OTT Movie : ఓటీటీలో ఒక బాలీవుడ్ నుంచి వచ్చిన ఒక క్రైమ్ సిరీస్ ఆకట్టుకుంటోంది. కామెడీ జానర్ లో వచ్చిన ఈ సిరీస్ లో రామ్ కపూర్ ప్రధాన పాత్రలో నటించాడు. ఒసిడితో బాధపడే ఒక మాజీ ముంబై పోలీసు అధికారిగా, తన నటనతో ఈ సిరీస్ ని వన్ మ్యాన్ షో గా నడిపించాడు. ఇందులో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ను సరికొత్త స్టైల్ లో చూపించారు. ప్రతీ ఎపిసోడ్ ఒక కొత్త కేసుతో ఆసక్తిగా నడుస్తుంది. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
జియో హాట్‌స్టార్ (Jio Hotstar)
ఈ క్రైమ్-కామెడీ వెబ్ సిరీస్ పేరు ‘మిస్త్రీ’ (Mistry). 2025 లో వచ్చిన ఈ సిరీస్ కి రిషబ్ సేథ్ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్‌ను బనిజయ్ ఆసియా, యూనివర్సల్ ఇంటర్నేషనల్ స్టూడియోస్ నిర్మించాయి. ఇందులో రామ్ కపూర్ (అర్మాన్ మిస్త్రీ), మోనా సింగ్ (ఎసిపి సెహ్మత్ సిద్దిఖీ), శిఖా తల్సానియా (షరన్య), క్షితిష్ దతే ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ 8 ఎపిసోడ్‌లతో, ప్రతి ఎపిసోడ్ సుమారు 30 నిమిషాల నిడివి కలిగి ఉంది. ఇది 1990ల ముంబై నేపథ్యంలో జరిగే కథ. ఒక ఒసిడి తో బాధపడే మాజీ పోలీసు అధికారి అయిన అర్మాన్ మిస్త్రీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్‌ల చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది. ఈ సిరీస్ 2025, జూన్ 27న జియో హాట్‌స్టార్ (Jio Hotstar) లో స్ట్రీమింగ్ అవుతోంది. IMDb లో ఈ సిరీస్ కి 6.9/10 రేటింగ్ ఉంది.
స్టోరీలోకి వెళితే
కథ అర్మాన్ మిస్త్రీ అనే మాజీ ముంబై పోలీసు అధికారితో మొదలవుతుంది. అతని భార్య ఒక బాంబ్ బ్లాస్ట్ లో చనిపోతుంది. ఈ కేసు విషయంలో అతను మెంటల్ గా డిస్ట్రబ్ అవుతాడు. అందువల్ల అతను ఉద్యోగం నుండి సస్పెండ్ కూడా అవుతాడు. అయితే అర్మాన్ కి ఇన్వెస్టిగేషన్ చేయడంలో అసాధారణ ప్రతిభ ఉంటుంది. ఇప్పుడు డిటెక్టివ్ గా మారి పోలీస్ కేసులను సాల్వ్ చేస్తుంటాడు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, అతను తీవ్రమైన ఒసిడితో బాధపడుతుంటాడు. దీనివల్ల అతనను వ్యక్తిగతంగా, వృత్తి పరంగా ఇబ్బందులు పడుతుంటాడు. అతని అసిస్టెంట్ షరన్య అతని ఒసిడి లక్షణాలను కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంటుంది. హ్యాండ్ సానిటైజర్, వెట్ వైప్స్‌తో అతనికి హెల్ప్ చేస్తూ, డిటెక్టివ్ కెరీర్‌లో కూడా సహాయం చేస్తుంటుంది. అర్మాన్ ప్రస్తుతం అధికారికంగా పోలీసు శాఖలో లేనప్పటికీ, ఎసిపి సెహ్మత్ సిద్దిఖీ నేతృత్వంలోని క్రైమ్ బ్రాంచ్ అతని సహాయాన్ని కోరుతుంది.
ఈ సిరీస్ ప్రతి ఎపిసోడ్, ఒక కొత్త క్రైమ్ కేసును పరిచయం చేస్తుంది. అర్మాన్ తన విచిత్రమైన పద్ధతులతో దానిని పరిష్కరిస్తాడు. ఈ కేసులు సాధారణ మోసాల నుండి హత్యల వరకు ఉంటాయి. ఈ సిరీస్‌లో మరో స్టోరీ నడుస్తూ ఉంటుంది. అర్మాన్ భార్య హత్య వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించడం. ఎన్నో కేసులను సాల్వ్ చేసిన అర్మాన్ కి, తన భార్య బాంబ్ బ్లాస్ట్ కేసును సాల్వ్ చేయడానికి చాలా కష్టపడతాడు. అయితే అతనికి ఒక్క క్లూ కూడా దొరకదు. ఈ కేసును ఇంతటితో వదిలేయమని బెదిరింపులు కూడా వస్తాయి. ఇక ఈ సీజన్ ఒక షాకింగ్ ట్విస్ట్ తో ఎండ్ అవుతుంది. చివరికి అర్మాన్ తన భార్యను చంపిన హంతకులను పట్టుకుంటాడా ? ఈ కేసులో ఏదైనా క్లూ దొరుకుతుందా ? దీని వెనుక ఎవరుంటారు? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సిరీస్ ను మిస్ కాకుండా చూడండి.
Read Also : ఈ ఊర్లో అమ్మాయిలందరూ ప్రెగ్నెంట్… భర్త లేకుండానే ఆ పని… ఐఎండీబీలో 7.6 రేటింగ్ ఉన్న రియల్ స్టోరీ