Jr ntr : తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో ఉన్న కొంతమంది సెలబ్రిటీల అన్ని కుటుంబాలలో కూడా రాజకీయాలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. అందుకనే చాలామంది బయటకు చెప్పకపోయినా కూడా వాళ్లలో వాళ్లకే కొన్ని బేధా అభిప్రాయాలు ఉంటాయి. మెగాస్టార్ చిరంజీవి అప్పట్లో ప్రజారాజ్యం అనే పార్టీని పెట్టి దాదాపు పదేళ్లుపాటు సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. వాస్తవానికి మెగాస్టార్ చిరంజీవికి రాజకీయాల్లో మంచి ఆదరణ లభించింది. కానీ ఆయన దానిని నిలబెట్టుకోలేక విలీనం చేసేసారు అని విమర్శలు ఇప్పటికీ వస్తూ ఉంటాయి. అలానే మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం తరపున విపరీతంగా ప్రచారం చేస్తున్న తరుణంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశారు. కొన్నిచోట్ల ఎన్టీఆర్ ఇచ్చిన స్పీచ్ ఇప్పటికీ ప్రత్యేకమని చెబుతూ ఉండాలి. అప్పట్లో ఆయన మాట్లాడిన తీరు చాలామందిని విపరీతంగా ఆకట్టుకుంది.
రాజకీయాలకు దూరం
ఇక ఎన్టీఆర్ కూడా అప్పట్లో తాను ప్రచారం చేసిన తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తరువాత రాజకీయాలకి దూరమైపోయారు. కొంతమంది కొన్ని విమర్శలు చేసినా కూడా వాటిపై తనదైన శైలిలో ప్రత్యేకంగా ప్రతిస్పందించే వాళ్ళు. దాదాపు తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది అనుకునే తరుణంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలవడం వలన మళ్లీ కూటమి ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్లో నిర్మించగలిగారు. ఇక తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎన్టీఆర్కి పూర్తి హక్కులు ఉన్నాయి అని కొంతమంది నందమూరి అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు. ఇక రీసెంట్ టైమ్స్ లో ఎన్టీఆర్ ఏ ఫంక్షన్ లో కనిపించినా కూడా సీఎం అంటూ అరవడం మొదలుపెట్టారు. మ్యాడ్ స్క్వేర్ ఈవెంట్ లో కూడా ఇలానే కొంతమంది అభిమానులు సీఎం సీఎం అంటూ అరవడం మొదలుపెట్టారు.
Also Read : Arjun S/o Vyjayanthi Movie Pre release event : నన్ను గారు అని పిలవద్దు అమ్మ – ఎన్టీఆర్
అరవడం ఆపండి
కళ్యాణ్ రామ్, విజయశాంతి కలిసి నటిస్తున్న సినిమా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. ఈ సినిమా ఈవెంట్ కి ఎన్టీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సినిమా ఈవెంట్లో విజయశాంతి మాట్లాడుతున్న తరుణంలో కొంతమంది ఎన్టీఆర్ అభిమానులు సీఎం అని అరవడం మొదలుపెట్టారు. అయితే అది విన్న ఎన్టీఆర్ అరవడం ఆపండి అని తన అభిమానులకు సైగ చేశారు. అయినా ఆపకపోవడంతో దిగి వెళ్ళిపోతాను అని బెదిరించడంతో ఎన్టీఆర్ అభిమానులు అరవడం ఆపేశారు. ఆ తర్వాత విజయశాంతి మాట్లాడడం మొదలుపెట్టారు. ఇలా అరవడంపై ఎన్టీఆర్ ఎప్పుడైనా ఒక పొలిటికల్ క్లారిటీ ఇస్తారేమో ఎదురు చూడాల్సి ఉంది.అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా ఏప్రిల్ 18న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా మీద కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ట్రైలర్ కూడా చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. విజయశాంతి తో పాటు ఈ సినిమాలో శ్రీకాంత్ ఒక కీలక పాత్రలో కనిపిస్తున్నారు.
Also Read : Jr Ntr: ఎండలో మిమ్మల్ని కష్టపెట్టడం ఇష్టం లేదు, త్వరలోనే మిమ్మల్ని కలుసుకుంటాను