Tanveer Ahmed On Yasheer Goud Celebration: అండర్ 19 ఆసియా కప్ 2026 టోర్నమెంట్ లో (Under-19 Asia Cup 2026 tournament) భాగంగా పాకిస్తాన్ పై విక్టరీ సాధించిన టీమిండియా తొమ్మిదవ సారి ఛాంపియన్ గా నిలిచింది. ఈ సందర్భంగా టీమిండియా క్రికెటర్లు సెలబ్రేషన్స్ చేసుకోవడం వివాదంగా మారింది. ముఖ్యంగా భారత కుర్రాడు యశ్వీర్ గౌడ్ సెలబ్రేషన్స్ పట్ల పాకిస్తాన్ మాజీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై తాజాగా మరోసారి తన్వీర్ అహ్మద్ హాట్ కామెంట్స్ చేశాడు. యశ్వీర్ గౌడ్ అంతలా రెచ్చిపోయిన సందర్భంగా తమ హంజా జహూర్ అక్కడే పళ్ళు రాలగొట్టి ఉంటే పరిస్థితి ఏంటని ప్రశ్నించాడు. యశ్వీర్ అంతలా అవమానించినా హంజా… ఓపిక పట్టినట్టు మెచ్చుకున్నాడు. అండర్ 19 కుర్రాడు అయినప్పటికీ హంజా గొప్ప మనసుతో అక్కడి నుంచి వచ్చాడు తప్ప ఎలాంటి గొడవ పెట్టుకోలేదని ప్రశంసించాడు. అక్కడే రివర్స్ అటాక్ చేసి ఉంటే టీమిండియా తలదించుకోవాల్సి వచ్చేది అంటూ హాట్ కామెంట్స్ చేశాడు.
అండర్ 19 ఆటగాడు యశ్వీర్ గౌడ్, ఇతర టీమిండియా క్రికెటర్లు చేసిన సెలబ్రేషన్స్ పై తన్వీర్ అహ్మద్ అగ్రహం వ్యక్తం చేశాడు. విక్టరీ సాధిస్తే ఇలా దుర్మార్గంగా వ్యవహరించడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించాడు. క్రమశిక్షణ కలిగిన ప్లేయర్లు ఇలా చేయబోరని…అనవసరంగా వివాదానికి తెరలేపారని మండిపడ్డాడు. ముఖ్యంగా యస్వీర్ గౌడ్ దూకుడగా వ్యవహరించడం చాలా అవమానకరంగా ఉందని మండిపడ్డాడు. యువ క్రికెటర్లు క్రీడా స్ఫూర్తిని మర్చిపోయి రౌడీ లాగా బిహేవ్ చేసినట్టు నిప్పులు చెరిగాడు.
ఒక ఫైనల్ గెలిచినప్పుడు హుందాగా సంబరాలు చేసుకోవాలి కానీ… ఇలా ప్రత్యర్థి జట్టు ఆటగాళ్ల పైకి దూసుకు రాకూడదని చురకలు అంటించాడు. యశ్వీర్ గౌడ్ ప్రవర్తన నేపథ్యంలో అక్కడే హంజా జహూర్ రివర్స్ అటాక్ చేసి ఉంటే.. టీం ఇండియా తలదించుకోవాల్సి వచ్చేదంటూ బాంబు పేల్చాడు. కానీ హంజా జహూర్ మాత్రం అలా చేయకుండా రియల్ హీరోగా మారిపోయాడని మెచ్చుకున్నాడు. టీమిండియా పై సెంచరీ చేయడమే కాకుండా యస్వీర్ గౌడ్ ను వదిలేసి గొప్ప వ్యక్తిగా మారిపోయాడని ప్రశంసల వర్షం కురిపించాడు తన్వీర్ అహ్మద్.