BigTV English

Mother Elope Daughter Fiance: కాబోయే అల్లుడితో పారిపోయిన అత్త.. పోలీసులకు ఏం ఫిర్యాదు చేసిందంటే..

Mother Elope Daughter Fiance: కాబోయే అల్లుడితో పారిపోయిన అత్త.. పోలీసులకు ఏం ఫిర్యాదు చేసిందంటే..

Mother Elope Daughter Fiance| ఒక మహిళ తన కూతురి కోసం పెళ్లి ఏర్పాట్లు చేస్తూ కాబోయే అల్లుడితో స్నేహం చేసింది. అతను ముందు గౌరవంగా మాట్లాడినా ఆ తరువాత అది అప్యాయతగా, ప్రేమగా మారింది. దీంతో ఆమె తన సమస్యలను అతనితో చెప్పుకుంటూ చివరికి అతనితో కలిసి జీవిస్తానని నిర్ణయించుకుంది. అందుకే ఇద్దరూ పెళ్లికి పది రోజుల ముందు పారిపోయారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలన సృష్టించింది.వారిద్దరూ కోసం పోలీసులు గాలించడం మొదలుపెట్టారు. ముఖ్యంగా ఆ మహిళ ఇంట్లో నుంచి లక్షల రూపాయల నగదు, బంగారం తీసుకొని పారిపోయందని ఆమె భర్త, కూతురు, బావ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వారిద్దరి కోసం వెతుకుతున్నారని తెలిసి నేపాల్ పారిపోయిన ఆ విచిత్ర ప్రేమికులు మళ్లీ తిరిగి ఇండియాకు వచ్చారు. పోలీసులకు రివర్స్ లో ఫిర్యాదు చేశారు.


వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్ లోని దాదోని ప్రాంతానికి చెందిన స్వప్న అనే 46 ఏళ్ల మహిళకు 25 ఏళ్ల క్రితం జీతేంద్ర అనే వ్యక్తితో వివాహం జరిగింది. వారిద్దరికీ శివాని అనే కూతరు పుట్టింది. అయితే జీతేంద్రది ఉమ్మడి కుటుంబం. అతను తన సోదరుల కుటుంబాలతో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నాడు. కానీ స్వప్నకు మాత్రం వేరే కాపురం ఉండాలని ఎప్పటి నుంచే తీరని కోరిక. ఈ క్రమంలో భార్యా భర్తల మధ్య తరుచూ గొడవలు జరిగేవి. జీతేంద్ర ఉద్యోగ రీత్యా బెంగుళూరులో ఉండేవాడు. అందుకే ఇంటి నుంచి దూరంగా ఉండేవాడు. స్వప్న భర్తకు దూరంగా ఉంటూ ఆమెకు కోరికలు తీరేవి కావు. కాలక్రమంలో వారిద్దరి కూతరు శివానికి పెళ్లి సంబంధం కుదిరింది. వరుడి పేరు రాహుల్ కుమార్.

రాహుల్ మంచి అందగాడు. రాహుల్ తనకు కాబోయే భార్య శివానితో మాట్లాడాలని తరుచూ ఫోన్ చేసేవాడు. కానీ శివానీ అతనితో ఎక్కువగా మాట్లాడేది కాదు. అయినా రాహుల్ మళ్లీ మళ్లీ కాల్ చేసేవాడు. దీంతో ఆ ఫోన్లన్నీ శివాని తల్లి స్వప్న రిసీవ్ చేసుకొని కాసేపు కాబోయే అల్లుడి గారితో మాట్లాడేది. అలా రాహుల్ తో ఆమెకు మంచి స్నేహం ఏర్పడింది. ప్రతిరోజు గంటల తరబడి రాహుల్ తో ఫోన్ లో మాట్లాడుతూనే ఉండేది. ఇది స్వప్న ఇంట్లో ఉన్న ఆమె బావకు, కూతురు విచిత్రంగా అనిపించేంది. మరి కొన్ని రోజుల్లో శివాని పెళ్లి జరుగనుండడంతో స్వప్న భర్త జీతేంద్ర కూతురి పెళ్లికి ఏర్పాట్లు చూసుకునేందుకు బెంగుళూరు నుంచి వచ్చాడు.


