Shivalenka KrishnaPrasad : ఇక తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మంచి అభిరుచి ఉన్న నిర్మాత శ్రీదేవి మూవీస్ శివలెంక కృష్ణ ప్రసాద్. ఇదివరకే కృష్ణ ప్రసాద్, ఇంద్రగంటి మోహన్ కృష్ణ కాంబినేషన్లో రెండు సినిమాలు వచ్చాయి. నాని హీరోగా నటించిన జెంటిల్మెన్ సినిమాకి శివలెంక కృష్ణ ప్రసాద్ గారు నిర్మాతగా వ్యవహరించారు. ఆ తర్వాత మళ్లీ సుధీర్ బాబు నటించిన సమ్మోహనం సినిమాకి నిర్మాతగా వ్యవహరించారు శివలెంక కృష్ణ ప్రసాద్. ఇక ప్రస్తుతం వీరిద్దరూ కలిసి మరోసారి సారంగపాణి జాతకం అనే సినిమాకి పనిచేశారు. ఈ సినిమా ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. రీసెంట్ టైమ్స్ లో ప్రియదర్శి ఎంచుకొని కథలను చూస్తుంటే అందరికీ ఆశ్చర్యం కలుగుతుంది ప్రతి కథలలో కూడా ఒక విభిన్నం ఉంటుంది. ప్రియదర్శి ఒక సినిమా చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా మంచిగా ఉంటుంది అని ఒక నమ్మకం కూడా ఏర్పరచుకున్నాడు.ఈ సినిమా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రియదర్శి, రూపకొడువాయూర్,నరేష్ , తనికెళ్ళ భరణి ప్రధాన పాత్రల్లో నటించారు.
నేను అడ్జస్ట్ అవ్వలేకపోతున్నాను
రీసెంట్గా ఒక జర్నలిస్ట్ కృష్ణ ప్రసాద్ గారిని మీరు ఎప్పటి నుంచో సినిమాలు తీస్తున్నారు అప్పటికే ఇప్పటికీ మీరు నిర్మాణంలో వచ్చిన మార్పులు ఏమైనా గమనించారా అని అడిగారు. దీనికి సమాధానంగా.. కృష్ణ ప్రసాద్ ప్రస్తుత పరిస్థితుల్లో నేను అడ్జస్ట్ కాలేకపోతున్నాను. నేనే కాకుండా పెద్దపెద్ద ప్రొడ్యూసర్లు కూడా, కథ నమ్ముకుని రెండేళ్లకు ఒకసారి సినిమాలు తీసి మాలాంటి వాళ్లకి అది కొంచెం ఇబ్బందికరమైంది. కథను నమ్ముకుని మంచి సినిమా చేద్దాం ఒక తపన, నేను ఇంతకుముందు ఎన్నో సినిమాలు తీసినప్పటికీ, నేను మళ్ళీ ఒక సెకండ్ ఇన్నింగ్స్ అనుకుంటూ మొదలు పెట్టినప్పుడు జెంటిల్మెన్ సినిమా కానీ, సమ్మోహనం కానీ, యశోద కానీ అన్ని హిట్ సినిమాలు చేశాను. ప్రస్తుతం చేస్తున్న సారంగపాణి జాతకం సినిమా కూడా పూర్తిగా నమ్మి చేస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు. ఇది చాలా హిరి హిలేరియస్ కామెడీ, కుటుంబంతోపాటు అందరూ హాయిగా నవ్వుకొని సినిమా ఇది.
అందుకే పోస్ట్ పోన్ చేశాను
నాకు ఈ సినిమాకు సంబంధించి మంచి డేట్ దొరికింది. మీది మంచి సినిమా కదా ఎందుకు వెనక్కి తగ్గింది అని కొందరు అడిగినప్పుడు. దీంతోపాటు రెండు సినిమాలు ఉన్నాయి కదా నెక్స్ట్ వీక్ వెళ్దామని దీన్ని పోస్ట్ పోన్ చేశాను. నేను ఒకవేళ ఇండస్ట్రీలో పది సినిమాలు చేసే వాడినైతే మాట్లాడడానికి అర్హత ఉంటుంది. కానీ రెండేళ్లకు ఒకసారి సినిమా చేస్తాను కాబట్టి తప్పట్లేదు అంటూ కృష్ణ ప్రసాద్ చెప్పుకొచ్చారు. ప్రస్తుత కాలం మినహాయిస్తే ఒకప్పుడు ఆదిత్య 36,వంశానికొక్కడు, అనగనగా అమ్మాయి, భలేవాడివి బాసు వంటి ఎన్నో హిట్ సినిమాలు తీసిన ఘనత ఈయనకు ఉంది. ఆదిత్య 369 వంటి సినిమాని ఆ రోజుల్లో నమ్మి డబ్బులు పెట్టడం అనేది మామూలు విషయం కాదు. ఇక ఏప్రిల్ 25న విడుదల కాబోయే సారంగపాణి జాతకం ఏ మేరకు హిట్ అవుతుందో వేచి చూడాలి.
Also Read : Indraganti Mohan Krishna : అనవసరంగా నవ్వి ఇరుక్కున్నాను, వల్గర్ డ్యాన్స్ పై ఇంద్రగంటి మోహన్ కృష్ణ రియాక్షన్