Mahindra XEV 9S 6-Seater Launched: మహీంద్రా ఎలక్ట్రిక్ SUV XEV 9Sలో కొత్త 6 సీట్ల ఆప్షన్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ కొత్త వెర్షన్ లో రెండో వరుసలో కెప్టెన్ సీట్లను అందిస్తున్నారు. 6-సీట్ల XEV 9S ధర రూ.25.25 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఈ కొత్త సీటింగ్ ఆప్షన్ ను ప్యాక్ టూ అబవ్, ప్యాక్ త్రీ, ప్యాక్ త్రీ అబవ్ ట్రిమ్ లలో అందిస్తున్నారు. బేస్ ప్యాక్ వన్ అబవ్ మినహా మిగిలిన ట్రిమ్ లలో 6 సీట్ల కాన్ఫిగరేషన్ ను అందించనుంది.
7-సీట్ల వేరియంట్ తో పోలిస్తే 6-సీట్ల XEV 9S ధర రూ.25,000 ఎక్కువగా ఉంది. 6-సీట్ల వెర్షన్‌లో రెండో వరుసలో బెంచ్ సీటుకు బదులుగా రెండు ప్రత్యేకమైన కెప్టెన్ సీట్లు ఉంటాయి. దీంతో వెనుక ప్రయాణికులకు మరింత స్థలం లభిస్తుంది. 6-సీట్ల వెర్షన్‌లో ప్రధానంగా రెండో వరుసలోని కెప్టెన్ సీట్లు మార్చారు. వీటికి ప్రత్యేక ఆర్మ్ రెస్ట్ లు ఉంటాయి. అవసరమైనప్పుడు వీటిని పైకి మడవచ్చు. దీంతో మూడో వరుసకు వెళ్లేందుకు మధ్యలో మరింత స్థలం ఏర్పడుతుంది. 7-సీట్ల మోడల్‌తో పోలిస్తే మూడో వరుసలోకి ఎక్కడం, బయటకు రావడం కూడా సులభంగా ఉంటుంది.
70kWh బ్యాటరీతో కూడిన ప్యాక్ టూ వేరియంట్ ధర రూ.25.25 లక్షలుగా ఉంది. అదే ప్యాక్ టూ 79kWh వెర్షన్ ధర రూ.26.15 లక్షలు. ప్యాక్ త్రీ 70kWh ధర రూ.28.05 లక్షలు కాగా, 79kWh బ్యాటరీతో కూడిన ప్యాక్ త్రీ ధర రూ.30.15 లక్షలుగా ఉంది.
XEV 9S 6-సీట్ల వెర్షన్‌లో 70kWh, 79kWh బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి. అన్ని వేరియంట్లలో వెనుక భాగంలో ఒక ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఇది గరిష్టంగా 380Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ప్యాక్ టూ వేరియంట్‌లో మోటార్ పవర్ 245hpకి పరిమితం కాగా, మిగిలిన వేరియంట్లు 286hp శక్తిని ఉత్పత్తి చేస్తాయి. 70kWh బ్యాటరీతో XEV 9S గరిష్టంగా 600 కిలోమీటర్ల క్లెయిమ్‌డ్ రేంజ్‌ను అందిస్తుంది. 79kWh బ్యాటరీ వెర్షన్ గరిష్టంగా 679 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ వెల్లడించింది.
ఓవరాల్ గా చూస్తే, ఎక్కువ సౌకర్యం, స్పెషల్ సీటింగ్ కోరుకునే కుటుంబాల కోసం XEV 9Sలో 6 సీట్ల ఆప్షన్ ను మహీంద్రా తీసుకొచ్చింది. ముఖ్యంగా మూడో వరుస ప్రయాణికులకు ఎక్కువ స్పేస్ లభించడం ఈ కొత్త కాన్ఫిగరేషన్ లో అడిషనల్ బెనిఫిట్ గా చెప్పుకోవచ్చు.
Read Also: జూలైలో హ్యాచ్‌బ్యాక్‌ల దూకుడు.. వాగన్ ఆర్ టాప్, మారుతి హవా!