రాగానే జీతేంద్రకు అతని భార్య గంటల తరబడి కాబోయే అల్లడు రాహుల్ తో మాట్లాడుతోందని తెలిసి ఆశ్చర్యం వేసింది. అలా చేయడం మర్యాద కాదని మందలించాడు కూడా. అయినా స్వప్న.. రాహుల్ పై ప్రేమను పెంచుకుంది. అందుకే భర్త మాటలను నిర్లక్ష్యం చేసి మళ్లీ రాహుల్ తో ఎక్కువ సేపు మాట్లాడేది. దీంతో జీతేంద్ర, తన భార్యపై కోపడ్డాడు. దీంతో ఆమె ఏడుస్తూ రాహుల్ కు ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పింది. దీంతో రాహుల్ ఆమెను శాంతపరిచి విషయం తెలుసుకున్నాడు. ఆ తరువాత ఆమె రాహుల్ ను ఊరి చివర నిర్మానుష ప్రాంతంలో కలుద్దామని పిలిచింది. అక్కడ అతడితో కలిసి తాను లేకుండా జీవించలేనని తన భర్త తనను తాగి కొట్టాడని.. అలాంటి భర్త తనకు వద్దని చెప్పి కన్నీరు పెట్టుకుంది. కాబోయే అత్త నోటి నుంచి అలాంటి మాటలు విన్న రాహుల్ ఆమె భావోద్వేగం చూసి అమె చెప్పినట్లు చేశాడు.

అంతే స్వప్న ఇంటికెళ్లి అన్నీ ఏర్పాట్లు చేసుకొని రాహుల్ కు ఫోన్ చేసి పిలిచింది. ఇద్దరూ అలా ఇంటి నుంచి పారిపోయారు. ఇద్దరి ఫోన్లు స్విచాఫ్ అయిపోయాయి. ఆ తరువాత ఇద్దరి కుటుంబ సభ్యులు ఒకరోజు వారి కోసం వెతికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్వప్న తనతో రూ.3.5 లక్షలు నగదు, రూ.5 లక్షలు విలువ చేసే బంగారం తీసుకెళ్లిందని ఆమె భర్త పోలీసులకు తెలిపాడు. మరోవైపు రాహుల్ , స్వప్న దేశం విడిచి నేపాల్ వెళుతుండగా పోలీసులు వారి కోసం వెతకడం ప్రారంభించారు. కానీ ఇద్దరి ఫోన్లు స్విచాఫ్ అయ్యాయి. అయితే రాహుల్ రెండు రోజుల క్రితం తన మొబైల్ ఫోన్ ఆన్ చేయగా.. పోలీసులు ట్రాక్ చేసి వారిని పట్టుకున్నారు.

Also Read: భార్య హత్య కేసులో భర్తకు శిక్ష.. 20 ఏళ్ల క్రితం జైలు నుంచి తప్పించుకొని మరో పెళ్లి..

అయితే ఇప్పుడు స్వప్న తిరిగి తన భర్త, బావపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను ఎటువంటి నగదు, బంగారం తీసుకెళ్లలేదని.. తన భర్త తనను తాగి వచ్చి కొడుతున్నాడని.. అందుకే రాహుల్ తో వెళ్లిపోయానని ఇక అతడితో పెళ్లి చేసుకొని జీవిస్తానని చెప్పేసింది. తన భర్త, బావపై గృహ హింస కేసు పెట్టాలని తెలిపింది. అయితే పోలీసులు మాత్రం నిజనిర్ధారణ కోసం పూర్తి స్థాయిలో విచారణ చేశాక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

మరోవైపు స్వప్న భర్త, రాహుల్ తండ్రి ఇద్దరూ కూడా వారివురినీ తమ కుటుంబాల్లోకి రానిచ్చేది లేదని తెలిపారు. స్వప్న భర్త మాత్రం మరీ కచ్చితంగా ఆమె తీసుకెళ్లిన బంగారం, నగదు తిరిగిచ్చేయాలని అన్నాడు.

Related News

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

MP News: పట్టించుకోని వాహనదారులు.. పెట్రోల్ కష్టాలు రెట్టింపు, ఏం జరిగింది?

Tariff War: 50శాతం సుంకాలపై భారత్ ఆగ్రహం.. అమెరికాను మనం నిలువరించగలమా?

Big Stories

×