E-Paper
Advertisement

రెండో వ‌న్డేలోనూ కివీస్ ఓట‌మి…మ‌ళ్లీ వ‌ర్ష‌మే టీమిండియాను కాపాడిందంటూ త‌న్వీర్ సంచ‌ల‌నం!

రెండో వ‌న్డేలోనూ కివీస్ ఓట‌మి…మ‌ళ్లీ వ‌ర్ష‌మే టీమిండియాను కాపాడిందంటూ త‌న్వీర్ సంచ‌ల‌నం!
Advertisement

Tanveer Ahmed On IND VS NZ: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ ( New Zealand vs India, 2nd ODI) మధ్య వెల్లింగ్ట‌న్ వేదిక‌గా ( Hnry Stadium, Wellington) జ‌రిగిన రెండవ వన్డేలో గిల్ సేన సూపర్ విక్టరీ అందుకుంది. అయితే దీనిపై పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ (Tanveer Ahmed ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. తాను చెప్పినట్టుగానే వర్షం పడి టీమిండియానే గెలిచిందని బాంబు పేల్చాడు. ప్రతిసారి టీమిండియాకు వరుణ దేవుడు అండగా ఉంటున్నాడని.. లేకపోతే ఘోరంగా ఓడిపోయేదని హేళ‌న‌ చేశాడు.

రెండో వ‌న్డేలోనూ కివీస్ ఓట‌మి…మ‌ళ్లీ వ‌ర్ష‌మే టీమిండియాను కాపాడిందంటూ త‌న్వీర్ సంచ‌ల‌నం!

వర్షం పడి ముందుగా న్యూజిలాండ్ బ్యాటింగ్ చేయడం టీమ్ ఇండియాకు అనుకూలించిందని… ఈ క్రమంలో సులభంగా విజయం అందినట్టు తెలిపాడు. వర్షం పడ్డ నేపథ్యంలోనే మ్యాచ్ ను 47 ఓవర్లకు కుదించి.. టీమిండియాకు అంపైర్లు గ్రీన్ మ్యాట్ వేశారని బాంబు పేల్చాడు. లేకపోతే ఈ మ్యాచ్ లో టీమిండియా గెలిచేది కాదని వ్యాఖ్యానించాడు. అదృష్టం ప్రతిసారి టీమిండియా వైపు ఉండదని.. కచ్చితంగా గిల్ సేన త్వరలోనే బొక్క బోర్లా పడుతుందని వార్నింగ్ ఇచ్చాడు. దీంతో త‌న్వీర్ అహ్మ‌ద్ చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి.

Advertisement

Harbhajan Singh Reaction On Ricky Ponting smashes World Cup-winning ton vs India: 2003 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాంటింగ్ ను క్లీన్ బౌల్డ్ చేసేవాడిని…కానీ గంగూలే ప్లాన్ చెడ‌దొబ్బాడు

135 పరుగుల టార్గెట్ ఛేదించలేరా ? పరువు తీసిన తన్వీర్ అహ్మద్

వెల్లింగ్టన్ వేదికగా జరిగిన రెండో వన్డేలో 135 పరుగల లక్ష్యాన్ని అతి కష్టం మీద టీమిండియా గెలిచిందని తన్వీర్ అహ్మద్ పరువు తీశాడు. విరాట్ కోహ్లీ వికెట్ పడగానే టీమిండియా మిగతా బ్యాటర్లు చేతులెత్తేశారంటూ హేళన చేశాడు. టీ20లలో అభిషేక్ శర్మ, సంజు శాంసన్ ఆడితేనే టీమిండియా గెలుస్తోందని, వన్డేల్లో కేవలం విరాట్ కోహ్లీ ఒక్కడే ఆడితేనే విక్టరీ కొడుతున్నట్టు పేర్కొన్నాడు. ఈ ముగ్గురే లేకపోతే టీమిండియా ప్రతీ మ్యాచ్ ఓడిపోతుందని పరువు తీశాడు.

న్యూజిలాండ్ పై 4 పరుగుల తేడాతో టీమిండియా విజయం

Advertisement

రెండో వన్డేలో న్యూజిలాండ్ పై డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి ప్రకారం 4 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. చేజింగ్ సమయంలో 26 ఓవర్లు ఆడిన టీమిండియా 7 వికెట్ల నష్టానికి 113 పరుగులు సాధించింది. ఈ తరుణంలోనే మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించింది. ఈ సమయంలో విజయానికి మరో 22 పరుగులు ఉండటంతో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి ప్రకారం 4 పరుగుల తేడాతో టీమిండియాను విజేతగా అంపైర్లు ప్రకటించారు. అంతకుముందు ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 41 ఓవర్లు ఆడింది. ఈ క్రమంలో కేవలం 134 పరుగులు చేసి కుప్పకూలింది. డారిల్ మిచెల్ ఒక్కడే అర్థ సెంచ‌రీతో (55) మెరిశాడు. అటు 31 పరుగులతో మిచెల్ శాంట్న‌ర్ పోరాడే ప్రయత్నం చేశాడు. కానీ గుర్నూర్ బ్రార్ నాలుగు వికెట్లతో విరుచుకుపోవడంతో న్యూజిలాండ్ తక్కువ పరుగులకే కుప్పకూలింది.

Pakistan Team Former Captain Shahid Afridi Shocking Comments On Abhishek Sharma Goes Viral  నా కంటే అభిషేక్ భయంకరంగా ఆడుతున్నారు..ప్రతీ సిక్సర్ స్టేడియం బయటే పడుతోంది

 

 

 

Related News

ఐపీఎల్ కాంట్రాక్టు కోసం న్యూజిలాండ్ క్రికెట్ ను మిచెల్ శాంట్న‌ర్ అమ్మేశాడు

ఏంటీ 40 కోట్లు కావాలా? ఒక‌సారి మీ ముఖాల‌ను అందంలో చూసుకోండి..మంజ్రేక‌ర్ ఫైర్

కోహ్లీ ఉంటే ఆ కిక్కే వేరప్పా…రాహుల్ ను త‌న కొడుకు ‘అకాయ్’లా రెడీ చేస్తున్నాడు

డారిల్ మిచెల్ క్యాచ్ మిస్ చేసిన గిల్…ప‌చ్చి బూతులు తిట్టిన కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌!

ఒక్కసారి కాదు 100 సార్లు బాల్ టాంప‌రింగ్ చేశాం..శాండ్ పేప‌ర్ వివాదంపై ఉస్మాన్ ఖవాజా సంచ‌ల‌నం!

వీరూ భాయ్… నీ కొడుకు ఆర్యవీర్ సెహ్వాగ్‌ను పాకిస్తాన్‌కు పంపిచు!

మహ్మద్ షమీ రిటైర్మెంట్..సరిగ్గా 13 ఏళ్ల కిందట ఆరంభం, ఇప్పుడు ముగింపు

Big Stories

Advertisement
×