E-Paper
Advertisement

విరాట్ కోహ్లీకి ఇంత డ‌బ్బు పిచ్చా…బాటిల్ స్టిక్క‌ర్ తీసేసి మ‌రీ దొరికిపోయాడు!

విరాట్ కోహ్లీకి ఇంత డ‌బ్బు పిచ్చా…బాటిల్ స్టిక్క‌ర్ తీసేసి మ‌రీ దొరికిపోయాడు!
Advertisement

Virat Kohli Removing Water Bottle: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఆదివారం జరిగిన ఐదవ వన్డే సందర్భంగా విరాట్ కోహ్లీ చేసిన ఓ పని సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. డ్రెస్సింగ్ రూమ్ లో ఉన్నంతసేపు ఓ ఎనర్జీ డ్రింక్ తాగిన విరాట్ కోహ్లీ… మైదానంలోకి వస్తుండగా తన చేతిలో ఉన్న బాటిల్ స్టిక్కర్ తొలగించేశాడు. స్టిక్కర్లేని ఎనర్జీ బాటిల్ ను మైదానంలోకి తీసుకువచ్చి తాగేశాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. విరాట్ కోహ్లీకి డబ్బు పిచ్చి పట్టిందని.. ఏ బ్రాండ్ ను కూడా ఫ్రీగా ప్రమోట్ చేయబోడని రియాక్ట్ అవుతున్నారు. ఆ కంపెనీతో డీల్ కుదరకపోవడంతో అలా స్టిక్కర్ తొలగించాడని కొందరు రియాక్ట్ అవుతున్నారు. బీసీసీఐ, ఐసీసీ రూల్స్ ప్రకారం స్టేడియంలో ఎలాంటి బ్రాండ్స్ ప్రమోట్ చేయకూడదని అందుకే విరాట్ కోహ్లీ అలా చేసి ఉంటాడని మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.

కోహ్లీ చేసిన స‌రైన‌దేనా? రూల్స్ ఏం చెబుతున్నాయి

టీమిండియా జెర్సీ ధరించిన విరాట్ కోహ్లీ మైదానంలో అడుగుపెట్టేముందు తన చేతిలో ఉన్న బాటిల్ పై ఉన్న స్టిక్కర్ తీసేయడంపై రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కోహ్లీని కొంతమంది మెచ్చుకుంటే, మరికొంతమంది విమర్శిస్తున్నారు. అయితే ఐసీసీ, బీసీసీఐ అమలు చేస్తున్న రూల్స్ ప్రకారం కోహ్లీ చేసిందే కరెక్ట్ అని తెలుస్తోంది. అంతర్జాతీయ క్రికెట్ ప్రొఫెషనల్ టోర్నమెంట్స్ లలో స్పాన్సర్షిప్ రూల్స్ కఠినంగా ఉంటాయని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. టీవీ కెమెరాల ముందు అనధికారిక లేదా ఒప్పందం లేని బ్రాండ్ల లోగోలు కనిపించకుండా ఆటగాళ్లు ఇలా స్టిక్కర్లు తొలగిస్తారని చెబుతున్నారు.

Advertisement

Months After Mustafizur Rahman Controversy, 7 Bangladesh Players Register For IPL 2027 Auctionఐపీఎల్‌లోకి బంగ్లాదేశ్ క్రికెటర్లు రీ-ఎంట్రీ…బీసీసీఐ పెద్దలను తరిమికొట్టాలంటూ ట్రోలింగ్ ?

న్యూజిలాండ్ గ‌డ్డ‌పై జ‌రిగిన వ‌న్డే నేప‌థ్యంలో అక్క‌డ ఎలాంటి కంపెనీల‌తో కోహ్లీకి ఒప్పందాలు కూడా జ‌రుగ‌లేదు. ఒప్పందం కుదిరింటే, బీసీసీఐ ప‌ర్మిష‌న్ తీసుకుని కోహ్లీ ప్ర‌మోట్ చేయ‌వ‌చ్చ‌ని స‌మాచారం. అంతేకానీ విరాట్ కోహ్లీకి ఎలాంటి డబ్బు పిచ్చి లేదని.. రూల్స్ ప్రకారం అతడు నడుచుకున్నాడని పేర్కొంటున్నారు. బ్రాడ్ కాస్టింగ్, స్పాన్సర్షిప్ రూల్స్ పాటించడంలో భాగంగానే కోహ్లీ బాటిల్ లేబుల్ తొలగించాడని అంటున్నారు. అనవసరంగా కోహ్లీని విలన్ చేసి… బూచిగా చూపే ప్రయత్నం మానుకోండి అని అంటూ క్రికెట్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఇది ఇలా ఉండ‌గా, న్యూజిలాండ్ వ‌ర్సెస్ టీమిండియా మ‌ధ్య జ‌రిగిన వ‌న్డే సిరీస్ ను 3-1 తేడాతో గిల్ సేన కైవ‌సం చేసుకుంది. అయితే, ఈ టోర్న‌మెంట్ లో విరాట్ కోహ్లీ చెత్త ప్ర‌ద‌ర్శ‌న క‌నిబ‌రిచాడు. దీంతో అత‌నిపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

Advertisement

Fatima Sana Ahead Of Babar Azam? Ex-Pakistan Selector’s Explosive Verdict Sparks Debate : ఫాతిమా ప్రవాహంలో స్మృతి, హర్మన్ కొట్టుకుపోతారు..WPL వేలంలో సనా రూ.10 కోట్లు పలకడం పక్కా!

 

 

?utm_source=ig_web_copy_link&knvt=NTc4MTIwNjQ2YQ==

Related News

ఆంధుల ఆసియా కప్.. టీమిండియాపై పాకిస్తాన్ సూపర్ విక్టరీ, రెచ్చగొట్టే సెలబ్రేషన్స్ చేసిన ప్లేయర్లు

ట్రావిస్ హెడ్, స్టార్క్ ఔట్.. ఐపీఎల్ 2027లో 10 ఫ్రాంచైజీలు వదిలేసిన ప్లేయర్లు వీళ్లే

ఫ్యాన్స్ బిగ్ షాక్…ఐపీఎల్ కు మ‌హేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్

షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న భార‌త్, పాక్ కెప్టెన్లు..అంధుల ఆసియా క‌ప్ పై ఇంజ‌మామ్ సంచ‌ల‌నం!

ఆర్య‌వీర్, సెహ్వాగ్ ఇద్ద‌రూ దొంగ‌లే..వీడియో కాల్ పేరుతో పాకిస్తాన్ ను బ‌క‌రా చేశారు

కావ్య పాపకు ఎదురుదెబ్బ‌…IPL 2027 నుంచి ట్రావిస్ హెడ్ ఔట్ ?

మొహ్సిన్ న‌ఖ్వీకి బిగ్ షాక్…ఏసీసీ ఛైర్మ‌న్ గా ఏసీసీ ఛైర్మన్ తమీమ్ ఇక్బాల్ ?

Big Stories

Advertisement
×