E-Paper
Advertisement

రూ.2వేల బడ్జెట్‌లోపే డీజే సౌండ్.. ఫుల్ వైబ్ మోడ్ అంతే

రూ.2వేల బడ్జెట్‌లోపే డీజే సౌండ్.. ఫుల్ వైబ్ మోడ్ అంతే
Advertisement

Zebronics Sound Feast 45 review: ప్రస్తుత రోజుల్లో మ్యూజిక్ లవర్స్ అందరూ.. ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లగల పోర్టబుల్ స్పీకర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా బడ్జెట్ ధరలో దిల్ ఖుష్ చేసే సౌండ్ క్వాలిటీ.. ఉండే గ్యాడ్జెట్ లకు ఫుల్ డిమాండ్ ఉంది.ఈ ట్రెండ్‌కు తగినట్టుగానే ఆడియో బ్రాండ్ జెబ్రానిక్స్ మార్కెట్లోకి తెచ్చిన సరి కొత్త మోడలే ‘Sound Feast 45’. కేవలం రూ.1,999 ధరలో.. లభిస్తున్న ఈ పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్ అసలు ఎలా పని చేస్తుంది? దీని ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

డిజైన్, ఆర్జీబీ లైటింగ్ :

Advertisement

ఈ స్పీకర్ డిజైన్ చాలా స్టైలిష్‌గా ఉంటుంది. దీన్ని ఎక్కడికైనా ఈజీగా మోసుకెళ్లడానికి వీలుగా పైన ప్రత్యేకమైన క్యారీ హ్యాండ్ ఇవ్వడం దీనిలో మెరుగైన ప్లస్ పాయింట్. దీనికి అదనపు ఆకర్షణగా ఆర్జీబీ లైటింగ్ మోడ్స్ ఇచ్చారు. మీరు చీకటి గదిలో లేదా రాత్రి సమయంలో.. పాటలు ప్లే చేస్తున్నప్పుడు ఈ లైట్లు రంగులద్దినట్టు మారుతూ అచ్చం మినీ పార్టీ వైబ్‌ను అందిస్తాయి.

సౌండ్ అవుట్‌పుట్ , పెర్ఫార్మెన్స్ :

ఈ బడ్జెట్ స్పీకర్ సైజు చిన్నదిగా ఉన్నప్పటికీ, దీని పనితీరు మాత్రం అదుర్స్ అనిపిస్తుంది. ఇది ఏకంగా 20W (20 వాట్స్) RMS సౌండ్ అవుట్‌పుట్‌ను అందిస్తుంది. ఇందులో.. ఉన్న డీప్ బాస్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. మీరు రూమ్‌లో లేదా చిన్నపాటి టెర్రస్ పార్టీల్లో పాటలు పెట్టుకుంటే సౌండ్ చాలా లౌడ్‌గా, క్లియర్‌గా వినిపిస్తుంది. బాస్ లవర్స్‌ను నిరాశపరచని విధంగా దీని ఆడియో ట్యూనింగ్ ఉంటుంది.

కనెక్టివిటీ ఆప్షన్స్ :

Advertisement

కేవలం బ్లూటూత్ ద్వారానే కాకుండా.. ఇందులో మల్టిపుల్ కనెక్టివిటీ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి.

USB పెన్ డ్రైవ్ సపోర్ట్

మైక్రో ఎస్డీ కార్డ్

ఎఫ్ఎం రేడియో

TWS (ట్రూ వైర్‌లెస్ స్టీరియో) ఫీచర్ ద్వారా మరో స్పీకర్‌ను కనెక్ట్ చేసి డబుల్ సౌండ్ పొందొచ్చు.

Also Read: మూవీ లవర్స్ కోసం క్రేజీ గ్యాడ్జెట్..ఈ ప్రొజెక్టర్ ఫీచర్లు నెక్స్ట్ లెవెల్ !

బ్యాటరీ బ్యాకప్:

పోర్టబుల్ స్పీకర్లలో బ్యాటరీ లైఫ్ చాలా ముఖ్యం. ఈ జెబ్రానిక్స్ సౌండ్ ఫీస్ట్ 45 స్పీకర్ సుమారు 5 గంటల వరకు నిరంతర ప్లేబ్యాక్ టైమ్‌ను అందిస్తుంది. టైప్-సీ ఛార్జింగ్ పోర్ట్ సపోర్ట్ ఉండటం వల్ల త్వరగా ఛార్జ్ అవుతుంది.

రూ.2 వేల బడ్జెట్‌లో మంచి లౌడ్ సౌండ్, ఆర్జీబీ లైట్లు, పోర్టబుల్ డిజైన్ కోరుకునే వారికి ‘Zebronics Sound Feast 45’ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. వీకెండ్ ట్రిప్స్, ఇల్లు లేదా రూమ్‌లో జరిగే చిన్న పార్టీలకు.. ఇది పర్ఫెక్ట్ వాల్యూ ఫర్ మనీ గ్యాడ్జెట్!

Related News

రూ15,000 లోపే 6000mAh బ్యాటరీ, డ్యూయల్ స్క్రీన్.. హానర్ కొత్త ఫోన్ లాంచ్!

వాట్సప్‌లో కొత్త ప్రైవసీ ఫీచర్.. లింక్డ్ డివైజ్‌లలో ఇక ఆ చాట్స్ కనిపంచవు!

స్టూడెంట్స్‌కి గుడ్ న్యూస్.. ఫ్రీగా ఏడాది పాటు ఫోటోషాప్ సబ్‌స్క్రిప్షన్.. ఇలా క్లెయిమ్ చేసుకోండి!

ఇక సైబర్ నేరగాళ్ల పని గోవిందా.. కేంద్రం తెచ్చిన ఈ సూపర్ టూల్ గురించి తెలుసా?

జియో చౌకైన ప్లాన్ లాంచ్.. రూ.123కే 28 రోజుల వ్యాలిడిటీ.. డైలీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్!

డైమెన్సిటీ 7360 MAX ప్రాసెసర్‌తో ఒప్పో మాస్ ఎంట్రీ.. గేమింగ్ ప్రియులకు పూనకాలే!

స్కూల్ బ్యాగ్ కాదు.. బుల్లెట్ ప్రూఫ్ కవచం.. టర్కీ కంపెనీ వినూత్న ఆవిష్కరణ!

చూడగానే నచ్చేసే క్యూట్ డిజైన్.. బోస్ సౌండ్‌తో నాయిస్ మాస్టర్ బడ్స్ ఓపెన్, ఆఫర్ ధర ఎంతంటే?

Big Stories

Advertisement
×