Bronco Test : ఆసియా కప్ 2025 సెప్టెంబర్ తొమ్మిది నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే వాళ్లు ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా బీసీసీఐ (BCCI) ఇటీవలే బ్రాంకో చెస్ట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. క్రికెటర్లకు ఈ టెస్ట్ చాలా ముఖ్యమని.. ఫిట్నెస్ పరంగా, హెల్త్ పరంగా బ్రాంకో టెస్ట్ ఉపయోగపడుతుందని ఉద్దేశంతో ప్రవేశపెట్టినట్టు ఇటీవల బీసీసీఐ ప్రకటించింది. అయితే తాజాగా టీమిండియా క్రికెటర్ల కి ఈ టెస్టు పై బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. అయితే ఆసియా కప్ 2025 టోర్నమెంట్ 9వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. రేపు దుబాయ్ కి టీం ఇండియా వెళ్లనుంది. ఇలాంటి నేపథ్యంలో బ్రాంకో టెస్టు( Bronco Test) పెట్టకూడదని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.
Also Read : Virat Kohli : వివాదంలో కోహ్లీ ఫిట్ నెస్ టెస్ట్.. లండన్ లో పర్మిషన్స్ ఇస్తూ బీసీసీఐ షాకింగ్ నిర్ణయం
టీమిండియా ఆటగాళ్లకు బ్రాంకో టెస్ట్ లేనట్టే..
ముఖ్యంగా పలు నివేదికలు టీమిండియా ఆటగాళ్లకు బ్రాంకో టెస్ట్ నుంచి ఉపశమనం కలిగిందని వార్తలు వినిపిస్తున్నాయి. నిన్న, మొన్నటి వరకు తప్పనిసరిగ్గా యోయో, బ్రాంకో టెస్టుల్లో పాస్ కావాల్సిందే అని కండీషన్లు పెట్టింది. దీంతో ఆటగాళ్లు ఫిట్ నెస్ సాధిస్తారని భావించి..తాజాగా ఈ టెస్ట్ ను తీసివేస్తున్నట్టు సమాచారం. మరోవైపు రగ్భీ క్రీడాకారుల కోసం అమలులో ఉన్న బ్రాంకో టెస్ట్ ని క్రికెటర్లకు పెట్టడం సరైంది కాదని.. పలువురు వాదించారు. ఇంకొందరూ అయితే బ్రాంకో టెస్టు వల్ల ఊపిరితిత్తులకు సమస్యలు వస్తాయని సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ డివిలీయర్స్ పేర్కొన్న విషయం తెలిసిందే. మరోవైపు టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మను బయటికి పంపించేందుకు బ్రాంకో టెస్ట్ తీసుకొచ్చారనే వాదనలు కూడా వినిపించాయి. దీంతో తాజాగా బీసీసీఐ ఒక్క అడుగు వెనక్కి వేసినట్టు సమాచారం.
దుబాయ్ లో నిర్వహిస్తారా..?
ఒకవేళ టెస్టు నిర్వహిస్తే.. దుబాయ్ లో నిర్వహించే అవకాశాలున్నాయని సమాచారం. మరోవైపు ఆసియా కప్ కోసం టీమిండియా సెప్టెంబర్ 04వ తేదీన దుబాయ్ బయలుదేరనుంది. ఆటగాళ్లు అందరూ అక్కడే కలుసుకోనున్నారు. వాస్తవానికి గతంలో అందరూ ముంబై కి వెళ్లి అక్కడి నుంచి కలిసి వెళ్లేవారు. కానీ ఈ సారి ఒక్కొక్కరూగా దుబాయ్ కి వెళ్లనున్నారు. సెప్టెంబర్ 5వ తేదీన ఐసీసీ అకాడమిలో తొలి ప్రాక్టీస్ సెషన్ జరుగనుంది. గతంలో ఇలాంటి టెస్టులు ఏవి లేవు. కానీ ఆటగాళ్ల యొక్క ఫిట్ నెస్ ఏవిధంగా ఉంది..? అని అంచనా వేయడానికి విరాట్ కోహ్లీ-రవిశాస్త్రీ సమయంలో శంకర్ బసు మార్గదర్శకంలో 2019 వరల్డ్ కప్ కోసం ఫిట్ నెస్ టెస్టులు తీసుకొచ్చారు. దీనిని అందరి ఆమోదంతోనే అమలు చేశారు. ప్రతీ క్రికెటర్ కి ఈ విధానంతోనే ఫిట్ నెస్ నిరూపించుకున్న తరువాతనే వరల్డ్ కప్ లో ఆడించారు. ఏడాదికి మూడు సార్లు ఈ టెస్ట్ నిర్వహిస్తున్నారు. కొత్త బ్రాంకో టెస్ట్ పెట్టడం పై కొందరూ వ్యతిరేకిస్తే.. కొందరూ ఏ టెస్ట్ కైనా సిద్ధమని చెబుతున్నారు. వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ యోయో, బ్రాంకో టెస్టులో పాస్ అయ్యాడు. దాదాపు 22 కిలోల బరువు కూడా తగ్గాడు రోహిత్ శర్మ. మరోవైపు టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ మాత్రం లండన్ లో బ్రాంకో టెస్ట్ లో పాస్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే అందరికీ ఒక న్యాయం.. కోహ్లీకి ఒక న్యాయమా..? అని పలువురు పేర్కొన్నట్టు సమాచారం.