E-Paper
Advertisement

చిన్నారుల్లో వ్యాధులు.. ఒక్కో ఇంజక్షన్ రూ.12 కోట్ల వెనుక అసలు నిజం!

చిన్నారుల్లో వ్యాధులు.. ఒక్కో ఇంజక్షన్ రూ.12 కోట్ల వెనుక అసలు నిజం!
Advertisement

Kissik Talks: ముక్కుపచ్చలారని చిన్నపిల్లల్లో అరుదైన వ్యాధులు వస్తుండడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇంతకు మించిన మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. పిల్లల్లో వచ్చే అరుదైన వ్యాధులకు ఉపయోగించే ఇంజక్షన్లు ఏకంగా కోట్ల రూపాయలు విలువ చేయడం.. చిన్నారులలో వచ్చే ఈ అత్యంత అరుదైన జన్యుపరమైన వ్యాధుల విషయానికొస్తే.. అందులో మొదటిగా చెప్పుకోవాల్సింది ‘స్పైనల్ మస్కులర్ అట్రోఫీ’.. ఈ చికిత్స కోసం ఉపయోగించే ‘జోల్జెన్స్మా’ ఇంజక్షన్ ఖరీదు అక్షరాల రూ.16 కోట్ల నుండి రూ.17.5 కోట్ల వరకు ఉంటుంది.

చిన్నారుల్లో వచ్చే అరుదైన వ్యాధులు.. కోట్లల్లో ఒక్కో ఇంజక్షన్..

ఇది అత్యంత ప్రమాదకరమైన జన్యులోప వ్యాధి.. శరీరంలో ఎస్ ఎమ్ ఎన్ 1(SMN 1) అనే ముఖ్యమైన జన్యు లోపించడం వల్ల మోటారు న్యూరాన్లు దెబ్బతింటాయి. దీనివల్ల పిల్లల కండరాలు బలహీనపడి, కనీసం తల నిలపడం, కూర్చోవడం, మింగడం, సొంతంగా శ్వాస తీసుకోవడం కూడా చేయలేరు. సకాలంలో వైద్యం అందకపోతే వ్యాధి సోకిన పిల్లలు.. రెండేళ్లు దాటకముందే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. సుమారుగా 10,000 మందిలో ఒకరికి సోకే ఈ అరుదైన వ్యాధి ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఈ అరుదైన వ్యాధి సోకడం, సామాన్య ప్రజలు డబ్బు సేకరణ కోసం పలువురిని ఆశ్రయించడం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఎక్కడ చూసిన చిన్న పిల్లల్లో వచ్చే అరుదైన వ్యాధుల కోసం వేసే ఒక్కో ఇంజక్షన్ కోట్ల రూపాయలు చేస్తుండడం పై తాజాగా హీరోయిన్ అలియాస్ డాక్టర్ కామాక్షి తో వర్ష ప్రస్తావించారు.

ఇంజక్షన్ ఖరీదుపై కామాక్షి రియాక్షన్..

Advertisement

విషయంలోకి వెళ్తే.. అగధ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న హీరోయిన్ అలియాస్ డాక్టర్ కామాక్షి భాస్కర్ల (Kamakshi Bhaskarla) తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కిస్సిక్ టాక్స్(Kissik Talks) కార్యక్రమానికి గెస్ట్ గా వచ్చింది. ఈ ఇంటర్వ్యూలో ఈ విషయంపై వర్షా మాట్లాడుతూ..” చిన్నపిల్లల్లో వచ్చే అరుదైన వ్యాధుల కోసం వాడే ఒక్కో ఇంజక్షన్ ఖరీదు రూ.12 కోట్లు, రూ.15 కోట్లు అంటున్నారు కదా.. ఎందుకంత కాస్ట్? అంటూ ప్రశ్నించగా.. కామాక్షి మాట్లాడుతూ. ఆ ఇంజెక్షన్ తయారు చేయడానికి కంపెనీలు కొన్ని సంవత్సరాల పాటు పరిశోధనలు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా వాటిలో ఉపయోగించే మెడిసిన్ చాలా ఎక్స్పెన్సివ్. అందుకే ఆ ఇంజక్షన్ ధర అంత ఖరీదు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి వ్యాధులు చాలా అరుదుగా వస్తాయి”. అంటూ చెప్పుకొచ్చింది.

also read:పానీపూరీ తినడం వల్ల రోగాలు వస్తాయా? షాకింగ్ ఫ్యాక్ట్స్ బయటపెట్టిన కామాక్షి!

పుట్టుకతోనే ఇలాంటి వ్యాధులు వస్తాయి..

Advertisement

ఇంత డేంజరస్ వైరస్ నిజంగా పిల్లలకి వస్తుందా? అని వర్ష మళ్ళీ ప్రశ్నించగా.. నిజంగా వస్తాయి.. పిల్లల్లో పుట్టుకతోనే వచ్చే కొన్ని రోగాలు ఉంటాయి. ఆ రోగాలు చాలా ఎక్స్పెన్సివ్ తో కూడుకున్నవి అంటూ కామాక్షి సమాధానం ఇచ్చింది.

వ్యాధులు రాకుండా అడ్డుకట్ట వేయాలంటే?

ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు అని ప్రశ్నించగా.. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ సమయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.. కడుపులో అండం పిండం గా మొదలైనప్పటి నుండి డెలివరీ అయ్యే వరకు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎన్నో టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుంది అలా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి అరుదైన రోగాలకు అడ్డుకట్ట వేయొచ్చు అంటూ తన మాటగా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కామాక్షి చేసిన ఈ కామెంట్లు, ఆ ఇంజక్షన్ ఖరీదు వెనుక అసలు కారణాలు చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది కామాక్షి.

Related News

చంపేయ్ దేవుడా.. నరకం భరించలేకపోతున్నా – సుప్రీత

సుప్రీత మధ్యలోనే చదువు ఆపిందా.. కన్నీళ్లు తెప్పించే స్టోరీ!

ఈ గుర్తింపు బిగ్ బాస్ పెట్టిన భిక్ష.. రోహిత్ తీరుపై కౌశల్ మండిపాటు!

Karthika Deepam 2 Serial Today Episode October 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినికి షాక్ ఇచ్చిన సూరజ్ – పీఏగా జ్యోత్స్న అపాయింట్            

Ninnu kori Serial Today Episode October 5th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను జీవన్ చంపేస్తాడా..? చంద్ర కనిపెడుతుందా..? 

Nindu Noorella Saavasam Serial Today Episode October 5th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి తనను చంపేస్తుందని పార్థు పసిగడతాడా..?    

Monday Tv Movies : మూవీ లవర్స్ కు పూనకాలే.. వీటిని మస్ట్ వాచ్..

సుప్రీత ఆస్తుల విలువ ఎంతో తెలుసా? చిట్టా మొత్తం బయటపెట్టిందిగా?

Big Stories

Advertisement
×