E-Paper
Advertisement

బిగ్ బాస్ 10లో డబుల్ ఎలిమినేషన్.. చరణ్, అపూర్వ ఔట్!

బిగ్ బాస్ 10లో డబుల్ ఎలిమినేషన్.. చరణ్, అపూర్వ ఔట్!
Advertisement

Bigg Boss 10: బిగ్ బాస్ దశావతారంలో ఎవరి ఊహకందని ట్విస్ట్ లు ఆడియన్స్ కు సరికొత్త అనుభూతిని ఇస్తున్నాయి. బిగ్ బాస్ తెలుగు హిస్టరీలో తొమ్మిది సీజన్లు ఒక ఎత్తైతే.. పదవ సీజన్ మరో ఎత్తు అన్నట్టుగానే కొనసాగుతోంది. ఇక అందులో భాగంగానే మొత్తం పదిమంది సెలబ్రిటీలు, 6 మంది కామనర్స్ తో బిగ్ బాస్ సీజన్ 10 ఘనంగా ప్రారంభం అయింది. అందులో మొదటి వారం డబుల్ ఎలిమినేషన్ లో భాగంగా చరణ్, చైత్ర ఇద్దరు మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటూ బయటకు వచ్చేశారు.. కానీ చరణ్ మళ్ళీ హౌస్ లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. రెండవ వారం కృష్ణుడు ఎలిమినేట్ కాగా.. మూడవ వారం వంశీ, వర్షిని లలో ఎవరో ఒకరు ఎలిమినేట్ కావాల్సి ఉంది. కానీ ముఖేష్ తన కెప్టెన్సీ పవర్ ను ఉపయోగించి ఇద్దరినీ సేఫ్ చేశారు. కానీ అదే మూడవ వారంలో వైల్డ్ కార్డు ద్వారా అడుగుపెట్టారు అపూర్వ , మిథిలేష్ రెడ్డి. కామనర్ కేటగిరీలో వచ్చారు. అయితే అపూర్వ హౌస్ లో ఉండిపోయింది. కానీ మిథిలేష్ మాత్రం బిగ్ బాస్ ఇచ్చిన షూట్ కేస్ ఆఫర్ ని తీసుకొని బయటకు వెళ్లిపోయారు.

ఐదవ వారం డబుల్ ఎలిమినేషన్..

నాల్గవ వారం సృష్టి ఎలిమినేట్ అయింది. అయితే ఇప్పుడు ఐదవ వారం బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్స్ ను తీసుకురావడానికి ఏకంగా డబుల్ ఎలిమినేషన్ చేశారు. అందులో భాగంగానే మొదట అపూర్వను ఎలిమినేట్ చేసినట్లు మొదటి ప్రోమోలో చూపించారు. ఇక చరణ్ కూడా ఎలిమినేట్ అయినట్లు చూపిస్తున్నారు. కానీ ఇంకా అఫీషియల్ గా ప్రోమో రిలీజ్ చేయలేదు. అలా మొత్తానికైతే వైల్డ్ కార్డు ఎంట్రీస్ కోసం చరణ్ , అపూర్వ లను డబుల్ ఎలిమినేషన్ లో భాగంగా హౌస్ నుండి బయటకు పంపించేశారు.

అపూర్వ బిగ్ బాస్ 10 ద్వారా ఎంత సంపాదించింది?

Advertisement

ఇదిలా ఉండగా ఐదవ వారం ఇద్దరూ ఎలిమినేట్ అయ్యారు. మరి ఈ ఇద్దరికీ ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారు? అనే విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముందుగా అపూర్వ విషయానికి వస్తే..వైల్డ్ కార్డు ద్వారా మూడవ వారం హౌస్ లోకి అడుగు పెట్టింది ఈ ముద్దుగుమ్మ. కామనర్ కేటగిరీలో హౌస్ లోకి అడుగు పెట్టింది. వారానికి రూ.75 వేల చొప్పున మూడు వారాలకు గాను సుమారుగా రూ.2,25,000 సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఇక అగ్ని పరీక్షా సీజన్ 2 లో పార్టిసిపేట్ చేసినందుకుగాను ఈమెకు 50,000 ఇచ్చారని అలా మొత్తంగా 2,75,000 రెమ్యూనరేషన్ గా తీసుకున్నట్లు సమాచారం.

also read:ఆ నలుగురి బండారం బయటపెట్టిన అపూర్వ.. వీడియో వైరల్!

చరణ్ రెమ్యునరేషన్ ఎంతంటే?

Advertisement

చరణ్ విషయానికి వస్తే.. అగ్నిపరీక్ష సీజన్ 2 ద్వారా కామనర్ గా హౌస్ లోకి అడుగుపెట్టిన చరణ్ వారానికి 70 వేల చొప్పున రెమ్యూనరేషన్ అందుకున్నారు. అలాగే అగ్నిపరీక్షలో వారానికి 50,000 చొప్పున మూడు వారాలు ఉన్నందుకు లక్ష యాభై వేలు అందుకున్నారు.. ఇక మొత్తంగా చూసుకుంటే బిగ్ బాస్ సీజన్ 10 ద్వారా చరణ్ కి రూ.2,20,000 లభించినట్లు సమాచారం.

Related News

శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో స్క్రిప్ట్ రైటర్ రెమ్యూనరేషన్ అంతా?

ఆ నలుగురి బండారం బయటపెట్టిన అపూర్వ.. వీడియో వైరల్!

Podarillu Today Episode : కన్నా ఫుల్ హ్యాపీ.. నారాయణ కన్నీళ్లు.. మహా వెళ్ళిపోతుందా..?

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. ప్రణతి కాపురంలో చిచ్చు.. అవని, కమల్ అరెస్ట్..

Gundeninda GudiGantalu Today episode: బాలు దెబ్బకు రచ్చ రచ్చ.. రోహిణి ఫుల్ హ్యాపీ.. మనోజ్ కు షాక్…

Illu Illalu Pillalu Today Episodes: పాపం చందు.. కన్నీళ్లు పెట్టుకున్న రామరాజు.. భాగ్యం పై వల్లి సీరియస్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 11th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని వైజయంతి కనిపెడుతుందా..?

Big Stories

Advertisement
×