  నంబర్ వన్ ఆప్షన్ అని చెప్పొచ్చు!

Related News

గీజర్ కొనే ముందు ఈ ఫీచర్లు చూడకపోతే.. కరెంట్ బిల్లుతో పాటు గీజర్ కూడా త్వరగా పాడవుతుంది!

గెలాక్సీ ఫోన్ వాడుతున్నారా? One UI 9.0 అప్‌డేట్‌లో ఈ 5 ఫీచర్లు మాత్రం మిస్ కావద్దు!

అమెజాన్ సేల్ ధమాకా..సగం ధరకే ఇంటిని మెరిపించే రోబో వాక్యూమ్ క్లీనర్స్

గూగుల్ అకౌంట్ అక్కర్లేదు.. బడ్జెట్‌లో లభించే బెస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్లు!

కరెంట్ పోయినా కూలింగ్ పోదు..ఇన్వర్టర్ కనెక్టివిటీతో 5 డబుల్ డోర్ ఫ్రిడ్జ్‌లు!

అమెజాన్ సేల్‌లోబెస్ట్ ఎయిర్ ఫ్రైయర్స్, బ్లెండర్స్‌పై భారీ డిస్కౌంట్

జియో 5జీ vs స్టార్‌లింక్.. రెడింటి మధ్య తేడా ఏంటి? భారత్ కు ఏ టెక్నాలజీ బెస్ట్?

Big Stories

Advertisement
×