Roman Reigns : WWE సూపర్ స్టార్ రోమన్ రీన్స్ గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. అతని భార్య గలీనా బెకర్ కూాడా దాదాపు అందరికీ పరిచయమే అయి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఆమె ఐదుగురికి జన్మనిచ్చింది. తాజాగా ఆరో బిడ్డకి స్వాగతం పలికారు. ఈ వార్త తాజాగా బయటికి వచ్చింది. ఇలాంటి వార్తలను ఎక్కువగా రూమర్స్ క్రికెట్ చేస్తుంటారు.ఈ జంట తమ కుటుంబం గురించి పెద్దగా ఎవ్వరితో చర్చించుకోరు. ఇప్పటికే వీరికి జోయెల్ అనే కుమార్తె, ఈమెతో పాటు మరో ఇద్దరూ కుమార్తెలు, అలాగే కవలల అబ్బాయిలు.. తాజాగా మరో బిడ్డకు స్వాగతం పలికారు. ప్రస్తుతం 6గురు పిల్లలకు రోమన్ రెయిన్స్ తండ్రి అయ్యాడని సోషల్ మీడియాలో వైరల్ కావడం విశేషం.
WWE లో రెయిన్స్ చర్చనీయాంశం..
రెసిల్ మేనియా 41 తరువాత రోమన్ రెయిన్స్ WWE నుంచి వైదొలిగాడు. వాస్తవానికి రెయిన్స్ కి ఆరుగురు పిల్లలు కావడానికి కారణం అతను కుటుంబంతో ఎక్కువగా గడుపుతుండటమే. దీంతో తాజాగా అదనంగా అనోవాయ్ అనే సరికొత్త సభ్యుడు తమ ఇంట్లో చేరాడు. నిజానికి అతను రింగ్ నుంచి గైర్హాజరైన కొద్ది నెలల తరువాత ఇలా జరగడం విశేషం. అయినప్పటికీ ఇప్పటికీ WWE లో చర్చనీయాంశం అనే చెప్పాలి. అతని వ్యాపారం కూడా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ప్రపంచ ప్రధాన ఆటగాడు తిరిగి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ నేపథ్యంలో పలువురు రోమన్ రీన్స్ విషెష్ చెప్పడం విశేషం. ఆరుగురు పిల్లలు అని అందరూ విషెష్ చెప్పే విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
7వ WWE సూపర్ స్టార్
WWE అతిపెద్ద సూపర్ స్టార్ లలో ఒకరిగా రోమన్ రెయిన్ తనను తాను స్థిరపరుచుకున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల మంది అభిమానులతో ప్రజాధారణ పెరుగుతూనే ఉంది. అద్భుతమైన ఇన్ రింగ్ ప్రదర్శనలు, గొప్ప వ్యక్తిత్వానికి పేర్కాంచాడు రెయిన్స్. అతని WWE కెరీర్ ను పూర్తిగా మార్చేసింది. పాల్ హేమన్ తో కలిసి అతను కంపెనీని ఆధిపత్యం చెలాయించాడు. 1,316 రోజులు ఛాంపియన్ షిప్ కొనసాగించాడు. WWE చరిత్రలో గొప్ప ఛాంపియన్స్ లలో ఒకరిగా తన వారసత్వాన్ని సుస్థిరం చేసుకున్నాడు. రెజిల్ మేనియా 41లో ముగిసింది. రోమన్ రెయిన్స్ కి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు భారీగానే ఉన్నారు. ఇటీవల అతని ప్రభావం విపరీతంగా పెరిగిందనే చెప్పాలి. అతను బరిలోకి దిగిన ప్రతిసారి అభిమానులు ఉత్సాహంతో ఉప్పొంగిపోతారు. సమ్మర్ స్లామ్ 2024లో అతను తిరిగి వచ్చినప్పుడు అతని పునరాగమన వీడియో సోషల్ మీడియాలో 200 మిలియన్లకు పైగా వీక్షంచడం విశేషం. రెయిన్స్ ఇన్ స్టాగ్రామ్ లో 10 మిలియన్ల మంది ఫాలోవర్స్ ని అధిగమించాడు. దీంతో అతను ఈ ఘనతను సాధించిన ఏడో WWE సూపర్ స్టార్ గా నిలిచాడు. ప్రపంచ ఐకాన్ గా అతని హోదాను మరింత పటిష్టం చేసుకున్నాడు. రికార్డులను క్రియేట్ చేస్తున్న కొద్ది అతనికి మరింత ఫాలోయింగ్ పెరుగుతుందని భావిస్తున్నారు.