YOROTO YO-413BTL wireless speaker: ఇంట్లో కూర్చుని సినిమాలు చూసేటప్పుడు లేదా పాటలు వినేటప్పుడు మంచి సౌండ్ ఎఫెక్ట్ ఉంటే.. ఆ మజాయే వేరుగా ఉంటుంది. కానీ.. మంచి స్పీకర్ కొనాలంటే ఖర్చు ఎక్కువ అవుతుందని చాలా మంది వెనకాడతారు. అలాంటి వారి కోసం మార్కెట్లో కేవలం రూ.724 బడ్జెట్‌లోనే ఆర్జీబీ లైట్లు, 20W పవర్ఫుల్ సౌండ్‌తో.. వస్తున్న ‘YOROTO YO-413BTL’ వైర్‌లెస్ సౌండ్‌బార్ ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. తక్కువ ధరలో ప్రీమియం లుక్ , అదిరిపోయే బేస్ అందించే ఈ స్పీకర్ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుత రోజుల్లో టెక్నాలజీ మారుతున్న కొద్దీ.. తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్లు ఉన్న గ్యాడ్జెట్లు మార్కెట్లోకి వస్తున్నాయి.ముఖ్యంగా గంటల తరబడి మ్యూజిక్ ఎంజాయ్ చేసే యూత్ కోసం బ్రాండ్లు కొత్త ప్రయోగాలు చేస్తున్నాయి. అలాంటి కోవకే చెందిన ‘YOROTO YO-413BTL’ వైర్‌లెస్ స్పీకర్, తన తక్కువ ధర, ఆకట్టుకునే ఫీచర్లతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
1. డిజైన్,ఆర్జీబీ లైట్లు:
ఈ సౌండ్‌బార్ డిజైన్ చాలా స్టైలిష్‌గా,మోడ్రన్‌గా ఉంటుంది. దీని ముందు భాగంలో.. వచ్చే ఆర్జీబీ లైట్లు దీని లుక్‌ను పూర్తిగా మార్చేస్తాయి. మీరు చీకటి గదిలో.. పాటలు వింటున్నప్పుడు ఈ లైట్ల ఎఫెక్ట్ ఒక చిన్న పార్టీ హాల్ లాంటి ఫీల్ ఇస్తుంది. దీని కాంపాక్ట్ సైజ్ కారణంగా.. దీన్ని మీ వర్క్ డెస్క్ మీద, టీవీ టేబుల్ పై లేదా ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లొచ్చు.
2.సౌండ్ క్వాలిటీ ,బేస్:
YOROTO YO-413BTL మోడల్ 20W పవర్ అవుట్‌పుట్‌తో వస్తుంది. ఈ సైజ్ స్పీకర్ నుంచి వచ్చే సౌండ్ ఊహించిన దానికంటే .. చాలా గట్టిగా , స్పష్టంగా వినిపిస్తుంది. ఇందులో.. ఉండే ప్రత్యేకమైన స్పీకర్ డ్రైవర్లు ‘పంచీ బేస్’ను అందిస్తాయి. మీరు బీట్స్ ఉన్న పాటలు వినేటప్పుడు.. లేదా యాక్షన్ సినిమాలు చూస్తున్నప్పుడు.. ఈ బేస్ ఎఫెక్ట్ మీకు నిజంగా మంచి థ్రిల్ ఇస్తుంది.
3.కనెక్టివిటీ, బ్యాటరీ బ్యాకప్:
ఈ వైర్‌లెస్ స్పీకర్‌లో లేటెస్ట్ బ్లూటూత్ టెక్నాలజీ ఉంది. మీ స్మార్ట్ ఫోన్, ట్యాబ్లెట్ లేదా ల్యాప్ టాప్‌ను కేవలం క్షణాల్లో దీనికి కనెక్ట్ చేసుకోవచ్చు. వైర్ల గోల లేకుండా.. ఎక్కడికైనా క్యారీ చేయడానికి ఇది పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. అలాగే ఇందులో.. ఉండే బ్యాటరీ సాధారణ వాడుకకు తగినంత బ్యాకప్ ఇస్తుంది. అంతే కాకుండా.. దీని వల్ల కరెంట్ లేని సమయంలో కూడా మ్యూజిక్ ఆగిపోకుండా ఎంజాయ్ చేయొచ్చు.
ఎవరికి బెస్ట్?
మీరు కాలేజీ స్టూడెంట్ అయినా.. బ్యాచిలర్ రూమ్‌లో ఉంటున్నా లేదా తక్కువ బడ్జెట్‌లో మీ ల్యాప్‌టాప్/ఫోన్ సౌండ్‌ని పెంచుకోవాలని చూస్తున్నా ఈ సౌండ్‌బార్ బెస్ట్ ఆప్షన్. కేవలం ఏడు వందల రూపాయల ధరలో.. ఇలాంటి ఆర్జీబీ లైట్లు, 20W సౌండ్ ఇవ్వడం నిజంగా గ్రేట్ అని చెప్పవచ్చు.
Also Read: 10 గంటలు బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే.. ఓరియంట్ ఫ్యాన్, కరెంట్ లేకపోయినా నో టెన్షన్
ధర:
ప్రస్తుతం ఆన్‌లైన్ మార్కెట్లలో.. బ్లూటూత్ సౌండ్‌బార్ కేవలం రూ.724 ధరకే అందుబాటులో ఉంది. బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్‌లో వాల్యూ ఫర్ మనీ కోరుకునే.. వారికి ఇది బెస్ట్ అని చెప్పొచ్చు.
తక్కువ ఖర్చుతో.. ఎక్కువ ఎంటర్టైన్మెంట్ పొందాలనుకునే వారికి ఈ వైర్‌లెస్ సౌండ్‌బార్ ఫర్ఫెక్ట్. దీని స్టైలిష్ ఆర్జీబీ లైట్లు, 20W పవర్ఫుల్ సౌండ్ బేస్ దీనిని మార్కెట్లో ట్రెండీగా నిలుపుతున్నాయి. మీరు కూడా తక్కువ ధరలో మంచి స్పీకర్ కొనాలనుకుంటే దీనిని వెంటనే ఆర్డర్ చేయండి.