E-Paper
Advertisement

బడ్జెట్ ఫ్రెండ్లీ.. సౌండ్‌బార్ కోసం చూస్తున్నారా?

బడ్జెట్ ఫ్రెండ్లీ.. సౌండ్‌బార్ కోసం చూస్తున్నారా?
Advertisement

Zionik ZoomBlaze 25W Bluetooth soundbar: ప్రస్తుత ట్రెండ్‌లో కాలేజీ స్టూడెంట్స్ నుంచి వర్కింగ్ ప్రొఫెషనల్స్ వరకు ప్రతి ఒక్కరూ మ్యూజిక్ ప్రియులే. తక్కువ ఖర్చుతోనే హై-క్వాలిటీ ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకునే వారి కోసం గ్యాడ్జెట్ మార్కెట్ రకరకాల ప్రయోగాలు చేస్తోంది. ఆ కోవకే చెందిన ‘Zionik ZoomBlaze 25W soundbar’ వైర్‌లెస్ సౌండ్ బార్, దీని అమేజింగ్ ఫీచర్లు, అతి తక్కువ ధరతో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. కేవలం రూ.599 ధరకే అందుబాటులో ఉన్న ఈ సౌండ్‌బార్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

డిజైన్, బిల్డ్ క్వాలిటీ:

దీని డిజైన్ విషయానికి వస్తే.. ఇది చాలా కాంపాక్ట్‌గా, స్టైలిష్‌గా ఉంటుంది. దీనిని మీరు టీవీ స్టాండ్ పైన లేదా మీ వర్క్ డెస్క్ పైన ఈజీగా సర్దుబాటు చేసుకోవచ్చు. ప్లాస్టిక్ బాడీతో.. తయారైనప్పటికీ, దీని ఫినిషింగ్ ప్రీమియం లుక్‌ను ఇస్తుంది. తక్కువ బడ్జెట్ పరికరాల్లో.. ఇలాంటి బిల్డ్ క్వాలిటీ లభించడం నిజంగా ప్రత్యేకత అనే చెప్పాలి. ఎక్కువ స్థలాన్ని ఆక్రమించకపోవడం వల్ల చిన్న గదులకు ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.

ఆడియో క్వాలిటీ, పెర్ఫార్మెన్స్:

Advertisement

ఈ సౌండ్‌బార్ 25W పవర్ అవుట్‌ పుట్‌తో వస్తుంది. ఇది ఒక చిన్న లేదా మధ్య తరహా గదికి సరిపడా సౌండ్‌ను అందిస్తుంది. ముఖ్యంగా.. ఇందులో ఉన్న డ్యూయల్ డ్రైవర్లు స్పష్టమైన సౌండ్, మంచి బేస్ ప్రొడ్యూస్ చేస్తాయి. పాటలు వినేటప్పుడు.. వాయిస్ చాలా క్లియర్‌గా వినిపిస్తుంది. 25W అనేది ఈ బడ్జెట్ సెగ్మెంట్లో చాలా మంచి పవర్ అని చెప్పవచ్చు.

కనెక్టివిటీ ఆప్షన్స్:

బ్లూటూత్ కనెక్టివిటీ ఇందులో ప్రధాన ఫీచర్. మీరు మీ స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్ లేదా ల్యాప్‌ టాప్‌ను కేవలం కొన్ని సెకన్లలోనే దీనికి కనెక్ట్ చేయవచ్చు. దీని వల్ల వైర్ల గోల లేకుండా మీ మ్యూజిక్ లైబ్రరీని ఎలాంటి అడ్డు లేకుండా ఎంజాయ్ చేయెచ్చు. వీటితో పాటు, ఇతర బేసిక్ కనెక్టివిటీ పోర్టులు ఉండటం వల్ల టీవీలకు కూడా దీనిని ఈజీగా కనెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

Advertisement

Also Read:  10 గంటలు బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే.. ఓరియంట్ ఫ్యాన్, కరెంట్ లేకపోయినా నో టెన్షన్

మీరు కాలేజీ విద్యార్థి అయినా, బ్యాచిలర్ రూమ్‌లో.. ఉంటున్నా లేదా తక్కువ ధరలో మీ టీవీ లేదా సిస్టమ్ సౌండ్‌ని పెంచుకోవాలనుకునే వారికైనా ఇది బెస్ట్ ఛాయిస్. ఇది అందరికీ అందుబాటులో ఉండే ధరలో లభిస్తుంది కాబట్టి, బడ్జెట్ సౌండ్‌బార్‌గా దీనికి తిరుగులేదు. ఎలాంటి అదనపు ఖర్చులు లేకుండా ఫుల్ ఎంటర్ టైన్మెంట్ కోరుకునే వారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.

ధర:

ప్రస్తుతం ఆన్‌లైన్ మార్కెట్లలో ఈ  సౌండ్‌బార్ కేవలం రూ. 599 ధరకే లభిస్తోంది. ఆఫర్లు ఉన్నప్పుడు ధర ఇంకా తక్కువ అవుతుంది. ఇంత తక్కువ ధరలో 25W పవర్ అంటే…ఇది ఖచ్చితంగా ‘వాల్యూ ఫర్ మనీ’ ప్రొడక్ట్ అని చెప్పవచ్చు.

Also Read: మైండ్ బ్లోయింగ్ బేస్.. అదిరిపోయే లైట్స్! రూ.724కే బెస్ట్ సౌండ్‌బార్!

Related News

వాట్సాప్‌లో అదిరిపోయే ప్రైవసీ ఫీచర్.. ఇంతకీ’రెస్ట్రిక్టెడ్ చాట్’ అంటే ఏంటీ?

ఆన్ లైన్ షాపింగ్ చేయకపోయినా పార్శిల్ వచ్చిందా? ఇలా చేస్తే..నిలువునా మోసపోతారు!

యూట్యూబ్‌లో ఏ వీడియో క్వాలిటీకి ఎంత డేటా ఖర్చవుతుందో తెలుసా?

ఐఫోన్ బ్యాటరీని బ్యాక్‌గ్రౌండ్‌లో తినేస్తున్నది ఇదే.. ఈ ఒక్క సెట్టింగ్ మార్చండి చాలు!

ఫోన్ అడిక్షన్ అనుకుంటున్నారా? ఉదయాన్నే ఫోన్ చూడటం వెనుక అసలు సైకాలజీ ఇదే!

పవర్ బ్యాంక్‌ వాడుతున్నారా? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు!

ఆపిల్ వాచ్..పాత లుక్కే అయినా పర్ఫార్మెన్స్‌లో అదుర్స్!

రూ.50 వేలలోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు..అమెజాన్,ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఇవే బెస్ట్!

Big Stories

Advertisement
×