IPL 2027 Retention: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2027 టోర్నమెంట్ మినీ వేలం నేపథ్యంలో మంగళవారం ( నవంబర్ 17వ తేదీ)తో రిటెన్షన్ ( IPL 2027 Retention) ప్రక్రియకు గడువు ముగిసింది. ఇలాంటి తరుణంలోనే 10 ఫ్రాంచైజీలు.. వద్దనుకున్న ప్లేయర్లను వేలంలోకి వదిలేశాయి. మిగిలిన ప్లేయర్లను రిటైన్ చేసుకున్నాయి. ఈ తరుణంలోనే ట్రావిస్ హెడ్, మిచెల్ స్టార్క్ లాంటి ప్లేయర్లు కూడా రిలీజ్ లిస్టులో చేరిపోయారు. ఈ ఇద్దరూ ఆటగాళ్లు వర్క్ లోడ్ పేరుతో వచ్చే సీజన్ కు దూరం కాబోతున్నారు. ఈ మేరకు ఫ్రాంచైజీలకు సమాచారం అందించి, తప్పుకున్నారు. స్టార్క్ విషయం పక్కకు పెడితే, ట్రావిస్ హెడ్ తప్పుకోవడం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయాలపై ఎఫెక్ట్ చూపనుంది. హెడ్, అభిషేక్ శర్మ ఓపెనింగ్ జోడి పేరు వింటేనే.. ప్రత్యర్థి బౌలర్లు గజగజ వణికిపోతారు. అలాంటి జోడి ఇకపై కనిపించబోదన్న మాట. అయితే, హెడ్ స్థానంలో ఇషాన్ కిషన్… అభిషేక్ శర్మతో ఓపెనర్ గా బరిలోకి దిగనున్నాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2027 టోర్నమెంట్ లో పెద్ద ప్లేయర్లను కూడా వదిలేసి, ఫ్రాంచైజీలు షాక్ ఇచ్చాయి. ముఖ్యంగా జాకబ్ బెథెల్ ను వదిలేసి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పెద్ద నిర్ణయమే తీసుకుంది. అటు ట్రావిస్ హెడ్ రిలీజ్ కూడా హాట్ టాపిక్ అయింది. అజింక్య రహానే, అభిషేక్ పోరెల్ లను కూడా ఫ్రాంచైజీలు వదిలేశాయి. నితీష్ రాణా లాంటి డేంజరస్ ప్లేయర్ కూడా షాక్ తగిలింది. రిటైర్మెంట్ ఇచ్చిన తరుణంలోనే ధోనిని కూడా చెన్నై వదిలేసింది. హెట్మేయర్, లాకీ ఫెర్గూసన్, మతీశ పతిరణ, మిచెల్ స్టార్క్, ట్రెంట్ బౌల్ట్, రచిన్ రవీంద్ర లాంటి పెద్ద ప్లేయర్లను ఫ్రాంచైజీలు రిలీజ్ చేశాయి.
రిటెన్షన్ తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ జట్టు పర్స్ వ్యాల్యూ భారీగా పెరిగింది. ప్రస్తుతం లక్నో దగ్గర రూ.47.5 కోట్లు ఉన్నాయి. ఆ తర్వాత కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు దగ్గర రూ.41.65 కోట్లు ఉండగా, సన్ రైజర్స్ హైదరాబాద్ దగ్గర రూ.40.15 కోట్లు ఉన్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ రూ.39.5 కోట్లు, ముంబై ఇండియన్స్ రూ.32.6 కోట్లు, చెన్నై సూపర్ కింగ్స్ రూ.28.05 కోట్లు, రాజస్థాన్ రాయల్స్ రూ.27.05 కోట్లు, పంజాబ్ కింగ్స్ రూ.18.6 కోట్లు, రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ.14.15 కోట్లు, గుజరాత్ టైటాన్స్ రూ.8.74 కోట్లు కలిగి ఉన్నాయి. ఈ డబ్బులను డిసెంబర్ 16న జరిగే మినీ వేలంలో వినియోగించుకుని ప్లేయర్లను కొనుగోలు చేసుకోవచ్చు.
🚨 IPL 2027 RETENTION UPDATE! 🏏🔥
FULL LIST OF PLAYERS RELEASED BY ALL 10 FRANCHISES AHEAD OF THE IPL 2027 AUCTION!
Several big names feature on the list, including Travis Head, Mitchell Starc, MS Dhoni and Matheesha Pathirana.
Which release surprised you the most? 👀 pic.twitter.com/ZOPiusEqLP
— CAPTAIN SUII 🐐 (@VKBA1856) November 17, 2026
🚨 IPL 2027: FULL RETAINED PLAYERS LIST OF ALL 10 TEAMS! 🏏🔥
The complete retention lists of all 10 IPL franchises ahead of the IPL 2027 auction.
Which team has retained the strongest squad, and who are your favourites to win IPL 2027? 🏆👀#IPL2027Retentions pic.twitter.com/2rRRy9DSqN
— CAPTAIN SUII 🐐 (@VKBA1856) November 17, 2026
🚨 IPL 2027 AUCTION UPDATE! 🏏💰
Remaining purse, available squad slots and overseas slots for all 10 IPL franchises ahead of the IPL 2027 auction.
LSG lead with ₹47.45 crore, while GT have the smallest purse at ₹8.75 crore. https://t.co/oQCisqnsOO pic.twitter.com/ClNsfNLQrk
— CAPTAIN SUII 🐐 (@VKBA1856) November 17, 2026