Test Cricket Records : టీమిండియా (Team India) వర్సెస్ ఇంగ్లాండ్ (England) మధ్య 5 టెస్ట్ సీరిస్ లో భాగంగా ప్రస్తుతం లండన్ లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో టీమిండియా కేవలం 224 పరుగులకే ఆలౌట్ అయింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ చేస్తుంది. అయితే ఈ మైదానికి ఓ రికార్డు ఉందండోయ్.. ఇక్కడ ఒకే టెస్ట్ ఇన్నింగ్స్ లో 900 కంటే ఎక్కువగా పరుగులు నమోదు కావడం విశేషం. ఈ విషయం గురించి వింటే ఎవ్వరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఈ మ్యాచ్ 1938 ఆగస్టు 20న ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగింది. సిరీస్ లోని ఐదో మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది.
Also Read : Ind vs Eng 5th Test: లండన్ టెస్ట్ లో కుప్పకూలిన టీమిండియా.. మొదటి ఇన్నింగ్స్ స్కోర్ ఎంత అంటే!
ఒకే టెస్ట్ ఇన్నింగ్స్ లో 903 పరుగులు
తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 29 పరుగుల వద్ద బిల్ ఎడ్రిచ్ (12) వికెట్ ని కోల్పోయింది. కానీ ఇక్కడి నుంచి లియోనార్డ్ హట్టన్ మారిస్ లేలాండ్ తో కలిసి రెండో వికెట్ కి 382 పరుగులు జోడించడంతో జట్టును బలమైన స్థితిలో ఉంచాడు. మారిస్ లేలాండ్ 187 పరుగుల వద్ద రనౌట్ అయ్యాడు. అతను 438 బంతులు ఎదుర్కొని 17 ఫోర్లు కొట్టాడు. 411 పరుగుల వద్ద రెండో వికెట్ పడిపోయిన తరువాత లియోనార్డ్ హట్టన్ కెప్టెన్ వాలీ హామండ్ తో కలిసి మూడో వికెట్ కి 135 పరుగులు జోడించి జట్టును 500 దాటించాడు. జట్టు ఖాతాలో 59 పరుగులు జోడించిన తరువాత హామండ్ ఔట్ అయ్యాడు. ఇంగ్లాండ్ జట్టు ఐదో వికెట్ పడిపోయినప్పుడు స్కోర్ 555 గా ఉంది. అయితే ఇక్కడి నుంచి లియోనార్డ్ హట్టన్, జోహార్డ్ స్టాప్ కలిసి ఆరో వికెట్ 215 పరుగులు చేసి జట్టును 800కి దగ్గరగా తీసుకొచ్చారు. లియోనార్డ్ హట్టన్ 847 బంతులు ఎదుర్కొని 35 ఫోర్లతో 364 పరుగులు చేసాడు. దీంతో ఈ మైదానంలో అత్యధిక ఇన్నింగ్స్ ఆడిన బ్యాట్స్ మెన్ గా హట్టన్ నిలిచాడు.
టెస్ట్ చరిత్రలోనే అతిపెద్ద విజయం..
మరోవైపు ఏడో స్థానంలో బ్యాటింగ్ కి వచ్చిన జో హార్డ్ స్టాప్ అజేయంగా 169 పరుగులు చేయగా.. ఆర్థర్ వుడ్ జట్టు ఖాతాలో 53 పరుగులు జోడించాడు. ఈ బ్యాట్స్ మెన్ బలంతో.. ఇంగ్లాండ్ తన తొలి ఇన్నింగ్స్ ను 903/7 వద్ద డిక్లేర్ చేసింది. ఇక ఈ సమయంలో ఆతిథ్య జట్టు 335.2 ఓవర్లు ఆడింది. ఆస్ట్రేలియన్ బౌలర్లు అయితే మూడో రోజులు వికెట్ల కోసం వేడుకుంటూ కనిపించారు. ఇక ఆస్ట్రేలియా జట్టు నుంచి బిల్ ఓ రైల్లీ మూడు వికెట్లు తీశాడు. దీనికి ప్రతిస్పందనగా ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్ కేవలం 201 పరుగులకే కుప్పకూలిపోయింది. ఓపెనర్ బిల్ బ్రౌన్ 69 పరుగులు చేశాడు. లిండ్సే హాసెట్ 42 పరుగులు.. సిడ్ బార్న్స్ 41 పరుగులు చేసారరు. ఇంగ్లాండ్ జట్టు నుంచి బిల్ బోవ్స్ 5 వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్ ఆధారంగా ఇంగ్లాండ్ 702 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇది ఆస్ట్రేలియాకు ఫాలో ఆన్ ఇచ్చింది. దీంతో ఆసీస్ జట్టు రెండో ఇన్నింగ్స్ లో కేవలం 123 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లాండ్ జట్టు ఈ మ్యాచ్ లో ఇన్నింగ్స్ 579 పరుగుల తేడాతో గెలిచింది. టెస్ట్ క్రికెట్ లోనే అతి పెద్ద విజయం ఇది.