BigTV English
Advertisement

ICC 2-Ball Rule: క్రికెట్‌లో కొత్త రూల్స్… ఇక ప్లేయర్స్ చుక్కలు చూడాల్సిందే

ICC 2-Ball Rule: క్రికెట్‌లో కొత్త రూల్స్… ఇక ప్లేయర్స్ చుక్కలు చూడాల్సిందే

ICC 2-Ball Rule: కాలానుగుణంగా క్రికెట్ లో  ( Cricket )మార్పులకు శ్రీకారం చుడుతు, అవసరానికి తగ్గట్లు కొత్త నిబంధనలు తీసుకువస్తుంది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్( International Cricket Council ) . ఆటలో మజాను మరింత పెంచేందుకు, బంతి – బ్యాట్ కు మధ్య పోరును రసవత్తరంగా మార్చేందుకు ఈ నిబంధనలు ఉపయోగపడుతున్నాయి. అయితే తాజాగా వన్డే, టీ-20 తో పాటు టెస్ట్ ఫార్మాట్ లో కీలక మార్పులు చేసేందుకు సిద్ధమయ్యింది ఐసీసీ. జై షా నేతృత్వంలోని అంతర్జాతీయ క్రికెట్ మండలి మూడు ఫార్మాట్లలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టినట్లు సమాచారం.


 

వన్డేల్లో రెండు బంతుల విధానం రద్దు చేయడంతో పాటు.. అండర్-19 స్థాయిలో పురుషుల విభాగంలోనూ ప్రపంచకప్ నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే టెస్టుల్లో స్లో ఓవర్ రేటును లెక్కించేందుకు టైమర్ ని ప్రవేశపెట్టే దిశగా ఐసిసి అడుగులు వేస్తోంది. ప్రస్తుతం జింబాబ్వేలో జరుగుతున్న భేటీలో జై షా నేతృత్వంలోని ఐసిసి మార్పులపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 10వ తేదీన ప్రారంభమైన ఈ భేటీ.. ఏప్రిల్ 13వ తేదీ వరకు కొనసాగుతుంది. అనంతరం ఈ మూడు అంశాలపై ఐసీసీ ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.


 

వన్డేల్లో ప్రస్తుతం రెండు బంతుల విధానం కొనసాగుతుంది. ఈ రెండు బంతుల విధానాన్ని 2011లో తీసుకువచ్చారు. బౌలింగ్ కోసం ప్రతి జట్టు కొత్త బంతిని ఉపయోగిస్తుంది. అలా కొత్త బంతి మెరుస్తూ ఉండడం వల్ల పేసర్లు స్వింగ్ ని రాబట్టలేకపోతున్నారు. ఇక 25 ఓవర్ల తర్వాత మళ్లీ కొత్త బంతిని తీసుకునే అవకాశం ఉంది. ఈ కారణంగా బ్యాటర్లకు లబ్ధి చేకూరితుంది. ఈ నేపథ్యంలో బౌలర్లకు కూడా అనుకూలంగా ఉండేలా ఈ రెండు బంతుల నిబంధనను రద్దు చేయాలని ఐసిసి నిర్ణయించింది. ఇక టెస్ట్ లలో టైమర్ ని ప్రవేశపెట్టాలని ఐసిసి ఆలోచన. స్లో ఓవర్ రేట్ కారణంగా ఐపీఎల్ లో ( indian premier league 2025 ) పలువురు కెప్టెన్లు భారీగా జరిమానా చెల్లిస్తున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. దీనివల్ల బీసీసీఐకి పెద్ద మొత్తంలో డబ్బులు వస్తున్నాయి. ఇదే పద్ధతిని టెస్టుల్లోనూ ప్రవేశపెట్టాలని ఐసీసీ ( International Cricket Council )  ఆలోచిస్తోంది.

ఈ నిబంధన ప్రకారం ఒక ఓవర్ పూర్తయిన నిమిషంలోనే మరో ఓవర్ తొలి బంతి  ( Ball )వేయాల్సి ఉంటుంది. టెస్టుల్లో మొత్తంగా ఒక రోజు 90 ఓవర్లు వేయాలి. దీనిని పక్కాగా అమలు చేసేందుకు టైమర్ నిర్ణయం సరైందేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక మరోది ప్రస్తుతం టీ-20 లకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో.. వన్డేల లాగా అండర్-19 ప్రపంచకప్ ప్రవేశపెట్టాలని ఐసిసి ( International Cricket Council )  ఆలోచిస్తుంది. ఇప్పటివరకు రెండు సార్లు అండర్ 19 మహిళల టి-20 ప్రపంచ కప్ జరిగింది. తొలి రెండు సీజన్లలో భారత జట్టు ఈ ట్రోఫీని గెలుచుకుంది. ఈ నేపథ్యంలో పురుషుల విభాగంలో కూడా అండర్-19 ప్రపంచ కప్ ని ప్రవేశపెట్టాలని ఐసిసి ( International Cricket Council )  భావిస్తుంది.

Tags

Related News

Anushka-Kohli: కోహ్లీ – అనుష్క శర్మ విడాకులు ?సోష‌ల్ మీడియాలో దారుణంగా పోస్టులు

WPL Retention 2026 : రిటైన్ లిస్టు ఇదే..WPL 2026 టోర్న‌మెంట్ షెడ్యూల్ ఇదే..!

IND VS AUS 4th T20I : వాషి యో వాషి..3 వికెట్లు తీసిన వాషింగ్ట‌న్‌, కంగారుల‌పై టీమిండియా విజ‌యం

Kajal Aggarwal: టీమిండియా మ్యాచ్ కు కాజ‌ల్‌..భ‌ర్త‌ను హ‌గ్ చేసుకుని మ‌రీ, ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే

Tata Motors: వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచిన టీమిండియా ప్లేయ‌ర్ల‌కు టాటా బంప‌ర్ ఆఫ‌ర్‌

PV Sindhu: బోల్డ్ అందాలతో రెచ్చిపోయిన PV సింధు.. వెకేషన్ లో భర్తతో రొమాన్స్

IND VS AUS, 4th T20I: టాస్ ఓడిన టీమిండియా..మ్యాక్స్‌వెల్ తో పాటు 4 గురు కొత్త‌ ప్లేయ‌ర్లు వ‌చ్చేస్తున్నారు

Harleen Deol: మోడీ సార్‌.. ఎందుకు ఇంత హ్యాండ్స‌మ్ గా ఉంటారు? హర్లీన్ డియోల్ ఫ‌న్నీ క్వ‌శ్చ‌న్‌

Big Stories

×