KA Paul: ఎమ్మెల్సీ కవితకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ బంపరాఫర్ ప్రకటించారు. కవితను ప్రజాశాంతి పార్టీలోకి రావాలని ఆహ్వానించారు కేఏ పాల్. బీసీల కోసం పోరాటం చేస్తున్న కవిత తమ పార్టీలో చేరితే మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. ఎమ్మెల్సీ కవిత మంగళవారం మీడియా సమావేశం నిర్వహించి బీఆర్ఎస్ సీనియర్ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు, సంతోష్ రావు ఇద్దరూ అవినీతి అనకొండలు అంటూ చేసిన సంచలన ఆరోపణలు సంచలనంగా మారాయి. హరీష్ రావు వల్లే ఈ రోజు కేసీఆర్ బద్నాం అవుతున్నారని కూడా అన్నారు.
వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలు పార్టీకి భారీ నష్టం చేకూరే అవకాశం ఉందన్న ఆలోచనతో బీఆర్ఎస్ హైకమాండ్ సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేసింది. త్వరలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరగనున్న నేపథ్యంలో కవిత వ్యాఖ్యలు పార్టీకి ఇబ్బంది కలిగే ఛాన్స్ ఉందని పార్టీ భావించినట్టు తెలుస్తోంది. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా కవితను సస్పెండ్ చేయాలని పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకులపై అలా ఎలా సంచలన ఆరోపణలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తల డిమాండ్ నేపథ్యంలో పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు పలువురు బీఆర్ఎస్ నేతలు చెప్పిన విషయం తెలిసిందే.
ప్రజాశాంతిలో చేరండి.. ప్రూఫ్ చేసుకోండి..
బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన కవితకు కేఏ పాల్ బంపరాఫరే ప్రకటించారు. తన పార్టీలో చేరాలని ఆహ్వానించారు. బీసీల కోసం పోరాటం చేస్తున్న కవిత తమ పార్టీలో చేరితే మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. కేఏ పాల్ మాట్లాడుతూ.. ‘మాజీ సీఎం కేసీఆర్ కూతురు కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కవిత ఎప్పుడూ బీసీల కోసం పోరాడతా అని చెబుతున్నారు. నిజంగా తాను బీసీల కోసం పొరాడే నాయకురాలు అయితే.. ప్రస్తుతం బీసీల కోసం పోరాడే ఏకైక పార్టీ ప్రజాశాంతి పార్టీ మాత్రమే.. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే మా పార్టీలో చేరండి. నువ్వు బీజేపీ వదిలిన బాణం కాదని నిరూపించుకో.. బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రాంచందర్ రావు తమ పార్టీ ఆర్ఎస్ఎస్ బ్రాహ్మణుల పార్టీ అని చెబుతున్నారు.. కాంగ్రెస్ 12 ముఖ్యమంత్రులు చేసిన రెడ్లు పార్టీ అని తెలుసు.. మరి ఒక దొరసానివి ప్రజలు నిన్ను నమ్మాలంటే.. ప్రజల్లో నీ పై నమ్మకం రావాలంటే… నువ్వు గద్దరన్న చేరిన పార్టీ అయిన ప్రజాశాంతి పార్టీలో వెంటనే చేరండి.. జూబ్లీహిల్స్ లో పోరాడుదాం.. రుజువు చేసుకుందాం..’ అని అన్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
కవిత నువ్వు ప్రజాశాంతి పార్టీలోకి రా : KA పాల్
నువ్వు బీజేపీ వదిలిన బాణం కాదని ప్రజాశాంతి పార్టీలో చేరి నిరూపించుకో
బీసీ ల కోసం పోరాడాలన్నా, ప్రజల్లో నీ మీద నమ్మకం పెరగాలన్నా నువ్వు మా పార్టీలో చేరాలి
గద్దరన్న చేరిన ప్రజాశాంతి పార్టీలో చేరితే మనం కలిసి బీసీ లకోసం పోరాటం… pic.twitter.com/DpMDxvzFLj
— BIG TV Breaking News (@bigtvtelugu) September 3, 2025