Mahesh Babu New Business: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి దివంగత నటులు సూపర్ స్టార్ కృష్ణ (Krishna) వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మహేష్ బాబు(Mahesh Babu) మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి, ఆ తర్వాత హీరోగా తన కెరియర్ ను మొదలుపెట్టారు. ఇక ఇప్పటివరకు టాలీవుడ్(Tollywood )కే తన సినిమాలను పరిమితం చేసిన మహేష్ బాబు, ఇప్పుడు అందరూ పాన్ ఇండియా సినిమాలు చేస్తుంటే, ఈయన మాత్రం ఏకంగా పాన్ వరల్డ్ సినిమా ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచారు. కొడితే కుంభస్థలమే ఢీ కొట్టాలి అనే రేంజ్ లో రంగంలోకి దిగుతున్నారు మహేష్ బాబు.
రాజమౌళి దర్శకత్వంలో మూవీ..
ఇక అందులో భాగంగానే రాజమౌళి(Rajamouli ) దర్శకత్వంలో ఎస్ ఎస్ ఎం బి 29(SSMB -29)అనే వర్కింగ్ టైటిల్ తో సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా ఆఫ్రికన్ అడవులలో అడ్వెంచరస్ మూవీ గా తెరకెక్కబోతోందని తెలిసి అభిమానులు సైతం చాలా ఎక్సైట్ గా ఎదురు చూస్తున్నారు. ఇకపోతే మహేష్ బాబు సినిమాలలోనే కాదు పలు వ్యాపారాలలో పెట్టుబడులు పెడుతూ భారీగా ఆర్జిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే టీవీ యాడ్స్ తో పాటు పలు రంగాలలో పెట్టుబడులు పెట్టిన ఈయన.. ఇప్పుడు మరో వ్యాపార రంగంలోకి అడుగు పెట్టారు. కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో సోలార్ బిజినెస్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న విషయం తెలిసిందే.
సోలార్ బిజినెస్ లో పెట్టుబడులు పెట్టిన సూపర్ స్టార్..
ప్రజలు కూడా ఈ బిజినెస్ వైపు అడుగులు వేయాలని సూచిస్తోంది. ఈ క్రమంలోనే మహేష్ బాబు సోలార్ ఎనర్జీ బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నారని విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. ఇందుకోసం ఆయన ట్రూజన్ సోలార్ (TruZon Solar)(సన్ టెక్ లిమిటెడ్) తో కలిసి సౌర శక్తి వ్యాపార రంగంలో ఇన్వెస్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ దిశగా అడుగులు వేయడానికి ఇప్పటికే చర్చలు కూడా ముగిశాయని, మహేష్ బాబు ఈ బిజినెస్ కోసం భారీ మొత్తంలో పెట్టుబడులు పెడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు ట్రూజన్ సోలార్ కంపెనీకి చెందిన యాడ్ షూటింగ్ కూడా మహేష్ బాబు తాజాగా పూర్తి చేశారట. ఈ లెక్కన చూసుకుంటే మహేష్ బాబు పెట్టుబడులు పెడుతున్నారనే మాట నిజమేనని, ఇండస్ట్రీలో ఇప్పుడు కొత్త చర్చ జరుగుతోంది.త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనందట.
బిజినెస్ రంగంలో దూసుకుపోతున్న మహేష్ బాబు..
ఇకపోతే మహేష్ బాబు బిజినెస్ విషయానికి వస్తే.. ఇప్పటికే ఏఎంబి సినిమాస్ లో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ఆసియన్ సునీల్ తో కలిసి మహేష్ బాబు పార్ట్నర్ గా కొనసాగుతూ ఉండగా.. అలాగే హైదరాబాదులోని కొండాపూర్ లో శరత్ సిటీ క్యాపిటల్ మాల్ లో కూడా పెట్టుబడులు పెట్టారు. వీటితోపాటు హైదరాబాదులో మరో ఏరియాలో ఏ ఎం బి మాల్ ను నిర్మించబోతున్నారు. ఈ మాల్స్ ను బెంగళూరు, వైజాగ్ లో ఒక్కొక్కటి నిర్మిస్తున్నారు. వీటికి తోడు జిఎంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ కూడా స్థాపించి.. శ్రీమంతుడు సినిమాను నిర్మించారు.