Zomato : ప్రముఖ ఫుడ్ యాప్ జోమాటో.. తాజాగా కొత్త యాప్ ను లాంఛ్ చేసింది. ఈ యాప్ తో సినిమా టికెట్ బుకింగ్, స్పోర్ట్ టికెట్ బుకింగ్ తో పాటు మరిన్ని సేవలను అందిస్తుంది.
ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో ఎప్పటికప్పుడు తన కస్టమర్స్ కోసం సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకొస్తుంది. తాజాగా ఆహారం వృథా కాకూడదని కొత్త యాప్ ను లాంఛ్ చేసిన జొమాటో.. ఇప్పుడు ఈ కామర్స్ విభాగంలో రాణిస్తున్న మరిన్ని రంగాల్లోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందుకోసమే డిస్ట్రిక్ట్ (District) పేరిట కొత్త యాప్ లో లాంఛ్ చేసింది. ఈ యాప్ సహాయంతో టికెట్ బుకింగ్, డైనింగ్ తో పాటు మరిన్ని సేవలను యూసర్స్ కు అందించేందుకు ప్రయత్నిస్తోంది.
జొమాటో తాజాగా తీసుకువచ్చిన ఈ యాప్ తో సినిమా టికెట్ బుకింగ్, ఈవెంట్స్ కోసం టికెట్ బుకింగ్స్ తేలికగా బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. స్పోర్ట్స్ టికెటింగ్, లైవ్ షోస్, డైనింగ్, షాపింగ్ వంటి పలు సేవలను సైతం ఈ యాప్ లో జోడించింది. ఇక ఈ ఏడాది ఆగస్టులో పేటీఎం నుంచి టికెటింగ్ బిజినెస్‌ను జొమాటో కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ డీల్ ఖరీదు రూ.2,048 కోట్లు. ఈ క్రమంలోనే జొమాటో ఈ సరి కొత్త సేవలను ప్రారంభించింది.
ఇక జొమాటో కొద్ది రోజుల క్రితం లాంఛ్ చేసిన సరికొత్త ఫీచర్.. ఫుడ్ రెస్కూ (Zomato Food Rescue Feature). ఈ ఫీచర్ తో ఆహారం వృథా కాకుండా ఉండటమే లక్ష్యంగా జొమాటో పనిచేస్తుంది. జొమాటో యూజర్స్ కు అతి తక్కువ ధరకే ఆహారం లభించే అవకాశం కల్పించింది. కాకపోతే జొమాటోలో బుకింగ్స్ మాత్రం నిమిషాల్లో జరిగితేనే ఈ అవకాశం దక్కుతుందని తెలిపింది. జొమాటో తాజాగా తీసుకొచ్చిన ఈ ఫీచర్ తో ఆహారం వృథా కాకుండా ఉండే ప్రయత్నాలు చేసింది. నిజానికి జొమాటోలో నెలకు దాదాపుగా నాలుగు లక్షల వరకు ఆర్డర్స్ క్యాన్సిల్ అవుతున్నాయి. దీంతో చెప్పలేని స్థాయిలో ఆహారం వృధా అవుతుంది. ఈ విషయాన్ని అరికట్టేందుకే ఫుడ్ రెస్క్యూ పేరుతో జొమాటో తీసుకొచ్చిన ఈ ఫీచర్ ఆహారం వృధా కాకుండా చూస్తుంది. ఇక ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే… ఈ ఫీచర్ తో ఎవరైనా ఫుడ్ ఆర్డర్ చేసుకొని క్యాన్సిల్ చేస్తే ఆర్డర్ తీసుకెళ్తున్న డెలివరీ పార్ట్నర్ కు మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఇతర కస్టమర్లకు నోటిఫికేషన్ వెళుతుంది. ఈ సమయంలో ఎవరైనా ఆ ఫుడ్ కావాలి అనుకుంటే ఆర్డర్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీంతో ఆహారం వృథా కావటం తగ్గుతుంది. ఇక సగం ధరకే కస్టమర్స్ కు ఆహారం లభిస్తుంది. ఈ యాప్ ను తీసుకొచ్చిన జొమాచో ఐస్ క్రీమ్స్, జ్యూస్ వంటి వాటికి ఈ ఆఫర్ ఉండదని తెలిపింది.
ALSO READ : కొత్త ఇమేజ్ జనరేషన్ ఫీచర్ తెచ్చేసిన గూగుల్.. ఇకపై రియలిస్టిక్ ఫోటోస్ మరింత తేలిక