E-Paper
Advertisement

Supreme Court: అదనపు న్యాయమూర్తిగా విక్టోరియా గౌరి నియామకం సరైనదే: సుప్రీంకోర్టు

Supreme Court: అదనపు న్యాయమూర్తిగా విక్టోరియా గౌరి నియామకం సరైనదే: సుప్రీంకోర్టు
Advertisement

Supreme Court: మద్రాసు హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా న్యాయవాది విక్టోరియా గౌరిని నియమించడాన్ని పలువురు న్యాయవాదులు వ్యతిరేకించిన విషయం తెలిసిందే. ఆమె నియామకాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేసి విచారణ చేపట్టింది. సరైన కారణాలు లేకుండా వేసిన పిటీషన్‌ను అంగీకరించబోమని కొట్టిపారేసింది.

ఈ పిటిషన్‌లో లేవనెత్తిన అంశం గౌరి అనుకూలమైన వ్యక్తి కాదా అన్న దాని గురించి అని.. అనుకూలతల విషయంలో కోర్టు జోక్యం చేసుకోలేదని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బి.ఆర్ గవాయ్‌తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. రాజకీయాలకు సంబంధించి కొలీజియం అన్నింటిని పరిశీలించినాకే ఆమె పేరును సిఫార్సు చేసిందని వెల్లడించింది. ఇక ఆమెను అదనపు న్యాయమూర్తిగా మాత్రమే నియమించారని.. శాశ్వత న్యాయమూర్తిగా సిఫార్సు చేసే సమయంలో కొలీజియం తన నిర్ణయాన్ని పున:పరిశీలించుకోవచ్చని తెలిపింది. అదనపు న్యూమూర్తుల పనితీరు బాగోలేకపోతే వారిని శాశ్వత జడ్జీలుగా నియమించని సందర్భాలు ఎన్నో ఉన్నాయని వివరించింది.

Advertisement

మరోవైపు విక్టోరియా గౌరి మద్రాసు హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన న్యాయమూర్తి ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయించారు. సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగానే ఆమె ప్రమాణం చేశారు.

Related News

జైల్లో ప్రజ్వల్ రేవణ్ణ లీలలు.. ఫోన్ ఓపెన్ చేసి చూసిన అధికారులకు మైండ్ బ్లాక్!

Illu Illalu Pillalu Today Episodes: తిరుపతి పెళ్లి అయిపోయిందోచ్.. వేధవతికి మైండ్ బ్లాక్.. ఇది అస్సలు ఊహించలేదు మావా..

కూటమిలో అసంతృప్తి.. జగన్‌కి ప్లస్ అవుతుందా?

పాడుబడిన పాత దేవాలయంలో దెయ్యం… కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే డిఫరెంట్ హర్రర్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ తెలుగులో

Karthika Deepam 2 Serial Today Episode September 11th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ చెంప పగుల గొట్టిన జ్యోత్స్న       

నా జీవితంలోకి వచ్చిన వ్యక్తికి ఆస్కార్ ఇవ్వొచ్చు.. జయం రవి భార్య పోస్ట్ వైరల్!

Karthika Deepam 2 Serial Today Episode September 9th ‘కార్తీకదీపం2’ సీరియల్‌: రాజీ కోసం కార్తీక్ దగ్గరకు వెళ్లిన దక్షిణమూర్తి 

ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ లో కీలక బాధ్యత… కృతజ్ఞతలు తెలిపిన సుస్మిత కొణిదెల !

Big Stories

Advertisement
×