E-Paper
Advertisement

2007 వ‌ర‌ల్డ్ క‌ప్ త‌ర‌హాలోనే గ్రూప్ స్టేజ్ లోనే టీమిండియాను ఇంటికి త‌రిమేస్తాం!

2007 వ‌ర‌ల్డ్ క‌ప్ త‌ర‌హాలోనే గ్రూప్ స్టేజ్ లోనే టీమిండియాను ఇంటికి త‌రిమేస్తాం!
Advertisement

Tanveer Ahmed On Team India:  2027 వన్డే వరల్డ్ కప్ టోర్నమెంట్ కు (2027 ODI World Cup tournament) సరిగ్గా ఏడాది సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ఈ టోర్నమెంట్ కోసం అన్ని జట్లు ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నాయి. ఏడాది పొడుగునా వన్డేలు ఆడేలా ప్లాన్ చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో 2027 వన్డే వరల్డ్ కప్ లో సెమీ ఫైనల్ చేరే జట్లను పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మ‌ద్ అంచనా వేశాడు. బంగ్లాదేశ్‌, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, ద‌క్షిణాఫ్రికా సెమీస్ కు చేరుతాయని వివరించాడు. కానీ టీమిండియా మాత్రం గ్రూప్ స్టేజ్ లోనే ఇంటి దారి పడుతుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఫ్లాట్ మైదానాలపై మాత్రమే ఆడే టీమ్ ఇండియా బ్యాటర్లు.. దక్షిణాఫ్రికా గడ్డపై విఫలమై 2007 తరహాలో ఇంటిదారి ప‌డతారని వార్నింగ్ ఇచ్చాడు.

టీమిండియాలో చిత్తుచిత్తుగా ఓడిస్తాం – తన్వీర్ అహ్మ‌ద్

2027 వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో టీమిండియా జ‌ట్టుకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మ‌ద్. 2027 వన్డే వరల్డ్ కప్ కచ్చితంగా కొడదాం అనుకుంటున్న టీం ఇండియా ఆశ‌ల‌పై నీళ్లు జ‌ల్లుతామ‌ని హాట్ కామెంట్స్ చేశాడు. దక్షిణాఫ్రికా మైదానాలు ఫాస్ట్ బౌలింగ్ తో పాటు బౌన్సర్లకు అనుకూలంగా ఉంటాయని వ్యాఖ్యానించాడు. అక్కడ ఫ్లాట్ మైదానాలు అస్సలు ఉండబోవు అని బాంబు పేల్చాడు.

Advertisement

Pakistan Team Former Captain Shahid Afridi Shocking Comments On Abhishek Sharma Goes Viral  నా కంటే అభిషేక్ భయంకరంగా ఆడుతున్నారు..ప్రతీ సిక్సర్ స్టేడియం బయటే పడుతోంది

ఇలాంటి నేపథ్యంలో దక్షిణాఫ్రికా మైదానాలను తట్టుకోవడం టీమిండియా బ్యాట‌ర్ల వ‌ల్ల కాదని కూడా బద్దలు కొట్టి చెప్పాడు. 2027 వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో పాకిస్తాన్, టీమిండియా మధ్య గ్రూప్ స్టేజ్ లో మ్యాచులు జరుగుతాయని.. అక్కడే వాళ్ళను దెబ్బ కొడతామని హెచ్చరించాడు. గతంలో లాగా పాకిస్తాన్ క్రికెట్ జట్టు బలహీనంగా లేదని.. కొత్త ఆటగాళ్లతో భయంకరంగా మారిందని వెల్లడించాడు. క‌చ్చితంగా టీమిండియా ఓడించి, 2007 తరహాలో ఇంటికి పంపిస్తామ‌ని హెచ్చ‌రించాడు.

2027 వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ ఇదే

Advertisement

2027 పురుషుల వన్డే వరల్డ్ కప్ (2027 odi world cup ) అక్టోబర్ రెండవ తేదీ నుంచి నవంబర్ 21వ తేదీ వరకు కొనసాగనుంది. దాదాపు రెండు నెలల పాటు కొనసాగానున్న ఈ మెగా టోర్నమెంట్ కు దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా ఆతిథ్యం ఇస్తున్నాయి. ఈ టోర్నమెంట్ లో మొత్తం 14 జట్లు పాల్గొంటాయి. ఈసారి గ్రూప్ స్టేజ్ మ్యాచ్ ల‌లో పాటు సూపర్ సెవెన్ యాడ్ చేస్తున్నారు. ఆ తర్వాత సెమీ ఫైనల్స్ ఫైనల్ ఉంటుంది. ఫైనల్ మ్యాచ్ నవంబర్ 21వ తేదీన వాండర‌ర్స్ స్టేడియం వేదికగా జరగనుంది.

Harbhajan Singh Reaction On Ricky Ponting smashes World Cup-winning ton vs India: 2003 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాంటింగ్ ను క్లీన్ బౌల్డ్ చేసేవాడిని…కానీ గంగూలే ప్లాన్ చెడ‌దొబ్బాడు

 

Related News

వెల్లింగ్ట‌న్ లో రోహిత్ శ‌ర్మ‌ కొట్టిన 23 ప‌రుగులు సెంచ‌రీతో స‌మానం

రెండో వ‌న్డేలోనూ కివీస్ ఓట‌మి…మ‌ళ్లీ వ‌ర్ష‌మే టీమిండియాను కాపాడిందంటూ త‌న్వీర్ సంచ‌ల‌నం!

ఐపీఎల్ కాంట్రాక్టు కోసం న్యూజిలాండ్ క్రికెట్ ను మిచెల్ శాంట్న‌ర్ అమ్మేశాడు

ఏంటీ 40 కోట్లు కావాలా? ఒక‌సారి మీ ముఖాల‌ను అందంలో చూసుకోండి..మంజ్రేక‌ర్ ఫైర్

కోహ్లీ ఉంటే ఆ కిక్కే వేరప్పా…రాహుల్ ను త‌న కొడుకు ‘అకాయ్’లా రెడీ చేస్తున్నాడు

డారిల్ మిచెల్ క్యాచ్ మిస్ చేసిన గిల్…ప‌చ్చి బూతులు తిట్టిన కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌!

ఒక్కసారి కాదు 100 సార్లు బాల్ టాంప‌రింగ్ చేశాం..శాండ్ పేప‌ర్ వివాదంపై ఉస్మాన్ ఖవాజా సంచ‌ల‌నం!

Big Stories

Advertisement
×