BigTV English

Aron Pinch : అంతర్జాతీయ క్రికెట్ కు ఆసీస్ కెప్టెన్ గుడ్ బై.. టీ20ల నుంచి తప్పుకున్న ఫించ్..

Aron Pinch : అంతర్జాతీయ క్రికెట్ కు ఆసీస్ కెప్టెన్ గుడ్ బై.. టీ20ల నుంచి తప్పుకున్న ఫించ్..

Aron Pinch : ఆస్ట్రేలియా టీ20 జట్టు కెప్టెన్ ఆరోన్ ఫించ్‌ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పేశాడు. ప్రస్తుతం టీ20 మ్యాచ్ ల్లోనే ఆడుతున్న ఫించ్ ఈ ఫార్మాట్ నుంచి కూడా తప్పుకున్నాడు. గతేడాది సెప్టెంబర్ లోనే వన్డేలకు ఫించ్ గుడ్ బై చెప్పాడు. ఫించ్ నాయకత్వంలో టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా విఫలం కావడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ఈ మధ్యకాలంలో ఫించ్ తరచూ విఫలమవుతున్నాడు. గతంలో మాదిరిగా భారీ స్కోర్లు సాధించలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇక అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు.


టీ20 ప్రపంచ కప్‌ 2024 వరకు తాను ఆడటం కష్టమేనని ఫించ్ చెప్పాడు. అందుకే ఆసీస్‌ జట్టు సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అలాగే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పడానికి ఇదే సరైన సమయంగా భావిస్తున్నానని తెలిపాడు. వచ్చే ఏడాది ప్రపంచ కప్ నాటికి టీమ్ ను రెడీ చేసేందుకు తగినంత సమయం ఉంటుందని పేర్కొన్నాడు. అంతర్జాతీయ కెరీర్‌లో విజయవంతం కావడానికి సహకరించిన, మద్దతుగా నిలిచిన అభిమానులకు, సహచరులకు ధన్యవాదాలు తెలిపాడు.

తొలిసారి టీ20 ప్రపంచకప్‌ 2021, 2015లో సొంతగడ్డపై వన్డే ప్రపంచకప్‌ను అందుకోవడం తన జీవితంలో మరిచిపోలేని క్షణాలుగా ఫించ్ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టుకు 12 ఏళ్లపాటు ప్రాతినిధ్యం వహించడం గర్వకారణంగా ఉందని చెప్పాడు. దిగ్గజ క్రికెటర్లతో కలిసి ఆడటం గౌరవంగా భావిస్తున్నానని ఫించ్‌ వివరించాడు.


వన్డే ప్రపంచకప్‌లు వరుసగా గెలిచిన ఆస్ట్రేలియాకు టీ20 వరల్డ్ కప్ ఈజీగా దక్కలేదు. ఈ కలను కెప్టెన్‌గా ఆరోన్ ఫించ్‌ నెరవేర్చాడు. ఫించ్ నాయకత్వంలోనే యూఏఈ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌- 2021 టైటిల్‌ను ఆసీస్‌ కైవసం చేసుకుంది. పరిమిత ఓవర్ల క్రికెట్ లో ఫించ్ మంచి హిట్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. 146 వన్డేల్లో 17 సెంచరీలు, 30 హాఫ్ సెంచరీలతో 5,406 పరుగులు చేశాడు. 103 టీ20ల్లో 2 సెంచరీలు, 19 హాఫ్ సెంచరీలతో 3,120 పరుగులు సాధించాడు. ఆసీస్‌ తరఫున కేవలం 5 టెస్టులను మాత్రమే ఫించ్‌ ఆడాడు. టెస్టుల్లో 278 పరుగులు సాధించాడు. ఓపెనర్ బరిలోకి దిగిన ఫించ్ ..మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ తో కలిసి ఎన్నో మ్యాచ్ ల్లో ఆస్ట్రేలియా జట్టుకు బలమైన పునాది వేశాడు. ఈ జోడి ప్రత్యర్థి బౌలర్లకు సవాల్ నిలిచింది.

Related News

IND VS BAN: బంగ్లాతో నేడు సూప‌ర్ 4 ఫైట్‌…టీమిండియా గెల‌వాల‌ని పాకిస్థాన్, శ్రీలంక ప్రార్థ‌న‌లు

ICC -USA: ఆ క్రికెట్ జ‌ట్టుకు షాక్‌… సభ్యత్వ హోదాను రద్దు చేసిన ICC

Abrar Ahmed – Wanindu Hasaranga: పాక్ బౌల‌ర్‌ అబ్రార్ అస‌భ్య‌క‌ర‌మైన సైగ‌లు….ఇచ్చిప‌డేసిన‌ హ‌స‌రంగా

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

SL Vs PAK : త‌డ‌బ‌డ్డ శ్రీలంక.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

SL Vs PAK : టాస్ గెలిచిన పాకిస్తాన్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

Big Stories

×