Vaibhava Suryavanshi : అత్యంత పిన్న వయస్కుడిగా ఐపీఎల్ 2025 సీజన్ లో రికార్డులు సృష్టించాడు. ఇటీవల ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ పై 35 బంతుల్లోనే సెంచరీ చేసిన తొలి భారతీయుడిగా తన పేరును లిఖించుకున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా రెండో బ్యాటర్ గా నిలిచాడు. రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ సంచలన ప్రదర్శనతో క్రికెట్ ప్రపంచాన్ని అబ్బురపరిచాడు. కేవలం 14 ఏళ్ల వయసులో గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్‌లో అతను చేసిన శతకం ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది. ముఖ్యంగా తన శతకంలో అతను బౌండరీల ద్వారా సాధించిన పరుగుల శాతం ప్రపంచంలోనే అత్యధికంగా నిలిచి..,58 మంది సెంచరీ హీరోల జాబితాలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. తన శతకంలో 93% పరుగులు బౌండరీల ద్వారానే సాధించాడు. ఇది ఐపీఎల్ చరిత్రలో ఏ బ్యాట్స్‌మెన్ సెంచరీలోనైనా బౌండరీల ద్వారా సాధించిన అత్యధిక పరుగుల శాతంగా మారింది. ఇదిలా ఉంటే.. వైభవ్ సూర్య వంశీ గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది.
Also Read : World’s Greatest Drunk : వీడు మనిషా.. మృగమా.. ఒక సిట్టింగ్ లోనే 156 బీర్లు తాగేస్తాడు!
ఈ పద్నాలుగేళ్ల యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ అంటే బాలీవుడ్ హీరోయిన్ సోనాల్ చౌహన్ కి బాగా ఇష్టమట. అతని బ్యాటింగ్ ని చూసిన ఈమె పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు ఐపీఎల్ లో రెండో వేగవంతమైన సెంచరీ చేశాడు వైభవ్.. మొదటి స్థానంలో క్రిస్ గేల్ 30 బంతుల్లో సెంచరీ చేయగా.. 35 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ సెంచరీ చేసి ఐపీఎల్ చరిత్రలో రెండో వేగవంతమైన శతకాన్ని నమోదు చేసాడు. ఐపీఎల్ లో అత్యంత పిన్న వయస్కుడైన సెంచరీ సాధించి హీరోగా నిలిచాడు. ఒక ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారతీయ బ్యాటర్లలో వైభవ్ సూర్యవంశీ ఒకడిగా నిలిచాడు. 11 సిక్సర్లతో మురళీ విజయ్ రికార్డులను సమానం చేసాడు. ఇక రాజస్థాన్ రాయల్స్ తరపున తన తోటి క్రికెటర్ యశస్వి జైశ్వాల్ తో కలిసి తొలి వికెట్ కి 166 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. వైభవ్.. రాజస్థాన్ రాయల్స్ తరపున అత్యధిక భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు.
ఈ యువ ఆటగాడు తన తొలి ఐపీఎల్ సీజన్ లోనే స్టార్ బౌలర్ల బౌలింగ్ లో సిక్సర్లను బాదాడు. దీంతో వైభవ్ కి ప్రత్యేక బహుమతి కూడా లభించింది. ఐపీఎల్ 2025 సీజన్ లో అత్యంత వేగంగా బ్యాటింగ్ చేస్తూ వైభవ్ సూర్యవంశీ 7 మ్యాచ్ లలో 252 పరుగులు చేసాడు. ఇందులో తన మెరుపు ఇన్నింగ్స్ ఆడి.. ఓ సెంచరీ కూడా సాధించాడు. ఈ సమయంలో వైభవ్ స్ట్రైక్ రేట్ 206.55 గా ఉంది. ఈ సీజన్ లో సూర్యవంశీ 122 బంతులు ఎదుర్కొని 24 సిక్సర్లు, 18 ఫోర్లు బాదాడు. దీంతో అతనికి స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్ అవార్డు లభించింది. ఈ అవార్డుతో పాటు వైభవ్ సూర్యవంశీ కి బహుమతి గా టాటా కర్వ్ కారు కూడా లభించింది. వైభవ్ ఈ కారును స్వయంగా మాత్రం నడపలేడు. భారతదేశంలో వైభవ్ సూర్యవంశీ కారు అధికారికంగా నడపాలంటే మాత్రం అతనికి 18 సంవత్సరాల వయస్సు ఉండాలి.
https://www.facebook.com/share/p/1FuXMqR21k/