E-Paper
Advertisement

జస్ట్ రూ.2,499కే సూపర్ బైక్.. యమహా అదిరిపోయే పండుగ ఆఫర్లు!

జస్ట్ రూ.2,499కే సూపర్ బైక్.. యమహా అదిరిపోయే పండుగ ఆఫర్లు!
Advertisement

Yamaha Festival Offers 2026:  పండుగ సీజన్‌ లో కొత్త స్కూటర్, బైక్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే యమహా మోటార్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. పలు స్కూటర్లు, మోటార్‌ సైకిళ్లపై ప్రత్యేక ఫెస్టివ్ ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్లలో ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ తో పాటు తక్కువ డౌన్ పేమెంట్‌ తో వెహికల్ సొంతం చేసుకునే అవకాశం కల్పిస్తోంది.  ఫాసినో 125, రేజెడ్ఆర్ 125 నుంచి FZ సిరీస్, R15, MT15 వరకు పలు మోడళ్లపై ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

ఫాసినో 125, రేజెడ్ఆర్ 125పై స్పెషల్ బెనిఫిట్స్

యమహా ఫాసినో 125, రేజెడ్ఆర్ 125 స్కూటర్లను కొనుగోలు చేసేవారికి రూ.3,399 నుంచి ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ లభిస్తాయి. ఈ రెండు స్కూటర్లకు డౌన్ పేమెంట్ కూడా రూ.2,499 నుంచే ప్రారంభమవుతుంది. తక్కువ మొత్తంతో స్కూటర్ కొనాలని చూస్తున్నవారికి ఈ ఆఫర్ ఉపయోగపడుతుంది. అయితే, ఫైనాన్స్ అప్రూవల్, వెహికల్ ధర, డీలర్ రూల్స్ ఆధారంగా చెల్లించాల్సిన మొత్తం మారే అవకాశం ఉంటుంది.

FZ సిరీస్ బైక్‌లపై రూ.5,999 వరకు బెనిఫిట్స్

Advertisement

యమహా FZ సిరీస్ మోటార్‌సైకిళ్లపై కూడా పండుగ ఆఫర్లు ప్రకటించింది. ఈ మోడళ్లకు రూ.5,999 వరకు ఇన్సూరెన్స్ ప్రయోజనాలు లభిస్తాయి. వీటిలో FZ-S Fi హైబ్రిడ్, FZ-S Fi, FZ-S Fi V4 DLX, FZ-S Fi V4, FZ రేవ్, FZ-Fi, FZ బ్లూ ఫ్లెక్స్ మోడళ్లు ఉన్నాయి. ఈ సిరీస్‌లోని బైక్‌లను కొనుగోలు చేసేందుకు డౌన్ పేమెంట్ రూ.3,900 నుంచి ప్రారంభమవుతుంది. తమ బడ్జెట్‌కు సరిపోయే FZ మోడల్‌ను ఎంచుకోవాలనుకునేవారు యమహా డీలర్‌షిప్‌ను సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చు.

XSR155పై రూ.5,555 ఇన్సూరెన్స్ బెనిఫిట్

యమహా XSR155 కొనుగోలుపైనా ప్రత్యేక ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ మోడల్‌కు రూ.5,555 ఇన్సూరెన్స్ ప్రయోజనం లభిస్తుంది. దీని డౌన్ పేమెంట్ రూ.4,999 నుంచి ప్రారంభమవుతుంది. రెట్రో డిజైన్‌తో కూడిన ఈ బైక్‌ను కొనాలని భావిస్తున్నవారికి అదిరిపోయే ఆఫర్ లభిస్తుంది.

R15, MT-15 కొనేవారికి తక్కువ డౌన్ పేమెంట్!

Advertisement

యమహా R15, MT-15 మోడళ్లపై ఈ స్కీమ్ కింద ప్రత్యేక ఇన్సూరెన్స్ బెనిఫిట్ ప్రకటించలేదు. అయితే, ఈ రెండు బైక్‌లను రూ.4,999 ప్రారంభ డౌన్ పేమెంట్‌తో కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ మొత్తం ప్రారంభ ఆఫర్ మాత్రమే. పూర్తి ఫైనాన్స్ వివరాలు డీలర్ దగ్గర తెలుసుకోవాల్సి ఉంటుంది.

ఆఫర్లు ఎక్కడ అందుబాటులో ఉన్నాయి?

ఈ ఫెస్టివ్ ఆఫర్లు తమిళనాడు, కేరళ మినహా దేశవ్యాప్తంగా యమహా డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉన్నాయి. ఇవి లిమిటెడ్ పీరియడ్ ఆఫర్లు కావడంతో కొనుగోలు చేసే ముందు ఆఫర్ గడువు, అర్హతలు, ఫైనాన్స్ నిబంధనలు, ఇతర ఛార్జీలను నిర్ధారించుకోవడం మంచిది.

Read Also: హైదరాబాద్‌లోకి రాయల్ ఎన్‌ఫీల్డ్ ఫ్లయింగ్ ఫ్లీ.. ఎలక్ట్రిక్ బైక్ ధర ఎంతంటే?

Tags

Related News

అమ్మకాల్లో దుమ్మురేపిన టాప్ 10 కార్లు.. సెప్టెంబర్ లో నెంబర్ వన్ ఏదంటే?

దీపావళికి ఫ్యామిలీ కార్ కొనాలా? రూ.10 లక్షల లోపు 5 క్రేజీ సెవెన్ సీటర్ కార్లు ఇవే!

ఈ దీపావళికి సన్‌ రూఫ్ కార్ కొనాలనుకుంటున్నారా? రూ.15 లక్షల లోపు 5 బెస్ట్ కార్లు ఇవే!

హైదరాబాద్‌లోకి రాయల్ ఎన్‌ఫీల్డ్ ఫ్లయింగ్ ఫ్లీ.. ఎలక్ట్రిక్ బైక్ ధర ఎంతంటే?

మారుతి సుజుకి క్రేజీ ఎలక్ట్రిక్ కారు.. సింగిల్ ఛార్జ్‌ తో ఏకంగా 300 కి.మీ రేంజ్!

హోండా రెబెల్ 500 వచ్చేస్తోంది, కొత్త ఫీచర్లు చూస్తే వారెవ్వా అనాల్సిందే!

ఫ్లిప్‌ కార్ట్‌ లోకి రివర్ ఇండి ఎలక్ట్రిక్ స్కూటర్ ఎంట్రీ.. ఇక ఇంట్లో నుంచే బుక్ చేసుకోవచ్చు!

Big Stories

Advertisement
×