Aamir Khan : సాధారణంగా పాకిస్తాన్-ఇండియా జట్లు తలపడుతున్నాయంటే చాలు ఏ ఆటలో అయినా సరే ఆ మజానే వేరు. ముఖ్యంగా అందరూ టీవీలు, ఫోన్లు అతక్కుపోతుంటారు. ఇవాళ ఈ ఆటను చూడాలని.. ఇక ముఖ్యంగా క్రికెట్ మ్యాచ్ అయితే ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ తో చూస్తుంటారు. ప్రపంచంలో క్రికెట్ లో ఏ రెండు జట్ల మధ్య అయినా టఫ్ ఫైట్ ఉంటుందంటే.. అది ఇండియా-పాకిస్తాన్ జట్లు అనే చెప్పాలి. ఆ రెండు జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగితే ఆ కిక్కే వేరు. ఆ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్ ల్లో అభిమానులు స్టేడియాల్లో నిండిపోతారు. ఇక కొందరూ ఆఫీసులు, వ్యాపారాలు మానుకొని మరీ మ్యాచ్ లు చూసే వారు కూడా ఉన్నారు. అలాంటి ఇండియా-పాక్ మ్యాచ్ వల్ల తన జీవితమే నాశనం అయిందని బాలీవుడ్ హీరో అమిర్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
Also Read : Roman Reigns : 6 గురు పిల్లలకు తండ్రి అయిన WWE స్టార్ రోమన్ రెయిన్స్
సిక్స్ కొట్టి మా పెళ్లి బర్ బాద్ చేశాడు : అమిర్ ఖాన్
ఏప్రిల్ 18, 1986లో అమిర్ ఖాన్ పెళ్లి జరిగింది. అయితే అదే రోజు భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో భారత్ గెలుపు ఖాయమని అంతా భావించారు. దీంతో అందరూ సంతోషంగా ఉన్న సమయంలో పాకిస్తాన్ బ్యాట్స్ మెన్ జావేద్ మియాందాద్ చివరి బంతికి సిక్స్ కొట్టి పాకిస్తాన్ ని గెలిపించాడు. దీంతో అమిర్ ఖాన్ సంతో షం ఆవిరైపోయింది. పాక్ ప్లేయర్ జావేద్ మియాందాద్ తన పెళ్లి బర్ బాద్ చేశాడని అమిర్ ఖాన్ ఫన్నీ కామెంట్స్ చేసారు. ఒకవేళ పాకిస్తాన్ ఓడిపోయి ఉంటే మా సంతోషం రెట్టింపు అయయేదని అమిర్ చెప్పుకొచ్చారు. ఇక తన పెళ్లి అయినా కొద్ది సంవత్సరాల తరువాత ఓ రోజు ఫ్లైట్ లో మియాందాద్ ని కలిశానని.. మీ వల్లే నా పెళ్లి బర్ బాద్ అయిందని చెప్పినట్టు వివరించారు. మీరు చేసింది కరెక్ట్ కాదు.. ఆ ఒక్క సిక్స్ మమ్మల్ని బాధలోకి నెట్టేసిందని చెప్పానని బయటపెట్టారు అమిర్ ఖాన్.
నిర్మాతగా మారిన అమిర్ ఖాన్..
అమిర్ ఖాన్ నటించడమే కాకుండా నిర్మాతగా మారి రూపొందించిన చిత్రం సితారే జమీన్ పర్. 2007లో రిలీజై భారీ విజయం అందుకున్న తారే జమీన్ పర్ మూవీకి సీక్వెల్ గా ఈ చిత్రం రూపొందింది. ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వం వహించిన ఈ మూవీలో జెనీలియా దేశ్ ముఖ్ కీలక పాత్రలో నటించింది. ఈ సినిమాకు అపర్ణ పురోహిత్ సహ నిర్మాతగా వ్యవహరించారు. హాలీవుడ్ లో 2018లో రిలీజైన స్పానిష్ మూవీ ఛాంపియన్స్ ఆధారంగా సితారే జమీన్ పర్ మూవీని తెరకెక్కించారు. అమీర్ ఖాన్ ప్రొడక్సన్ నిర్మించిన ఈ మూవీలో సోషల్ మీడియా ఇన్ ప్లూయెన్సర్లు, టెలివిజన్ ఆర్టీస్టులు, నూతన నటులు ఎక్కువగా నటించారు. జి. శ్రీనివాస్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందించారు. అమీర్ ఖాన్ నిర్మాతగా మారి ఈ చిత్రాన్ని దాదాపు రూ.90 కోట్ల తో రూపొందించారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా అమిర్ ఖాన్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.