Coolie Hits This Number at Box Office: ప్రస్తుతం సౌత్లో అత్యంత బజ్ ఉన్న మూవీ ‘కూలీ‘. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోంది ఈ సినిమా. టాలీవుడ్ కింగ్ నాగార్జున అక్కినేని, బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్, కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర, హీరోయిన్ శ్రుతీ హాసన్లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఇందులో నాగ్ నెగిటివ్ షేడ్‌లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని డైరెక్టర్ రివీల్ చేశారు. ఆగష్టు 14న ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా విడుదల కానుంది. ఇక ఈ సినిమా వస్తున్న హైప్ కోలీవుడ్‌లో మరిన్ని ఆశలు రేపుతున్నాయి. కూలీతో అయినా కోలీవుడ్ కల నెరవేతుందేమో అని ఆశ పడుతున్నారు. ఇంతకి ఆ కల ఏంటీ? కూలీపై అన్ని ఆశలేందుకు? అనేది ఇక్కడ చూద్దాం!
విక్రమ్,లియోలు హ్యాండ్ ఇచ్చాయి
విక్రమ్, లియో చిత్రాలతో కోలీవుడ్కి బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్‌బస్టర్స్ హిట్స్ అందించాడు లోకేష్. రూ. 430 పైగా కోట్లు, రూ. 630 కోట్లకు పైగా ఈ సినిమా వసూళ్లు సాధించాయి. అప్పటి వరకు తమిళంలో అంత పెద్ద హిట్, భారీ వసూల్లు సాధించిన చిత్రాలు కూడా ఇవే. తెలుగు, హిందీ ఇండస్ట్రీలో సినిమాలు పోటీ పోటీగా వేల కోట్ల వసూళ్లతో దూసుకుపోతున్నాయి. అప్పటి వరకు కనీసం రూ. 200 కోట్ల మూవీ కూడా లేదు. అలాంటి టైంలో విక్రమ్, లియో చిత్రాలతో భారీ హిట్స్ కాదు రికార్డు వసూళ్ల అందించాడు.
వరుస ప్లాప్స్ బాక్సాఫీసు డీలా పడ్డ కోలీవుడ్ని నిలబెట్టిన ఘనత లోకేష్ కనగరాజ్ది. దీంతో తమిళంలో సత్తా ఉన్న డైరెక్టర్గా ఒక్కసారిగా అందరి ప్రశంసలు అందుకున్నాడు. ఇప్పుడాయనకు స్టార్ హీరో రేంజ్ క్రేజ్ ఉంది. లోకేష్ మూవీ అంటే ఎలివేషన్, యాక్షన్ ఓ రేంజ్లో ఉంటుంది. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు అంటే మినిమ్ వెయ్యి కోట్లు అనేట్టుగా పరిస్థితులు మారాయి. తెలుగు, హిందీలో పోటీ పోటీగా సినిమాలు వసూళ్లు చేస్తున్నాయి. అయితే వాటికి పోటీగా ఉన్న కోలీవుడ్ ఖాతాలో ఇంతవరకు వెయ్యి కోట్ల సినిమా లేదు. ఈ లెక్కలు తీసుకురావాలంటే రజనీకాంత్, విజయ్, కమల్ హాసన్లతోనే సాధ్యం.
లోకేష్ పై ఆశలు..
కానీ.. కమల్ ‘విక్రమ్‘, విజయ్ ‘లియో‘ చిత్రాలు వెయ్యి కోట్లు సాధిస్తాయి అనుకున్నారు. కానీ, వాటితో సాధ్యంకాలేదు. దీంతో కోలీవుడ్ మొత్తం ఇప్పుడు కూలీవైపే చూస్తున్నాయి. లోకేష్పై ఉన్న నమ్మకంతో కూలీ మూవీ వెయ్యి కోట్లు సాధించడం పక్కా అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ఇక లోకేష్ కనగరాజ్ ఈ సినిమా ఆ రేంజ్లోనే ప్లాన్ చేశాడు. అందుకే ఈ సినిమాలో ఇతర ఇండస్ట్రీలోని దిగ్గజాలను పార్ట్ చేశాడు. హిందీ నుంచి ఆమిర్, తెలుగు నుంచి నాగ్ని, కన్నడ నుంచి ఉపేంద్ర ఈ సినిమాలో తీసుకుని వెయ్యి కోట్ల వసూళ్లను టార్గెట్ చేశాడు. మరీ కోలీవుడ్ కలను లోకేష్ కూలీతో నెరవేస్తాడా? లేదా? తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
Also Read: War 2: సితార చేతికి ‘వార్ 2′ తెలుగు రైట్స్.. నాగవంశీ భలే తప్పించుకున్నారే