BigTV English

Virat Kohli: ఏంట్రా మామ… విరాట్ కోహ్లీకి 12 వేళ్ళు ఉన్నాయా… షాక్ లో ఫ్యాన్స్

Virat Kohli: ఏంట్రా మామ… విరాట్ కోహ్లీకి 12 వేళ్ళు ఉన్నాయా… షాక్ లో ఫ్యాన్స్

Virat Kohli: టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఉన్నారన్న విషయం తెలిసిందే. ఇక కోహ్లీ కూడా మైదానంలో ఎంత దూకుడుగా ఉంటాడో.. బయట కూడా అంతే సరదాగా కనిపిస్తాడు. బ్యాట్ తో గ్రౌండ్ లోకి దిగితే ఆగ్రేషన్ మోడ్ లోకి వెళ్లిపోయే కోహ్లీ.. ఫీల్డింగ్ సమయంలో మాత్రం సహచర ఆటగాళ్లతో ఎంతో సరదాగా ఉంటాడు. ఇక డ్రెస్సింగ్ రూమ్ లోనూ జోక్స్ వేస్తూ అందరినీ నవ్విస్తుంటాడు.


 

తన చిలిపి పనులతో అభిమానులతో పాటు ఆటగాళ్లను కూడా నవ్విస్తాడు. మైదానంలో ప్లే అవుతున్న పాటలకు కాలు కదుపుతూ ప్రేక్షకులను ఉత్తేజపరుస్తాడు. సీనియర్లు, జూనియర్లు అనే తేడాలు లేకుండా అందరితో స్నేహం చేస్తుంటాడు. ఇమిటేషన్ లో మంచి ప్రావీణ్యం ఉన్న కింగ్ కోహ్లీ.. ఈ టాలెంట్ తో తోటి ప్లేయర్లను వెక్కిరిస్తూ ఉంటాడు. అలాగే ప్రత్యర్థి ఆటగాళ్లు రెచ్చగొడితే మాత్రం తనదైన శైలిలో బదులిస్తాడు. మరోవైపు అద్భుతంగా రాణించే యువ ఆటగాళ్లను ప్రోత్సహిస్తుంటాడు విరాట్ కోహ్లీ.


ఇలా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లో భాగంగా జరిగిన ఓ టెస్ట్ మ్యాచ్లో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి సెంచరీతో అద్భుత ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ చూసేందుకు నితీష్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులకు కూడా ఆస్ట్రేలియాకి వచ్చారు. మైదానంలో అతడి బ్యాటింగ్ చూసి సంతోషం వ్యక్తం చేశారు. ఇక మ్యాచ్ అనంతరం తన ఫ్యామిలీతో ఇతర ఆటగాళ్లను కలిశాడు నితీష్. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీని కూడా కలిసి వారి ఫ్యామిలీని పరిచయం చేశాడు.

ఈ సందర్భంగా నితీష్ కుమార్ రెడ్డి ఫ్యామిలీతో విరాట్ కోహ్లీ దిగిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటోలో విరాట్ కోహ్లీ కాళ్లకు ఆరు వేళ్లు ఉండడం చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. సాధారణంగా ప్రతి మనిషి కాళ్ళకి పది వేళ్లు ఉంటాయి. కానీ వైరల్ గా మారిన ఈ ఫోటోలో విరాట్ కోహ్లీ కాళ్లకు 12 వేళ్ళు ఉన్నాయి. ఇది చూసిన అభిమానులు షాక్ అవుతున్నారు. అయితే ఈ ఫోటోలో నిజం లేదు. కింగ్ తన వర్కౌట్ ఫోటోలను సోషల్ మీడియాలో చాలా సార్లు షేర్ చేశాడు.

 

ఆ ఫోటోలను గమనిస్తే కోహ్లీ కాళ్లకు ఐదువేలు ఉన్నట్లుగా క్లియర్ గా కనిపిస్తోంది. అయితే ఆరోజు జరిగిన మ్యాచ్ అనంతరం అప్పుడే షూస్ తీసి రావడం వల్లే 6 వెళ్ళు ఉన్నట్లుగా ఫోటోలో కనిపించింది. ఇక ప్రస్తుతం ఐపీఎల్ 2025 లో బిజీగా ఉన్నాడు విరాట్. ప్రతి సీజన్ లాగే ఈ సీజన్ లో కూడా కింగ్ బ్యాట్ నిప్పులు చెరుగుతుంది. కోహ్లీ ఈ సీజన్ లో ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్లలో 62 సగటుతో 143 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ తో 248 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. ఐపీఎల్ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో కోహ్లీ ఐదవ స్థానంలో ఉన్నాడు.

 

?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">

 

View this post on Instagram

 

?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noopener">A post shared by Rani Khan (@rani_khan6591)

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×