Kanguva Collections : తమిళ స్టార్ హీరో సూర్య లేటెస్ట్ గా నటించిన పిరియాడికల్ మూవీ ‘ కంగువ ‘.. ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దాంతో ఈ మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సినిమా కోసం తమిళ ప్రేక్షకులతో పాటుగా తెలుగులో కూడా క్రేజ్ ఏర్పడింది. దాంతో సినిమా థియేటర్లలోకి వచ్చేవరకు భారీ బజ్ ను క్రియేట్ చేసుకుంది. నవంబర్ 14 న ఈ సినిమా భారీ అంచనాలతో థియేటర్లలో కి వచ్చేసింది. రిలీజ్ కు ముందు ఉన్న టాక్ రిలీజ్ అయ్యాక లేదని చెప్పాలి. సినిమా కథ పెద్దగా ఆకట్టుకోలేదు. దాంతో సినిమా టాక్ తో పాటుగా కలెక్షన్స్ పై భారీ ఎఫెక్ట్ పడింది. ఇక వీకెండ్ కూడా ఈ మూవీకి కలిసి రాలేదని తెలుస్తుంది. ఇక మూడు రోజులకు ఎంత కలెక్షన్స్ ను రాబట్టిందో ఇప్పుడు తెలుసుకుందాం..
డైరెక్టర్ శివ దర్శకత్వం వహించగా, ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై ప్రముఖ నిర్మాతలు కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్‌లు సంయుక్తంగా కంగువాను నిర్మించారు. క్రీస్తు శకం 1000 నుంచి 1100 శతాబ్ధాల మధ్య జరిగిన కొన్ని ఘటనల ఆధారంగా పీరియాడికల్ మూవీగా రూపొందించారు. ఈ సినిమాను దేశ విదేశాల్లో మునుపెన్నడూ చూడని అద్బుతమైన లోకేషన్లలో తెరకెక్కించారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ బాబీ డియోల్ ప్రతి నాయకుడుగా కనిపించారు. దిశా పటానీ సహా టాప్ టెక్నిషియన్స్ కంగువా కోసం పనిచేశారు. దాంతో ఈ మూవీ బడ్జెట్ 350 కోట్ల రూపాయలుతో సినిమాను తెరకేక్కించారు. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ కోసం మరో రూ. 50 కోట్లు అదనంగా ఖర్చు చేసినట్లు తెలుస్తుంది. టోటల్ గా ఈ మూవీకి 400 కోట్ల వరకు ఖర్చు చేసారని టాక్..
ఈ మూవీ కలెక్షన్స్ విషయానికొస్తే.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6000 స్క్రీన్ల లో రిలీజ్ చేశారు. కంగువా రెండ్రోజుల్లో రూ.60 కోట్లకు పైగా గ్రాస్‌ను రూ. 30 కోట్ల షేర్‌ను రాబట్టింది. తమిళనాడులో రూ. 18 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ. 9 కోట్లు, కర్ణాటక లో రూ. 3 కోట్లు, కేరళలో రూ. 4.65 కోట్లు, హిందీ లో ఇండియాల లో రూ. 10 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 16 కోట్ల చొప్పున కలెక్షన్స్ సాధించింది. మొత్తంగా చూసుకుంటే మూడు రోజులకు గాను రూ. 89.9 కోట్లు వసూల్ చేసిందని కంగువ టీమ్ అధికారికంగా ప్రకటించింది. వీకెండ్ సినిమా కలెక్షన్స్ భారీగా పెరుగుతాయని అనుకున్నారు కానీ దెబ్బేసింది. కలెక్షన్స్ స్లోగా ఉన్నాయి. ఇక ఈరోజు పెరిగే అవకాశాలు ఉన్నాయి.. ఏది ఏమైనా ఈ మూవీకి కలెక్షన్స్ భారీగా తగ్గడం పై సూర్య ఫ్యాన్స్ తెగ ఫీల్ అవుతున్నారు. ఈ మూవీ కలెక్షన్స్ తగ్గితే మాత్రం మూడో వారంలోనే ఓటీటీ లోకి రాబోతుందని సమాచారం.. భారీ ధరకు ఓటీటీ హక్కులను సొంతం చేసుకుంది. మరి అక్కడన్న మంచి టాక్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే..