E-Paper
Advertisement

Earthquake: ఈ దేశాల్లోనే భూకంపాలు ఎక్కువ.. ఎందుకంటే?

Earthquake: ఈ దేశాల్లోనే భూకంపాలు ఎక్కువ.. ఎందుకంటే?
Advertisement

Earthquake: అభివృద్ధి పేరుతో మానవుడు చేస్తున్న వినాశనం అంతా ఇంతా కాదు. ప్రకృతికి తీవ్ర నష్టం చేస్తున్నాడు. అయితే ప్రకృతి కూడా కన్నెర్రజేసి భూకంపాలు, సునామీల పేరుతో ప్రతీకారం తీర్చుకుంటోంది. నిత్యం పలు దేశాల్లో భూకంపాలు చోటుచేసుకుంటున్నాయి. వేలాది మంది మృత్యువాత పడుతున్నారు.

భూ ఫలకాల కదలికల వల్లే భూకంపాలు చోటుచేసుకుంటాయి. అయితే సున్నితమైన ప్రాంతాల్లో భూ ఫలకాలు ఎక్కువగా కదలడం వల్ల అక్కడ భూకంపాలు వచ్చే అవకాశం ఎక్కువ. జపాన్, ఇండోనేషియా, ఈక్వెడార్, ఫిలిప్పీన్స్ వంటి దేశాలు సున్నితమైన ప్రాంతాల్లో ఉండడంతో ఈ దేశాల్లో ఎక్కువగా భూకంపాలు వస్తుంటాయి.

Advertisement

ఈక్వెడార్‌లో ఎక్కువగా అగ్నిపర్వతాలు ఉండడం వల్ల అక్కడ భూకంపాలు సంభవించే అవకాశం ఎక్కువ. ఒక్క 2021లో ఈ దేశంలో ఏకంగా 23,735 సార్లు భూమి కంపించింది.

జపాన్.. భూకంపాలు, సునామీలకు పుట్టిన ఇల్లు. రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఈ దేశ భూభాగం ఎక్కువగా ఉండడంతో ఇక్కడ నిత్యం భూకంపాలు, సునామీలు సంభవిస్తుంటాయి. అక్కడి ప్రభుత్వం కూడా భూకంపాలు, సునామీలు వచ్చినప్పుడు తట్టుకునేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది.

Advertisement

ఇక భూకంపం అనగానే గుర్తొచ్చే మరో దేశం ఇండోనేషియా. ఇక్కడ చిన్న, మధ్యస్థాయి భూకంపాలు సర్వసాధారణం. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌లో ఈ దేశం ఉండడంతో భూకంపాలు ఎక్కువగా వస్తుంటాయి.

ఫిలిఫ్పీన్స్.. ఈ దేశంలో కూడా నిత్యం భూకంపాలు వస్తుంటాయి. రింగ్ ఆఫ్ ఫైర్‌కు సరిహద్దుల్లో ఈ దేశం ఉన్నప్పటికీ భూకంపాలు మాత్రం తరచూ సంభవిస్తుంటాయి. ఈ దేశంలో భూకంపాల వల్ల అగ్నిపర్వతాలు పేలిన సంఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి.

Related News

ఆఫ్రికా పెరిగింది, అమెరికా అలిగింది.. కొత్త ప్రపంచ పటానికి UN ఆమోదం

నేపాల్‌పై ప్రకృతి కన్నెర్ర.. భారీగా విరిగిన కొండచరియలు, నది ప్రవాహానికి అంతరాయం

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

Big Stories

Advertisement
×